వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే నయన్ విఘ్నేష్ దంపతులు వివాదంలో చిక్కుకున్నారు. తిరుమలలో ఫొటో షూట్, మాడవీధుల్లో చెప్పులతో నడవడంపై టీటీడీ నయన్ దంపతులకు నోటీసులు ఇచ్చి వివరణ కోరింది.
శ్రీవారి కల్యాణోత్సవ సేవలో నూతన దంపతులు నటి నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ పాల్గొన్నారు. నయనతార దంపతులు పెళ్లైన తర్వాత నేరుగా తిరుమలకు స్వామి వారి దర్శనానికి వచ్చారు. వివాహబంధంతో ఒక్కటైనా నయనతార విఘ్నేష్ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దాంపత్య జీవితంలో అడుగు పెట్టిన సినీ జంట నేరుగా తిరుమలకు చేరుకొని స్వామి వారి కల్యాణోత్సవ సేవలో పాల్గొన్నారు. స్వామి వారి కల్యాణాన్ని తిలకించిన అనంతరం వేంకటేశ్వరుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.
కల్యాణోత్సవంలో నయనతార దంపతులు
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన నయనతార దంపతులకు ఫొటో సూట్ వివాదం చుట్టుకుంది. నూతన దాంపత్య జీవితంలో అడుగు పెట్టిన నయనతార విఘ్నేష్ శివన్ లు నేరుగా శ్రీనివాసుడి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చారు. అలా వచ్చిన నయనతార దంపతులు స్వామి వారి కళ్యాణోత్సవ సేవలో పాల్గోన్నేందుకు నేరుగా ఓ బృందంతో మధ్యాహ్నం 12 గంటలకు కల్లా తిరుమలకు చేరుకున్నారు. నయనతార దంపతులు తిరుమలలోని ఎస్ఎంసీ కాటేజ్ వెనుక వైపు నుంచి సుపథం మార్గం చేరుకున్నారు. అయితే నయనతార దంపతులతో పాటుగా మొత్తం 26 మందిని టీటీడీ ఉద్యోగి సుపథం మార్గం ద్వారా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మీదుగా సామాన్య భక్తులతో పాటుగా శ్రీవారి ఆలయం తీసుకొచ్చారు. కల్యాణోత్సవ సేవలో కొంతసేపు గడిపిన నయనతార విఘ్నేష్ దంపతులు స్వామి వారి దర్శనంతరం ఆలయం బయటకు చేరుకున్నారు.
ఫొటో షూట్ వివాదం
సాధారణంగా తిరుమలలో కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో పాదరక్షలు ధరించకూడదని షరతులు ఉన్నాయి. ఆలయ మహా ద్వారం గుండా బయటకు వచ్చిన నయనతార వెంటనే పాదరక్షలు ధరించి నడిచి వచ్చారు. ఆ సమయంలో నయనతార దంపతులను చూసిన భక్తులు ఒక్కసారిగా వారితో ఫొటోలు దిగ్గేందుకు ఉత్సాహం చూపారు. నయనతార రక్షణ కల్పించేందుకు వచ్చిన బౌన్సర్ లు భక్తులను పక్కకు నెట్టుతూ భయాందోళనకు గురి చేశారు. ఆలయం నుంచి వచ్చిన నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు శ్రీవారి పుష్కరిణికి అభిముఖంగా ఫొటోలకు ఫోజులిచ్చారు. శ్రీవారి ఆలయం ముందు నయనతార దంపతులు ఫోటో షూట్ చేశారు. ఇది అంతా ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి ఆలయం ముందుగా నిర్వహించడంపై పలువురు భక్తులు మండిపడుతున్నారు. కలియుగ వైకుంఠనాధుడి విహరించే తిరుమాఢ వీధుల్లో సైతం నయనతార పాదరక్షణలు ధరించి నడిచారు. దీనిపై భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నయనతార ఎలా పాదరక్షలు ధరించి నడుస్తుందని ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా తిరుమలలో సినీ బృందంతో కొన్ని ఫొటో షూట్ లు చిత్రీకరించారు. ప్రస్తుత్తం నయనతార ఫొటో షూట్ చర్చనీయంగా మారింది. తిరుమల పవిత్రత దెబ్బ తీసే విధంగా ఎవరైనా ప్రయత్నిస్తే వారిపై కఠినంగా వ్యవహరించే టీటీడీ నయనతార ఫొటో షూట్ వ్యవహారంలో ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
మా కాళ్లకు చెప్పులు ఉన్నాయని గుర్తించలేకపోయాం..
నూతన జంట నయనతార, విఘ్నేశ్ శివన్.. తిరుమల మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగడం.. ఆలయ ఆవరణలో ఫొటోషూట్ చేసుకోవడంతో వివాదం తలెత్తింది. దీంతో తితిదే అధికారులు ఈ జంటపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వివాదంపై క్షమాపణలు చెబుతూ.. విఘ్నేశ్ శివన్ తాజాగా ఓ లేఖ విడుదల చేశారు.
నూతన జంట నయనతార, విఘ్నేశ్ శివన్ తాజాగా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తిరుమల మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగడం.. ఆలయ ఆవరణలో ఫొటోషూట్ చేసుకోవడంతో ఈ వివాదం తలెత్తింది. దీంతో తితిదే అధికారులు ఈ జంటపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వివాదంపై వివరణ ఇస్తూ విఘ్నేశ్ శివన్ తాజాగా ఓ లేఖ విడుదల చేశారు.
క్షమాపణలు చెబుతూ విఘ్నేశ్ శివన్ లేఖ ఆ సమయంలో తమ కాళ్లకు చెప్పులు ఉన్న సంగతి గుర్తులేదని చెప్పుకొచ్చారు. దేవుడిపై తమకు అపారమైన నమ్మకం, భక్తి ఉందని.. తాము తెలియక చేసిన తప్పుకు క్షమించాలని కోరారు.‘‘తిరుమలలోనే పెళ్లి చేసుకోవాలని ఎంతోకాలంగా అనుకున్నాం. ఈ క్రమంలోనే గడిచిన 30 రోజుల్లోనే 5 సార్లు ఈ కొండకు వచ్చాం. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాకపోవడంతో మహాబలిపురంలో చేసుకోవాల్సి వచ్చింది. అయితే, పెళ్లైన వెంటనే మండపం నుంచి నేరుగా తిరుమలకు వచ్చి స్వామి కల్యాణం వీక్షించి.. ఆశీస్సులు తీసుకోవాలనుకున్నాం. అదే విధంగా శుక్రవారం స్వామివారి దర్శనం చేసుకున్నాం. దర్శనం అనంతరం మా పెళ్లి ఇక్కడే జరిగిందనే భావన కలగడం కోసం ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఆలయ ఆవరణలో ఫొటోషూట్ చేసుకోవాలనుకున్నాం.
కాకపోతే ఆసమయంలో ఆలయ ఆవరణలో భక్తులు ఎక్కువగా ఉండటం వల్ల వెళ్లిపోయి.. మళ్లీ తిరిగి అక్కడికి వచ్చాం. ఫొటోషూట్ వెంటనే పూర్తి చేయాలనే గందరగోళ పరిస్థితుల్లో మా కాళ్లకు చెప్పులు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోయాం. దేవుడిపై మాకు అపారమైన నమ్మకం ఉంది. మేము ఎంతగానో ఆరాధించే స్వామి వారిని అవమానించడానికి ఇలా చేయలేదు. దయచేసి మమ్మల్ని క్షమించండి’’ అని విఘ్నేశ్ శివన్ రాసుకొచ్చారు.
అసలేం జరిగింది.. ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్న నయనతార-విఘ్నేశ్ శివన్ తమిళనాడులోని మహాబలిపురంలోని ఓ ప్రముఖ హోటల్‌లో వివాహం చేసుకున్నారు. ఈ జంట తిరుమల స్వామి సేవలో పాల్గొంది. దర్శనం అనంతరం ఈ దంపతులు ఆలయం ఎదుట ఫొటోషూట్ తీయించుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మాడ వీధుల్లో పాదరక్షలతో తిరిగారు. గుర్తించిన భక్తులు పెద్దఎత్తున అక్కడికి చేరుకొని, అభ్యంతరం తెలిపారు. మాడ వీధుల్లో పాదరక్షలతో తిరగడం, అనుమతుల్లేకుండా ఫొటోషూట్ నిర్వహించడంపై సీవీఎస్‌వో నరసింహప్రసాద్ మీడియాతో మాట్లాడారు. నయనతారకు నోటీసులు జారీ చేస్తామన్నారు
తెలిసి తెలియక తప్పు
సినీ నటి నయనతార శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో చెప్పులతో తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీటీడీ అధికారులు సీరియస్ అయ్యారు. కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉండటంతో నయనతారకు నోటీసులు జారీ చేయనున్నట్లు అంతకు ముందు టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్ వెల్లడించారు. మీడియా సమావేశంలో సీవీఎస్వో కిషోర్ మాట్లాడుతూ ఆలయ మాడ వీధుల్లో చెప్పులతో నయనతార నడిచినట్లు గుర్తించామన్నారు. ఫొటో సూట్ నిర్వహించినట్లు విజువల్స్ ద్వారా స్పష్టంగా అర్థం అవుతోందని, టీటీడీ రూల్స్ కు వ్యతిరేకంగా నయనతార వ్యవహరించారని తెలిపారు. టీటీడీ రూల్స్ ప్రకారం ఆలయ మాడ వీధుల్లో చెప్పులు వేసుకొని నడవరాదనే నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు. టీటీడీ విజిలెన్స్ తరపున నయనతారకు నోటీసు జారీ చేయనున్నామని స్పష్టం చేశారు. చెప్పులు, ఫొటో షూట్ వ్యవహారంపై ఆమెను ప్రశ్నించడం జరిగిందన్న ఆయన….భక్తుల మనోభావాలు దెబ్బ తిని ఉంటే స్వామి వారికి, టీటీడీకి, భక్తులకు క్షమాపణ చెప్తానని నయనతార వెల్లడించారని చెప్పారు. నోటీసులు జారీ చేసిన అనంతరం ఆమె వద్ద నుంచి వచ్చే సమాధానం ఆధారంగా చర్యలు చేపడుతామన్నారు. తప్పు జరిగిందని మాతో నయనతార ఒప్పుకున్నారు. కావాలని చేసింది కాదు తెలియక చేశామని పేర్కొన్నారు. దీనిపై వీడియో రిలీజ్ చేస్తామని విగ్నేష్, నయనతార చెప్పారని వెల్లడించారు.
దయచేసి మమ్మల్ని క్షమించండి.. విఘ్నేశ్ శివన్ లేఖ
పెళ్లి వేడుకతో సంతోషంగా ఉన్న నయన్ దంపతులు లేని చిక్కులు కొనితెచ్చుకున్నారు. పెళ్లి తరువాత తొలిసారి తిరుమల క్షేత్రాన్ని దర్శించిన ఈ నవ దంపతులు.. ఆదిలోనే వివాదాలపాలయ్యారు. నయనతార చెప్పులు ధరించి శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో నడవడం రచ్చకు కారణమైంది. అయితే, ఈ వివాదంపై వివరణ ఇస్తూ విఘ్నేశ్ శివన్ తాజాగా ఓ లేఖ విడుదల చేశారు. ఆ సమయంలో తమ కాళ్లకు చెప్పులు ఉన్న సంగతి గుర్తులేదని చెప్పుకొచ్చారు. దేవుడిపై తమకు అపారమైన నమ్మకం, భక్తి ఉందని.. తాము తెలియక చేసిన తప్పుకు క్షమించాలని కోరారు.
‘అందరికీ నమస్కారం.. నిజానికి మేము తిరుమలలోనే వివాహం చేసుకోవాలనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల చెన్నైలో చేసుకోవాల్సి వచ్చింది. దీంతో వివాహం అయిన వెంటనే కనీసం ఇంటికి కూడా వెళ్లకుండానే శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు వెళ్లాము. దర్శనం ముగిసిన వెంటనే ఆలయం ముందు ఫొటో తీసుకోవాలని భావించాము. నయనతార దంపతుల ఫోటో షూట్‌పై టీటీడీ సీరియస్ అయితే భక్తులు భారీగా ఉండడంతో అక్కడి నుంచి వెళ్లి, మళ్లీ రద్దీ తగ్గగానే తిరిగి వచ్చాము. ఫొటోషూట్ వెంటనే పూర్తి చేయాలనే గందరగోళ పరిస్థితుల్లో మా కాళ్లకు చెప్పులు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోయాం. దేవుడిపై మాకు అపారమైన నమ్మకం ఉంది. మేము ఎంతగానో ఆరాధించే స్వామి వారిని అవమానించడానికి ఇలా చేయలేదు. దయచేసి మమ్మల్ని క్షమించండి” అని విఘ్నేశ్ శివన్ రాసుకొచ్చారు.