గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంపు-గుంటూరు రూ.1092
గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధర పెరిగింది. 14.2 కేజీల సిలిండర్ ధరను రూ.50 మేర పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దిల్లీలో ప్రస్తుతం రూ.1003గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర తాజా పెంపుతో రూ.1053కు చేరుకుంది. హైదరాబాద్‌లో గ్యాస్ బండ ధర రూ.1055 నుంచి రూ.1105కు చేరింది.సాధారణంగా ప్రతి నెల 1న వీటి ధరల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఈ నెల 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను చమురు సంస్థలు ₹183.50 మేర తగ్గించాయి. తాజాగా గృహావసరాల గ్యాస్ ధర మాత్రం పెంచడం గమనార్హం. పెంచిన గ్యాస్ సిలిండర్ ధర ఇవాళ్టి నుంచే అమలులోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూ.1077, గుంటూరు రూ.1092, విశాఖపట్నం రూ.1061, అనంతపురం రూ.1119.50,చిత్తూరు రూ.1089,కడప రూ.1103,తూర్పుగోదావరి రూ.1081.50
సిలిండర్ ధర రూ. 50 మేర పైకి కదిలింది. దీంతో మన తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధర పెంపు సామాన్యులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది…వివిధ రాజకీయ పార్టీల అధ్వర్యంలో పెరిగిన గ్యాస్ ధరలను తగ్గించాలని మహిళలు నిరసన తెలిపారు. విజయవాడలో టీడీపీ మహిళా నాయకురాలు మట్లాడుతూ కేంద్రంలో ప్రధాన మంత్రి మోడీ, రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు హద్దు అదుపు లేకుండా పెరుగుతున్నాయన్నారు. పెరుగుతున్న ధరలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యాయని విమర్శించారు. . ఇప్పటికే అన్ని రకాల వస్తువులతోపాటు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. ప్రజలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకొచ్చిన బిజెపి, వైసిపిలు ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నాయన్నారు. పెంచిన అన్ని రకాల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.