ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో తీసుకొని వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నూతన ఆవిష్కరణలతో తీసుకువస్తున్న సంస్కరణలు, అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టెక్నాలజీ వినియోగంలో దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖ మొదటి స్థానంలో నిలిచింది. తాజాగా GOVERNANCE NOW-2022 ప్రకటించిన అవార్డులలో 14 అవార్డులను వివిధ విభాగాల్లో కైవసం చేసుకొని, మొత్తం 189 అవార్డులను గెలుచుకుంది ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ. ఇప్పటివరకు జాతీయ స్థాయిలో 189 అవార్డులను దక్కించుకొని ఏపీ పోలీస్ శాఖ ప్రధమ స్థానంలో నిలిచింది. GOVERNANCE NOW-2022 అవార్డులను దక్కించుకున్న జిల్లా పోలీస్ యూనిట్ లు. పోలీస్ ప్రధాన కార్యాలయం (4), శ్రీకాకుళం(1), విశాఖపట్నం సిటీ(1), కాకినాడ(1), ఎన్టీఆర్(2), ప్రకాశం(1), చిత్తూరు(1), తిరుపతి(2), కడప(1)
Another bounty of 14 #awards bagged by #APPolice as it stole the show on #GovernanceNow 2nd India Police #Awards 2022/15th July.Awards won in the categories of Community Policing,#Women Safety ,E-Policing Initiative,Road Safety &Traffic Management, Surveillance & Monitoring(1/4) pic.twitter.com/5wfH2865cW
— Andhra Pradesh Police (@APPOLICE100) July 16, 2022
డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖ టెక్నాలజీ వినియోగంలో దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతుందని ఇప్పటికే జాతీయ స్థాయిలో అత్యంత స్వల్ప కాలంలో 189 జాతీయ అవార్డులను ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ దక్కించుకుంది. ఏ టెక్నాలజీ వాడినా ఆ ఫలాలను ప్రజలకు క్షేత్రస్థాయిలో అందించి వారికి సత్వర న్యాయం చేకూర్చినప్పుడే అది అర్థవంతం అవుతుంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఇప్పటివరకు చేసిన మరియు చేస్తున్న కృషి ఎంతగానో సంతృప్తినిచ్చింది. ఈ విజయం వెనుక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నిరంతర సూచనలు, సలహాలు, దిశా నిర్దేశం, వెన్నుతట్టి ప్రోత్సహించడం ఎంతగానో తోడ్పాటుని అందించింది .ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది కేవలం ఏ ఒక్కరితోనూ సాధ్యమయ్యేది కాదు. క్షేత్ర స్థాయి సిబ్బంది నుండి ఉన్నత స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ నిరంతరం శక్తివంచన లేకుండా చేస్తున్న కృషికి ప్రతిఫలం ఈ జాతీయ స్థాయిలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ దక్కించుకున్న గౌరవంగా భావిస్తున్నాను. భారతదేశంలోని రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందని సగర్వంగా తెలియజేస్తున్నాను.