అక్కడేముంది..అంతా స్మశానం.. ఏమీ అభివృద్ధి లేదు..అంతా అడివి.. మాకు అమరావతి అక్కర్లేదు…ఇదీ అప్పట్లో మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్.. సరిగ్గా మూడేళ్లు తిరిగేసరికి అదే అమరావతి ఇప్పుడు ప్రభుత్వానికి ఆధారం అయింది.. వేల కోట్ల అప్పులు.. పంపకాలు..పథకాలు నడవాలంటే ఆదాయం ఉండాలి.. అందుకే ఇక అప్పులు చేసే దారిలేక అమరావతి భూములు విక్రయించి డబ్బులు సమీకరించాలని సర్కారు నిర్ణయించింది… దీనికోసం సర్కారు వేలంపాట నిర్వహిస్తోంది… అదే ఇప్పుడు తాజా ట్రెండింగ్ సర్కారువారి పాట… అమరావతి భూముల్ని వేలం వేయడమే కాదు ఇప్పుడు అక్కడ కట్టిన భవనాలను కూడా అద్దెకు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు సీఆర్డీఏ ప్రతిపాదించింది. సీఎం జగన్ ఆమోదించేశారు. అమరావతిలో అసలు పనులేమీ జరగలేదని… అన్నీ గ్రాఫిక్సేనని విపరీతంగా ప్రచారం చేశారు. అమరావతిని స్మశానం అన్నారు. ఇప్పుడు ఆ స్మశానంలో స్థలాలను ఎకరాల కొద్దీ అమ్మాలని నిర్ణయించడమే కాకుండా గ్రాఫిక్స్ అని చెప్పిన వాటితోనే ఏడాదికి రూ. పది కోట్ల ఆదాయం కళ్ల జూడాలని డిసైడయ్యారు. అసలు పూర్తిగా నిర్వీర్యం చేసిన అమరావతి నుంచి ప్రభుత్వానికి ఇంత ఆదాయం వస్తూంటే.. నిజంగా అభివృద్ధి చేసి ఉంటే.. కాసుల పంట పండి ఉండేది కాదా అని చాలా మందికి వస్తున్న సందేహం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వం ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూనే ఉంది. మూడు రాజధానుల వ్యవహారం .. న్యాయ పరమైన చిక్కులతో బిల్లులను ఉప సంహరించుకున్న ప్రభుత్వం..ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో నిర్మాణాలు ఆరు నెలల్లోగా పూర్తి చేయాలంటూ హైకోర్టు గత మార్చిలో ఆదేశాలు ఇచ్చింది. ఇక, నిర్మాణంలో సగంలో నిలిచిపోయిన నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం నిధుల అన్వేషణ ప్రారంభించింది. ఏ బ్యాంకు నుంచి రుణం పైన హామీ రాలేదు. దీంతో.. అమరావతి భూములనే విక్రయించి..అక్కడ నిర్మాణాలను పూర్తి చేసే విధంగా నిర్ణయం తీసుకుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వం ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూనే ఉంది. మూడు రాజధానుల వ్యవహారం .. న్యాయ పరమైన చిక్కులతో బిల్లులను ఉప సంహరించుకున్న ప్రభుత్వం..ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో నిర్మాణాలు ఆరు నెలల్లోగా పూర్తి చేయాలంటూ హైకోర్టు గత మార్చిలో ఆదేశాలు ఇచ్చింది. ఆరు నెలలు కాదు..అరవై నెలల సమయం కావాలంటూ ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
ఇక, నిర్మాణంలో సగంలో నిలిచిపోయిన నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం నిధుల అన్వేషణ ప్రారంభించింది. ఏ బ్యాంకు నుంచి రుణం పైన హామీ రాలేదు. దీంతో.. అమరావతి భూములనే విక్రయించి..అక్కడ నిర్మాణాలను పూర్తి చేసే విధంగా నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాల మేరకు రాజధాని అమరావతిలో నిర్మాణాలు, మౌలిక సదుపాయలను కల్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిధుల సేకరణకు రాజధానిలో ఉన్న భూములను విక్రయించేందుకు సీఆర్డీఏ ప్రణాళిక రూపొందించింది. తొలి విడతలో 248.34 ఎకరాలు విక్రయించాలని నిర్ణయించింది. ఎకరానికి రూ.10కోట్ల చొప్పున రూ.2480 కోట్లు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
వేలం ద్వారా భూముల విక్రయానికి అనుమతిస్తూ ఇటీవల 389 జీవోను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. పురపాలక శాఖ ద్వారా ఈ జీవోను జారీ చేశారు. వచ్చే నెలలోనే వేలం ద్వారా భూములను విక్రయించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో మెడ్‌సిటీ కోసం ఇచ్చిన 100 ఎకరాలతో పాటు, లండన్ కింగ్స్ కాలేజీ నిర్మాణం కోసం 148 ఎకరాలు ఇచ్చేందుకు గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆయా సంస్థలు నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఆ భూములను వేలం వేయాలని క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(సీఆర్డీఏ) నిర్ణయించింది. పురపాలకశాఖపై ఇటీవల సీఎం నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అమరావతి నిర్మాణానికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాకపోవడంతో సొంతంగా నిధులు సమకూర్చుకునేందుకు భూములు అమ్మాలని సీఆర్డీఏ నిర్ణయించింది. వచ్చే ఏడాది కూడా 600 ఎకరాలు దశల వారీగా విక్రయించేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు తెలుస్తోంది. తొలి విడతలో మాత్రం 248.34 ఎకరాలను విక్రయించాలని భావిస్తున్నారు. తద్వారా రూ.2,480 కోట్లు సమీకరించాలని నిర్ణయించారు.
అమరావతి భూములు అమ్మేద్దాం !
సంక్షేమం సహా ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ఎడా పెడా అప్పులు చేస్తున్న ప్రభుత్వం.. కీలకమైన రాజధాని అమరావతి అభివృద్ధి విషయంలో మాత్రం అప్పులకు బదులు ‘అమ్మకం’ మంత్రం పఠిస్తోంది. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులను తానివ్వక.. అప్పు చేద్దామంటే హామీ కూడా ఉండక.. ఇక్కడి భూములు అమ్మేసి నిధులు సమకూర్చుకునేందుకు సర్కారు పచ్చజెండా ఊపింది. ఫలితంగా ఎంతో దూరదృష్టితో రాష్ట్ర అభివృద్ధి కోసం రైతులు ఇచ్చిన భూముల విక్రయానికి రంగం సిద్ధమైంది.
అమరావతిలో రైతుల నుంచి భూ సమీకరణ విధానంలో సేకరించిన భూములను అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి వ్యవహారాలను పర్యవేక్షించే రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ(సీఆర్డీయే) దీనికి సంబంధించిన ప్రణాళిక రూపొందించింది. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన పేరుతో వివిధ సంస్థలకు కేటాయించిన భూములను అమ్ముకోవటానికి వీలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో 389) ఇచ్చింది. దీంతో భూసమీకరణలో భాగంగా రైతులు ఇచ్చిన వేల ఎకరాల్లో.. తొలి విడతలో 248.34 ఎకరాలను విక్రయించాలని సీఆర్‌డీయే నిర్ణయించింది. ఎకరాకు రూ.10 కోట్ల చొప్పున రూ.2,480 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. నిర్దేశిత భూములను జూలైలో వేలం వేయనున్నారు. గత ప్రభుత్వం రాజధానిలో మెడ్‌సిటీ కోసం 100 ఎకరాలను కేటాయించింది. అదేవిధంగా లండన్ కింగ్స్ కాలేజీ నిర్మాణం కోసం 148.34 ఎకరాలు ఇచ్చింది. అయితే, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ‘మూడు రాజధానులు’ అని ప్రకటించడంతో అమరావతిపై అనిశ్చితి ఏర్పడింది. దీంతో ఆయా సంస్థలు ముందుకురాలేదు. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో చివరకు అమరావతిలోనే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అనివార్య పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. దీనికిగాను అప్పట్లో ఆయా సంస్థలకు ఇచ్చిన స్థలాలను వేలం వేయాలని నిర్ణయించింది.
ప్రభుత్వం హామీ
అమరావతే రాజధాని అంటూ హైకోర్టు విస్పష్టంగా తీర్పు ఇచ్చిన అనంతరం.. అక్కడ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాల్సిందేనని చెప్పిన తర్వాత బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. పలు బ్యాంకులతో సీఆర్డీయే సంప్రదింపులు జరిపింది. అయితే, ఏ బ్యాంకు కూడా అప్పు ఇచ్చేందుకు ముందుకురాలేదు. ఇప్పటికే అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి.. ఇంకా అప్పులిచ్చేందుకు బ్యాంకులు సుముఖత చూపలేదని సమాచారం. అయితే, సీఆర్డీయేకు రుణం ఇచ్చేందుకు కొన్ని బ్యాంకులు మాత్రం సుముఖత చూపాయని తెలిసింది. కానీ, ఆ రుణాలకు ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని షరతు విధించాయి. దీనికి ప్రభుత్వం సంసిద్ధత చూపకపోవడంతో బ్యాంకులు వెనక్కి తగ్గాయని సమాచారం. కార్పొరేషన్ల ద్వారా రూ.వేల కోట్ల రుణం తెచ్చేందుకు హామీ ఉంటున్న ప్రభుత్వం అమరావతి విషయంలో మాత్రం ఎందుకు హామీ ఉండలేదన్నది ప్రశ్నార్థకం. ఇదిలావుంటే, సీఆర్‌డీయే ఇటీవల మంగళగిరి సమీపంలో నవులూరులోని అమరావతి టౌన్‌షి్‌పలో మిగులు ప్లాట్ల వేలం ద్వారా రూ.300 కోట్ల ఆదాయాన్ని పొందాలని నిర్దేశించుకుంది. అదేవిధంగా సీఆర్‌డీయే ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉన్న అన్ని అంశాలపై దృష్టి పెడతామని కమిషనర్ వివేక్ యాదవ్ ఇటీవల తెలిపారు. ఈ క్రమంలో టౌన్‌షిప్ మిగులు ప్లాట్ల వేలంతో పాటు, రాజధానిలో పలు సంస్థలకు కేటాయించి, నిర్మాణాలు చేపట్టని భూములను అమ్మకడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవటానికి ప్రణాళిక వేసింది. ఈ ప్రణాళికకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ఏడాది భూములు వేలం వేశాక.. దానికి వచ్చే స్పందన చూసి.. దశల వారీగా మరిన్ని భూములు విక్రయించాలని సీఆర్‌డీయే నిర్ణయించింది. ఈ క్రమంలో వచ్చే ఏడాది మరో 600 ఎకరాలను దశలవారీగా విక్రయించేందుకు ప్రణాళికలు రూపొందించింది. అయితే, సీఆర్డీయే ప్రతిపాదించిన ధరకు కొనుగోలుదారులు ఏ మేరకు వస్తారన్నది చూడాలి.
అమరావతిలో భూములకు ఎకరా రూ.10 కోట్లు పెద్ద ధర కాదన్న అభిప్రాయం ఉన్నప్పటికీ.. అభివృద్ధి చెందిన అమరావతిలో అయితే నిజంగానే అంతకన్నా ధర ఉండేది. అయితే, మూడేళ్లుగా రాజధానిపై దోబూచులాడడం, ప్రభుత్వానికి ఇష్టం లేనట్లుగా వ్యవహరించడంతో ఇప్పుడు నమ్మకంగా వేలంలో పాల్గొనేందుకు ఎవరు ముందుకొస్తారన్న అనుమానాలు నెలకొన్నాయి. ఒకవేళ ఆ ధర కూడా రాకుంటే.. ఇంకా తగ్గించి అయినా అమ్మేందుకు సీఆర్డీయే ప్రత్యామ్నాయ ప్రణాళికతో ఉందని సమాచారం. ఇదిలావుంటే, ప్రభుత్వ నిర్ణయంపై రాజధాని రైతులు సహా ప్రజాసంఘాల నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రైతుల త్యాగాలను అమ్మేయడమేనని విమర్శిస్తున్నారు.
జూలై తొలి వారంలో వేలం ప్రకటన
అమరావతి భూముల అమ్మకం నిరంతర ప్రక్రియలా సాగనుంది. 600 ఎకరాల పైబడి భూములను విక్రయించాలని సీఆర్‌డీయే ప్రణాళిక నిర్దేశించింది. ప్రభుత్వం కూడా దశల వారీగా ఈ భూములు అమ్ముకోవటానికి తాజా జీవో 389లో లైన్ క్లియర్ చేసింది. ఈ క్రమంలో 248.34 ఎకరాల విక్రయానికి జూలై తొలివారంలోనే వేలం ప్రకటన విడుదల చేయనున్నారు.
అమరావతిలో రాజధాని భవనాలు
అమరావతిలో రాజధాని భవనాలు అమరావతిలో రాజధాని ఏర్పాటు ప్రక్రియలో భాగంగా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన్న పలు భవనాలు ఇప్పటికీ నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఈ మూడేళ్లలో రాజధాని మార్పు పేరిట ప్రభుత్వం చేసిన ప్రచారంలో ఇక్కడికి ఎవరూ రాకుండా పోయారు. అదేసమయంలో ప్రభుత్వం కూడా ఈ భవనాల్ని వాడుకోకుండా పదిలేసింది. ఎలాగో విశాఖకు వెళ్లిపోతున్నామన్న కారణంతో ప్రభుత్వం అథికారులకు, ఎమ్మెల్యేలకు ఈ భవనాలు కేటాయించలేదు. దీంతో పనులు పూర్తయిపోయిన చాలా భవనాలు నిరుపయోగంగా మూలనపడి ఉన్నాయి. అయితే ఇన్నాళ్లకు వాటికి మోక్షం లభించేలా కనిపిస్తోంది.
లీజుకివ్వాలని నిర్ణయం
అమరావతిలో నిరుపయోగంగా పడి ఉన్న ప్రభుత్వ భవనాలను వివిధ ప్రైవేటు సంస్ధలకు లీజులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ఇచ్చిన ప్రతిపాదనకు సీఎం జగన్ ఆమోద ముద్ర వేశారు. దీంతో త్వరలోనే ఈ భవనాల లీజు ప్రక్రియ ప్రారంభంకానుంది. తొలిదశలో విట్ యూనివర్శిటీకి ఓ భవనం ఇచ్చేందుకు కూడా రంగం సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమరావతికి రావాల్సిన పెద్ద సంస్ధలన్నీ తరలిపోయిన నేపథ్యంలో ఈ భవనాలకు డిమాండ్ కూడా తక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.
సీఆర్డీయే చేసిన ప్రతిపాదనల వెనుక కీలక కారణాలు
అమరావతిలో ప్రభుత్వ భవనాలను లీజుకు ఇవ్వాలని సీఆర్డీయే చేసిన ప్రతిపాదనల వెనుక కీలక కారణాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే హైకోర్టు తీర్పు తర్వాత అమరావతిలో అభివృద్ధి పనులు చేపట్టక తప్పని పరిస్ధితి ప్రభుత్వానికి ఎదురవుతోంది. అలాగని అభివృద్ధి చేద్దామంటే నిధులు లేవు. చివరికి రుణాలు ఇమ్మంటే బ్యాంకులు కూడా మొహం చాటేస్తున్నాయి. దీంతో ఇప్పటికే అమరావతిలో భూముల విక్రయానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో పాటే భవనాల లీజులకూ పావులు కదుపుతోంది. ప్రభుత్వ నిర్ణయాలపై అమరావతిలో రైతులతో పాటు ప్రతిపక్షాలు కూడా తీవ్ర విమర్శలకు దిగుతున్నాయి.
భూములను వేలం వేసి అమ్మాలనుకోవడం సరికాదు’
తుళ్లూరు, రాయపూడి మహిళా రైతుల ఆందోళనకు దిగారు. రాజధాని నిర్మాణం కోసం భూములను ఇచ్చామని రాజధాని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూములను ప్రభుత్వానికి అమ్మలేదన్నారు. సీఎం జగన్కు అమరావతిని నిర్మించడం చేతకాలేదన్నారు. రాజధాని నిర్మాణం చేతకాకపోతే అలాగే వదిలేయాలని వ్యాఖ్యానించారు. భూములను వేలం వేసి అమ్మాలనుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే కేటాయించిన రాజధాని భూములను వేలం వేసి అమ్మాలనుకోవడం సరికాదన్నారు.
రైతులు ఆందోళన
రాజధాని భూములను ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంపై అమరావతి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడులో.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బిఆర్ శెట్టి సంస్థకు కేటాయించిన భూముల వద్ద బైఠాయించి.. నినాదాలు చేశారు. రాజధానిలో నిర్మాణాల్లేకుండా భూములు అమ్మడం సరికాదన్న రైతులు.. వెంటనే సర్కారు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏంపీలు, మంత్రులు మూడు రాజధానులని ఇప్పటికే ప్రకటనలు చేశారని.. ముందుగా వారితోనే జగన్ స్వయంగా అమరావతే పరిపాలన రాజధానిగా ఉంటుందని ప్రకటించిన తర్వాతే ఈ ప్రాంతంలోకి రావాలని స్పష్టం చేశారు. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాతే.. ఇక్కడి భూముల గురించి ప్రభుత్వం ఆలోచించాలని రైతులు హెచ్చరించారు. రాజధానిని అభివృద్ధి చేయకుండా ఇష్టానుసారం భూములు అమ్ముతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
న్యాయస్థానంలో మరోసారి భంగపాటు తప్పదు.- ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి
రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకుండా భూములు అమ్మే అధికారం ప్రభుత్వానికి లేదు. ఈ మేరకు రైతులతో నాటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మొండిగా ముందుకెళ్తే.. న్యాయస్థానంలో మరోసారి భంగపాటు తప్పదు అన్నారు. అమరావతి భూములను ప్రభుత్వం అమ్మకానికి పెట్టడాన్ని తెలుగుదేశం నేత లోకేశ్ విమర్శించారు. ముంపు ప్రమాదం ఉందని, శ్మశానం అంటూ తప్పుడు ప్రకటనలు చేసిన ప్రభుత్వ పెద్దలు… ఇప్పుడు ఎకరం 10 కోట్లు చొప్పున ఎలా విక్రయిస్తారని ప్రశ్నించారు.