సీఎం నివాసం నుంచి సీకే కన్వెన్షన్‌కి వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్, ద్రౌపది ముర్ము, కిషన్ రెడ్డి. ద్రౌపది ముర్ముకు తేనీటి విందు ఇవ్వనున్నారు సీఎం జగన్. ద్రౌపది ముర్మును వెంట పెట్టుకుని సీకే కన్వేన్షన్ సెంటరుకు చేరుకున్నారు సీఎం జగన్. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను ద్రౌపది ముర్ముకు పరిచయం చేయనున్నారు సీఎం జగన్. తన అభ్యర్థిత్వానికి మద్దతివ్వాలని వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కోరనున్నారు ద్రౌపది ముర్ము. మరోవైపు సీకే కన్వెన్షనుకు చేరుకుంటున్నారు ఏపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.. మంగళవారం ఆంధ్రప్రదేశ్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న ప్రాంతంలో గన్నవరం విమానాశ్రయంలో ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు బీజేపీ నాయకులు సోము వీర్రాజు, సీఎం రమేష్, ఎమ్మెల్సీ మాధవ్, జీవీయల్ నర్సింహారావు. వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, గోరంట్ల మాధవ్, మార్గాని భారత్, మిథున్ రెడ్డి, మంత్రి జోగి రమేష్. ఆమెకు గిరిజన సంప్రదాయంలో ఎంపీలు ఘన స్వాగతం అందించారు. అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి ద్రౌపది ముర్ము రోడ్డు మార్గంలో విజయవాడుకు చేరుకున్నారు. ద్రౌపది ముర్ము వెంట కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. ఏపీ పర్యటనకు వచ్చిన ద్రౌపది ముర్ము.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు.