క్లారిటీ ఇచ్చిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 4న ఆంధ్రప్రదేశ్‌లో భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మోదీతో పాటు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. అయితే ఆహ్వానాలు అందినా కూడా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు హాజరు కాలేదు. వీరి గైర్హాజరీపై ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విశ్లేషణ వినిపిస్తున్నారు. ఈ విశ్లేషణలకు చెక్‌పెట్టే దిశగా ఏపీకి చెందిన బీజేపీ యువ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఓ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అందరికీ ఒకేసారి ఆహ్వానాలు పంపారని, నేతల గైర్హాజరీపై రాద్ధాంతం అవసరం లేదన్నారు. . విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ పై ట్రోలింగ్ మొదలెట్టేశారు. విజ్ఞప్తి ఓకే గానీ… మీరు పోస్ట్ చేసిన ఆహ్వానాల్లో ఒక్కో దానిపై ఒక్కో తేదీ ఉందని ఆయనకు నెటిజన్లు గుర్తు చేశారు.
Vishnu Vardhan Reddy @SVishnuReddy
భారతప్రభుత్వం తరపున కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు అందరికి ఓకటేరోజున ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా గౌరవ గవర్నర్ గారితో సహ పవన్ కళ్యాణ్ గారికి,చిరంజీవి గారికి,చంద్రబాబు గారికి ఆహ్వాన పంపడం జరిగింది. కొంతమంది గోప్ప కార్యక్రమాన్ని వివాదం చేయడం సిగ్గు చేటు
Union Minister Shri Kishan Reddy on behalf of the Government of India has sent an invitation to everyone along with Honorary Governor along with Honorary Governor Pawan Kalyan, Chiranjeevi and Chandrababu on the same day. It is a shame that some people are disputing the Goppa programme
@PawanKalyan @ncbn