తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి కేసీఅర్ అన్ని వర్గాలను మోసం చేశారు అని, ముమ్మాటికీ కేసీఅర్ మోసగాడు అని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు… పాదయత్రలో భాగంగా సూర్యాపేట మండలం తాళ్ళ ఖమ్మం పహాడ్ గ్రామంలో వైఎస్ షర్మిల గ్రామస్తులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు… తొలుత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు… అనంతరం ప్రజలను ఉద్దేశించి మట్లాడుతూ ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం, ఈసారి ఆలోచన చేసి ఓట్లు వేయండి అని సూచించారు. కేసీఅర్ డబ్బులు ఇస్తాడు..తీసుకోండి.. ఆ డబ్బులు మీవే.. కమీషన్ల రూపం లో కాజేసినవే అన్నారు. ఎలక్షన్లు వస్తున్నాయి…మళ్ళీ కేసీఅర్ మీ ముందుకు వస్తాడు. గాడిదకు రంగు పూసి ఆవు అని నమ్మిస్తాడు. ఈ సారి ఎస్టీ బందు…బిసి బందు అని ప్రచారంతో నమ్మిస్తాడు.. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రశ్నించడం లేదు. పాలక పక్షానికి అమ్ముడు పోయి… టీఆర్ ఎస్ సంకన ఎక్కికూర్చున్నారు. ప్రతిపక్షాలు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు. కేసీఅర్ అవినీతి పై బీజేపీ ఆధారాలు ఉన్నాయని చెప్తుంది. ఆధారాలు ఉన్నప్పుడు ఎందుకు బయట పెట్టడం లేదు..అరెస్ట్ చేయడం లేదు అని ప్రశ్నించారు. బీజేపీ కాంగ్రెస్ కు ఎందుకు ఓట్లు వేయాలి అలోచించాలన్నారు.
రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసింది బీజేపీ, 8 ఏళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అసలు పట్టించు కొనే వాడే లేడు అన్నారు. వైఎస్సార్ సంక్షేమం కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టాం అని గుర్తు చేశారు.. ఈ రోజుల్లో మాట మీద నిలబడే నాయకుడు లేడు. కేసీఅర్ ను తన్ని తరిమేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి అన్నారు.. ఇచ్చిన మాట కోసం మాట మీద నిలబడే రాజన్న బిడ్డ గా హామీ ఇస్తున్నారు.
వైఎస్సార్ సంక్షేమ తెలంగాణ స్థాపించడమే మన లక్ష్యం. ఆశీర్వదించండి….రైతు రాజు చేస్తా…మహిళలను ఆర్థికంగా నిలబెడత… కౌలు రైతుల సంక్షేమం కోసం పని చేస్తాం అన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ…ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయడం జరుగుతుంది.. ఇంట్లో ఎంత మంది వృద్దులు,వికలాంగులు ఉంటే అందరికీ 3 వేలు తక్కువ కాకుండా పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు.