తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ నేటితో ముగియడంతో అతడిని పోలీసులు ఎస్కార్ట్ సాయంతో కేంద్ర కారాగారం నుంచి తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపరిచారు.
విచారణ అనంతరం రిమాండ్ గడువు పెంచడంతో తిరిగి రాజమండ్రి జైలుకు తరలించారు. మే 23 నుంచి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు బెయిల్ పిటిషన్‌ను రెండుసార్లు కోర్టు కొట్టివేసింది. కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు.. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ను మరో 15 రోజుల పాటు పొడిగించారు. నేటితో రిమాండ్ ముగియడంతో పోలీసులు ఎస్కార్ట్ సాయంతో అనంతబాబును కేంద్ర కారాగారం నుంచి తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం రిమాండ్ గడువు పెంచడంతో తిరిగి రాజమండ్రి జైలుకు తరలించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మే 23 నుంచి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు బెయిల్ పిటిషన్‌ను.. గత నెల 17న కోర్టు కొట్టి వేసింది. గత నెల 19న రాత్రి 8.30 గంటల సమయంలో సుబ్రహ్మణ్యం ఆయన స్నేహితులతో కలిసి ఇంటి నుంచి బయటకొచ్చారు. కొండయ్యపాలెంలోని నవభారత్ స్కూల్ ప్రాంగణంలో రాత్రి 10.15 వరకూ మద్యం తాగారు. ఆ సమయంలో కారులో అటువైపు వెళ్తున్న ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని చూసి తనతోపాటు వాహనంలో తీసుకెళ్లారు
ఎస్పీ వాదనకు పూర్తి భిన్నంగా మృతుడి భార్య అపర్ణ వాదన ఉంది. ‘ఎమ్మెల్సీ అనంతబాబు పుట్టినరోజు నాలుగు నెలల కిందటే అయిపోయింది. అయినా తన పుట్టినరోజని చెప్పి 19న నా భర్తను ఇంటి నుంచి అనంతబాబు తీసుకెళ్లారు. ఆయన రహస్యాలు, వివాహేతర సంబంధాల గురించి నా భర్తకు తెలుసు. అందుకే చంపేసి శవాన్ని ఇంటికి తీసుకొచ్చారు’ అని వాపోయారు. పోలీసులు ఆ వాదనను పట్టించుకోలేదు. పోలీసులు చెబుతున్నదే నిజమనుకున్నా… సుబ్రహ్మణ్యం ఉన్న వైపే అనంతబాబు కారు వెళ్లటం, అతన్ని చూడటం కాకతాళీయమా? పథకం ప్రకారమే జరిగిందా? అనే అనుమానాలున్నాయి.
మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయభాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో కాకినాడ పోలీసులు సక్రమంగా విచారణ నిర్వహించడంలేదని ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం (ఏపీసీఎల్ఏ) రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి, సభ్యుడు జి.శ్రీనివాసరావుతో కూడిన బృందానికి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నూకరత్నం, సత్యనారాయణ, సోదరుడు నవీన్‌తో కలిసి ఫిర్యాదుచేశారు. అనంతరం సుబ్బారావు మాట్లాడుతూ సుబ్రహ్మణ్యం హత్యకేసు ఏ విధంగా పక్కదోవ పట్టించే ప్రయత్నాలు జరిగిందో 58 పేజీల డాక్యుమెంట్ ఆధారాలు, కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు అనంతబాబుకు అనుకూలంగా మాట్లాడిన సీడీని, ఫిర్యాదు పత్రాన్ని కమిషన్‌కు ఇచ్చినట్టు తెలిపారు.