ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక నగరంగా పేరుపొందిన తిరుపతిలో క్రైమ్ రేటు విపరీతంగా పెరుగుతున్నది. దొంగతనాలు, దోపిడీలు, భూకబ్జాలు, సెటిల్మెంట్లకు కేరాఫ్ అడ్రస్ గా తిరుపతి మారిపోయింది. తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో బంగారం, వెండి వస్తువులను దోచుకెళ్లే ముఠా తిరుపతిలో సంచరిస్తోంది.
అంతర్రాష్ట్ర దొంగల ముఠా…
నగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. నగరంలో రాత్రి సమయాల్లో సంచరిస్తూ ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్న . ఇద్దరు అంతర్ రాష్ట్ర అ దొంగలను ఎట్టకేలకు తిరుపతి పోలీసులు ఈ మధ్యకాలంలో పట్టుకున్నారు. తిరుపతి ఎంఆర్ పల్లి అలిపిరి, తిరుచానూరు పరిధిలో దొంగతనాలకు పాల్పడి దోచుకున్న నగదుబంగారాలతో జల్సాలు చేసుకుంటున్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరం కావడంతో నిత్యం భక్తుల రద్దీతో ఉండడంతో అంతరాష్ట్ర దొంగల ముఠాల చూపు తిరుపతి మీద పడింది.
సతీష్ రెడ్డి గ్యాంగ్ హల్ చల్
తిరుపతి పరిసర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకు తిరుగుతున్న ముఠాలలో సతీష్ రెడ్డి గ్యాంగ్ పేరు పొందింది అనేక నేరాలలో ముద్దాయిగా ఉన్న సతీష్ రెడ్డి గత కొంతకాలంగా తిరుపతిలో దొంగతనాలకు పాల్పడుతూ ప్రజల ను భయబ్రాంతులకు గురి చేశాడు.. కొద్ది రోజుల క్రితం పాత కాలువ సమీపంలోనే వకుళమాత ఆలయం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. వీరిని విశాఖపట్నం గాజువాక బాహుబలి నగర్ కాలనీకి చెందిన కర్ర సతీష్ అలియాస్ సతీష్ రెడ్డి. వయస్సు 38 సంవత్సరాలుగా పోలీసులు గుర్తించారు. రెండేళ్లుగా ప్రతి నగరంలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిగా నేర చరిత్ర ఉన్న వ్యక్తిగా ఇతని పేరు పోలీసు రికార్డుల్లో ఉంది ఇతనిపై తిరుపతిలోనే కాకుండా శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం, అనకాపల్లి,కాకినాడ , విజయవాడ, నెల్లూరు,తెలంగాణ , తమిళనాడు, కర్ణాటకరాష్ట్రాలలో 80కి పైగా కేసులు నమోదు చేశారు. ఇతనిపై విశాఖపట్నం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్ హైదరాబాద్ లోని బంజారాహిల్స్లో పీడీ యాక్ట్ నమోదు అయ్యింది. మరో నిందితుడు నరేందర్ నాయక్ అలియాస్ నారీ 26 సంవత్సరాల వయసు. నల్గొండ జిల్లా చిన్నపేటలో నివాసం ఉంటున్నాడు ఇతనిపై పై తెలంగాణ, హైదరాబాద్ సిటీ ,వనస్థలిపురం, నేరేడు మెట్ట, సరూర్నగర్, ఇబ్రహీంపట్నం ,చిలకలగూడ, బంజారా హిల్స్, దేవరకొండ, తమిళనాడులో మొత్తం కలిపి 38 కేసులు నమోదయ్యాయి. ఇతనిపై ఇటీవల పి.డి యాక్ట్ నమోదు అయ్యింది
తిరుపతి ఎంపీకే సైబర్ నేరగాళ్ల ఫోన్ ?
సైబర్ నేరగాళ్లు సామాన్యులకే కాదు పెద్ద పెద్ద సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు టోకరా వేస్తున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి ఏకంగా తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తికి సిఎంఓ నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెప్పి 37 .5 లక్షలకు స్కెచ్ వేసాడు. కానీ ఎంపీ క్రాస్ చెక్ చేయడంతో అసలు బండారం బయటపడింది. అభిషేక్ అనే వ్యక్తి తాను సిఎమ్ ఓ కార్యాలయంలో పనిచేస్తున్నట్లు చెప్పి తిరుపతి ఎంపీ గురుమూర్తికి ఫోన్ చేశాడు. ఎంపి పార్లమెంట్ పరిధిలో ఖాదీ పరిశ్రమ సబ్సిడీ రుణాల కింద 5 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని ఆ రుణాలు కావాలంటే తన అకౌంట్ కు డబ్బులు వేయాలని 25 దరఖాస్తులకు ఒక్కొక్క దరఖాస్తుకు ఒక లక్షా 50 వేల రూపాయల చొప్పున 37 లక్షల 50 వేల రూపాయలు డిపాజిట్ చేయాలని అప్పుడే రుణాలు మంజూరు చేస్తామని డిమాండ్ చేశాడు. దీనితో అనుమానం వచ్చిన ఎంపీ నేరుగా సీఎంవో కార్యాలయానికే ఫోన్ చేసి విషయం చెప్పి విచారించగా అభిషేక్ పేరుతో ఎవరూ లేరని సిఎంఓ సిబ్బంది చెప్పడంతో ఎంపీ గురుమూర్తి పిఏ నేరుగా తిరుపతి అర్బన్ ఎస్పీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. అభిషేక్ అనే వ్యక్తి తన వివరాలను ఎంపీకి మెయిల్ ద్వారా పంపడంతో ఆ డేటాతో సైబర్ నేరస్థుడిని పట్టుకునే పనిలో తిరుపతి పోలీసులు మినగ్నమయ్యారు.
వ్యభిచార ముఠాలకు తిరుపతి బస్టాండ్ కేర్ ఆఫ్ అడ్రస్ ?
తిరుపతి బస్టాండ్ పరిసర ప్రాంతాలలో వ్యభిచారం ముఠాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. తూర్పు పోలీస్ స్టేషన్ కు అతి దగ్గరలో ఈ వ్యభిచార కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. మందు బాబులను టార్గెట్ గా చేసి వారిని నిలువు దోపిడీ చేస్తున్నారు. తూర్పు పోలీస్ స్టేషన్ ..ఎస్పి ఆఫీస్ దగ్గరలోనే ఉన్నాకూడా ఇటువంటి అనైతిక కార్యకలాపాలకు అదుపు లేకుండా పోతున్నది.
తిరుపతి క్రైమ్ ఫై దృష్టి పెట్టాలి : ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్
తిరుపతిలో వరుసగా జరుగుతున్న సైబర్ క్రైమ్ లను ఇంటి దొంగతనాలు పై పోలీసులు దృష్టి సారించాలని. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు విరుపాక్షి నవీన్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో సైబర్ నేరగాళ్లు ఏకంగా టార్గెట్ చేశారంటే తిరుపతి క్రైం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఎప్పటికైనా దొంగలముఠా సైబర్ నేరగాళ్ల ఆట కట్టించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తరపున డిమాండ్ చేశారు.