సాంధ్రవ్యవసాయ పధకం అమలు చేసిన ఉభయ గోదావరి జిల్లాల్లో క్రాఫ్ హాలీడేకి వరి రైతుల సిద్దపడుతున్నారంటే వరి రైతు ఎంత దైన్యస్దితిలో ఉన్నాడో అర్ధం అవుతోంది. వెంటనే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు డిమాండ్ చేశారు . రైస్ బోల్ ఆఫ్ ఇండియా గా కీర్తించబడిన గోదావరి జిల్లాల రైతులు నేడు వ్యవసాయాన్ని వదులుకొనే పరిస్తితి తీసుకువస్తోంది రాష్ట్రప్రభుత్వం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 12 లక్షల ఎకరాల్లో వరి సాగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం ఈ వ్యవసాయ జిల్లాల్లో ఖరీఫ్, రబీ పంటలు వేసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోక పోవడం ప్రభుత్వం రైతులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించక పోవడంతో పాటు చేతికి అందిన ధాన్యాన్ని మార్కెట్ చేయడంలో ప్రభుత్వం భాద్యత తీసుకోకుండా రైతులను గాలికి వదిలేయడంతో నష్టాల ఊబిలోకి గెంటేయడంతో వరి రైతు కంట కన్నీరు మిగులుతోంది. అయినా ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదని సోమువీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు దశాభ్ధాలుగా పంట కాల్వలను ఆధునీకరించలేదు ఇదేమిటని అడిగితే కాంట్రాక్టర్లు రావడంలేదని మాత్రం ఇరిగేషన్ శాఖ అధికారులు టక్కున చెబుతారు ఎవరు వ్యవసాయ మంత్రిగా వచ్చినా ఈవిషయంలో మాత్రం మాట్లాడరు. 15 సంవత్సరాల క్రితం పంట కాల్వల ఆధునీకరణకు ఆనాడుప వైఎస్ రాజశేఖర్ రెడ్డి పంట కాల్వల ఆధునీకరణ కోసం శంకుస్దాపనలు చేశారు ఆ శిలాఫలకాలు నేటికీ కనపడుతున్నాయి తప్ప ఇంతవరకు రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా కాల్వలు ఆధునీకరణ పనులు చేయలేదు. తండ్రి వేసిన శంకుస్దాపన శిలాఫలకాలు కనపడుతున్నా ఆయన కుమారుడు ముఖ్యమంత్రి గా మూడు సంవత్సరాలు పూర్తి అయినా ఇంతవరకు కాల్వల ఆధునీకరణ చేయలేదు ఈ కారణంగా కాల్వ శివారు భూములకు సాగునీరు అందని పరిస్థితి ఏర్పడిందని సోమువీర్రాజు పేర్కొన్నారు.
ఖరీఫ్ సీజన్ లో నాణ్యత లేని వరి విత్తనాలు ఇవ్వడం వల్ల రైతు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎపి సీడ్స్ సంస్ధ ద్వారా కూడా నాణ్యతలేని విత్తనాలు ఇచ్చిన సందర్భాలున్నాయి అయితే ప్రభుత్వాలు మాత్రం చర్యలు తీసుకున్న సందర్భాలు శూన్యం.
సీజన్ చూసి ఎరువులు కంపెనీలు రైతులను నట్టేట ముంచుతున్నారు. నరేంద్రమోదీ ప్రధాని అయిన తరువాత రైతులకు కొంత ఆసరా దొరుకుతోంది అయితే అదే స్దాయిలో రాష్ట్రప్రభుత్వం చేయూత నివ్వక పోవడంతో దేశానికి అన్నంపెట్టే రైతుకు ఆసరా అందని పరిస్థితి ఏర్పడింది.
ఒక దశాభ్ధ కాలంగా ఖరీఫ్ ను సాంప్రదాయానికి భిన్నంగా జూన్ మొదటి వారంలోనే వరినాట్లు పూర్తి చేయాలని శాస్త్ర వేత్తలు నెత్తినోరు బాదుకుంటున్నా పాలక ప్రభుత్వాలు వారి మెర ఆలకించడంలేదు అందువల్ల ప్రక్రుతి వైపరీత్యాలు కారణంగా ప్రతి సంవత్సరం నష్టాలు చెవి చూస్తున్నారు. జూన్ మాసంలో వరినాట్లు వేయాలంటే సకాలంలో కాల్వలకు నీరు ఇవ్వాలి ఇచ్చిన నీరు శివారు భూములకు అందాలంటే కాల్వల ఆధూనీకరణ అవసరం ఇంతటి అవసరాన్ని రాష్ట్రప్రభుత్వాలు గుర్తించడంలేదు వ్యవసాయ భూములు బీడు భూములు గా మారి పోయే పరిస్తితి ఏర్పడుతోంది.
వ్యవసాయ యాంత్రీకరణకు కేంద్రం ప్రభుత్వం సహకరిస్తున్నా రాష్ట్రం అమలు చేయడంలేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్ లో ధర లేకుండా దళారులు మాయ చేస్తున్నారు ఈ విషయంలో మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు కుమ్ముక్కై రైతును నట్టేట ముంచుతున్నారు. రైతు వద్ద ధాన్యం ఉండగా గొనె సంచులు కొరత స్రుష్టిస్తారు ఆ సమస్య పరిష్కారం అయ్యాక రైతుకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర అందకుండా రైస్ మిల్లర్లు లాజిక్ లు ప్రయోగిస్తారు ఇదంతా ప్రభుత్వానికి తెలిసినా తెరవెనక వీరిద్దరి మద్య సయోద్యే దీనికి కారణం
ప్రస్తుతం ధాన్యం ఆర్ బికె సెంటర్లలో కొనుగోలు చేసినా సకాలంలో సొమ్ము చెల్లించడంలేదని సోము వీర్రాజు ఆరోపించారు.
వారం కాదు నెలల సమయం అంటే రైతు చేసిన అప్పులు ఎలా తీర్చేది అనేది రైతు ముందు ఉన్న ప్రశ్న ఈ సంవత్సరం రైతు పరిస్థితి దారుణంగా మారిపోయింది..ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న తంతు 2011…12 వ్యవసాయ సంవత్సరంలో సుమారు లక్షా 10 వేల ఎకరాల్లో క్రాఫ్ హాలిడే రైతులు ప్రకటించారు ఆనాడు బిజెపి సీనియర్ నేత రాజ్ నాధ్ సింగ్ ఈ ప్రాంతంలో పర్యటించి ఆనాటి ఇక్కడి వ్యవసాయ పరిస్ధితిలు దేశానికి తెలియ చేసే విధంగా ఆనాడు భారతీయ జనతాపార్టీ ప్రయత్నం చేసింది..అయితే ఆతరువాత అనేక సందర్భాల్లో రైతులు క్రాఫ్ హాలిడే ప్రకటించినా క్షేత్రస్ధాయిలో పాలకులు పట్టించుకోలేదు.
గత సంవత్సరం నెల్లూరు జిల్లా లో కూడా 40 వేల ఎకరాల్లో క్రాఫ్ హాలీడే ప్రకటించారు. ఈ సంవత్సరం మాగాణీ భూములు ఉన్న కోనసీమ ప్రాంతంలోని సుమారు ఆరు ప్రాంతాల్లో క్రాఫ్ హాలీడేకి సిద్దపడుతున్నారు .. క్రాఫ్ హాలీడే అనేపదం రాష్ట్రప్రభుత్వానికి అసలు తెలుసా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న .. క్రాఫ్ హాలీడే అంటే ఆ రైతు తన జీవనాధారానికి ఆరుమాసాలు సెలవు అంటే అతని జీవనం పై ఆర్థిక పరిస్తితి ఏంటనేది రాష్ట్రప్రభుత్వం తెలుసుకోవాలి వ్యవసాయ మంత్రి ఈ విషయంలో సీరియస్ గా వ్యవహరించాలి అదిశగా వ్యవసాయ మంత్రి పట్టించుకోక పోతే వేలాది మంది రైతుల ఆర్ధిక పరిస్థితి తలకిందులౌతుంది. క్రాఫ్ హాలీడే అంటే వ్యవసాయ ఎమర్జెన్సీకింద భావించాల్సిన పరిస్తితి ఉంటుంది ఆదిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి