తిరుపతి రైల్వే స్టేషన్ పునరుద్ధరణలో భాగంగా ఖరారు చేసిన డిజైన్‌లు మన భారతీయ సంస్కృతి , హిందూ సంస్కృతిని పోలి లేవని, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నేపద్యంలో డిజైన్లు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆకృతులు మార్చాలని కేంద్ర రైల్వే మంత్రిని తిరుపతి ఎంపి గురుమూర్తి కోరారు. అదే విధంగా తిరుపతి రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌గా మార్చేందుకు పూర్తి స్థాయి వసతులతో పునరుద్దరణకు టెండర్‌ను ఖరారు చేసినందుకు తిరుపతి ప్రజల తరపున ఎంపీ గురుమూర్తి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.
తిరుపతి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఒకటని కోట్ల సంఖ్యలో హిందూ భక్తులు సందర్శించే ప్రదేశమని అను నిత్యం కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని దర్శనం కోసం ప్రతిరోజూ దాదాపు 80 వేల మంది భక్తులు వరకు సందర్శిస్తారని ఆయనకు చెప్పారు. ప్రస్తుతం ఖరారు చేయబడిన భవన ఆకృతులపై పలువురు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారని ఆయనకు తెలియజేసారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయము కూడా గరుడ ఆకృతిలో ఉంటుందని ఆయనకి చెప్పారు. ప్రతిపాదిత నిర్మాణాన్ని ఆధ్యాత్మికత ఉట్టిపడేలా మార్చి హిందూ సంస్కృతికి అనుగుణంగా ప్రయాణీకులకు ఆధ్యాత్మిక చింతన వ్యాప్తి చేసే విధంగా ఈ పక్రియలో జాప్యం లేకుండా భవన ఆకృతులు ఏర్పాటు చేసేందుకు పునఃపరిశీలించాలని ఆయనని అభ్యర్దించడం జరిగిందని ఎంపీ గురుమూర్తి తెలియజేసారు. అందుకు అందుకు కేంద్ర రైల్వే శాఖా మంత్రి వర్యులు అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని భవన ఆకృతులలో మార్పులు చేసి త్వరలో పనులు ప్రారంబిస్తామని ఆయన హామీ ఇచ్చారని ఎంపీ గురుమూర్తి చెప్పారు.
ప్రధానంగా తిరుపతి ప్రధాన బస్సు స్టాండ్ ఎదురుగా ఫార్చ్యూన్ కెన్సెస్ హోటల్ పూజిత రెసిడెన్సీ మధ్యలో మూసివేయబడిన లెవెల్ క్రాసింగ్ 106 వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి అవసరమని అను నిత్యము వేల సంఖ్యలో ప్రజలు పట్టణములో ఇరువైపులా సంచరిస్తారని ఈ రైల్వే లెవెల్ క్రాసింగ్ మూసి వేయడంతో ప్రజలు రైల్వే లైన్ దాటి వేళ్ళు సమయాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని వీటి నివారణకు ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలనీ కోరారు. వెంకటగిరి రైల్వే స్టేషన్ దగ్గరలోని 565 జాతీయ రహదారిపై పెరియవరం దగ్గరలో 14వ లెవెల్ క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ నివారించేందుకు రైల్వే ఓవర్ బ్రిడ్జి కోసం నిధులు మంజూరు కోరుతూ మరోమరు ఆయనకి వినతి పత్రం సమర్పించడం జరిగినదని ఎంపీ గారు తెలియజేసారు. అలాగే తిరుపతి నుండి వారణాసికి ప్రస్తుతము డైరెక్ట్ రైలు సర్వీసు లేదని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను కలుపుతూ ఒక రైలు సర్వీసును ఏర్పాటు చేయాలనీ ఆయనని కోరారు.