రాష్ట్రంలో ఎటు చూసినా నిరుద్యోగం, ఆకలితోనే ప్రజలు అలమటిస్తున్నారు. అభివృద్ధి అనేది కుంటుపడింది. రాజకీయ పార్టీలు తమ మనుగడ కోసం పోరాడుతున్నాయి కానీ ప్రజల గురుంచి వారి అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదు. ప్రజల కోసం మేమున్నాం అని ధైర్యంగా చెప్పేదే మా ఈ యదార్థం. మా వెబ్సైటులో ఆర్టికల్స్ ద్వారా ప్రజలకు మార్గాన్ని సూచిస్తాం, ప్రభుత్వానికి లక్ష్యాల్ని వివరించి మార్గనిర్దేశనం చేస్తాం. మేము ప్రజల మనుషులం.. మాది పీపుల్స్ జర్నలిజం. జర్నలిజం అంటే అక్షరాలను ఆయుధాలుగా మార్చేది కాని అవినీతిపరులకు కొమ్ముకాసేది కాదు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిస్తూనే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏమి కావాలి అనే అంశాల్ని , వాటి పరిష్కార మార్గాల్ని కూడా నిర్దేశిస్తాం. పీపుల్స్ జర్నలిజంతో పాటు క్రియేటివ్ జర్నలిజంకి కూడా మేము పెద్ద పీట వేస్తాం. ఇందులో భాగంగా యువతను ప్రోత్సహించాలని నిర్ణయించాం. వాళ్ళ గొంతుకకు మేము పునాది వేస్తాం. యువతరం ఆలోచనలను మా ఈ యదార్థంలో ప్రచురించి ఈ ప్రపంచానికి వినిపిస్తాం. ఎవరైనా సరే తమ అభిప్రాయాలు చెప్పాలనుకున్నా, కంటెంట్ ఇవాలనుకున్నా మీకు సదా స్వాగతం చెప్తుంది మా యదార్థం.. ప్రజలను, ప్రభుత్వాన్ని బ్యాలెన్స్ చేస్తూ మీరు రాసే మంచి ఆర్టికల్స్ ని మాకు పంపిస్తే మా వెబ్సైటులో పొందుపరుస్తాం. మా ఈ పీపుల్స్ జర్నలిజంలో మీరు కూడా భాగస్వాములు కావడానికి ఇదొక గొప్ప అవకాశం. రాష్ట్రంలో జరిగే ప్రతీ విషయంపై నిఘా పెట్టడమే మా లక్ష్యం. ప్రజలకు ఏం చేయాలి అనే దాని గురించే మా యదార్థం ఎప్పుడూ ఆలోచిస్తుంది .. ప్రజలకు తెలియని విషయాలను కూడా పరిశీలించి, పరిశోధించి, సమగ్రంగా, సంక్షిప్తంగా అందిస్తుంది . ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలబడతూనే ఈ రాష్ట్ర సంక్షేమాన్ని కూడా సాధించే దిశగా అడుగులు వేస్తుంది. అబద్దం ఎప్పుడూ చీకటిలోనే ఉంటుంది, యదార్ధం వెలుగులో నిలబడి నిజాలు మాత్రమే మాట్లాడుతుంది. ప్రజల కోసం మా టీమ్ ఎల్లప్పుడూ అండగా నిలబడుతుంది.
ప్రజల కోసం.. ప్రజలతోనే మా అక్షరం…