Connect with us

Hi, what are you looking for?

Andhra News

టీటీడీ వంశపారంపర్య అర్చక వ్యవస్థను నాశనం చేసింది

టీటీడీ గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు మరోసారి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఏపీ సీఎం  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్యాగ్ చేస్తూ స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. తన సమస్యను

Share

Ramana Dikshitulu on Twitter: “@ysjagan Congratulations. Lord Venkateswara swami bless you with more successes in future. We are reinstated 2-4-21 but TTD is withholding our responsibilities.Flimsyexcuses.Still running around courts today. Govt is archaka friendly but TTD destroyed hereditary archaka system.” / Twitter

టీటీడీ గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు మరోసారి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఏపీ సీఎం  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్యాగ్ చేస్తూ స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. తన సమస్యను ప్రస్తావిస్తూ గతంలో చెప్పిన అంశాలను మరోసారి ప్రస్తావించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిగారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆ వెంకటేశ్వరస్వామి దీవెనలతో భవిష్యత్తులో మరింత సక్సెస్ అందుకోవాలని ఆకాంక్షించారు. 2-04-2021న తమను తిరిగి టీటీడీ బాధ్యతల్లోకి తీసుకొచ్చారని కానీ టీటీడీ మాత్రం తమ విధులను విత్ హోల్డ్‌లో ఉంచిందని ఆరోపించారు. దీనికోసం ఇప్పటికీ తాము కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం అర్చకులకు ఫ్రెండ్లీగా ఉందని టీటీడీ మాత్రం అర్చకుల వ్యవస్థను నాశనం చేసేలా ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు.

వయోపరిమితి నిబంధనతో రమణ దీక్షితులు ప్రధాన అర్చకత్వం నుంచి తొలగిపోయిన విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రమణదీక్షితులకు గౌరవ ప్రధానార్చకుడి హోదాను కల్పించారు. అయినప్పటికీ తనకు పూర్వపు ప్రధాన అర్చక హోదానే కావాలంటూ పట్టుబట్టడంతో అప్పటికే ఆ కుటుంబం నుంచి ప్రధాన అర్చకుడిగా నియమితులైన వేణుగోపాల దీక్షితులను తప్పుకోవాలని టీటీడీ కోరింది. దీంతో వేణుగోపాల దీక్షితులు కోర్టును ఆశ్రయించడంతో రమణ దీక్షితుల నియామకంపై కోర్టు స్టే విధించింది.

గత ప్రభుత్వ హయాంలో టీటీడీ అర్చకులకు సంబంధించి అప్పటి పాలక మండలి రిటైర్మెంట్ నిబంధనలు అమలుచేసింది. దీని ప్రకారం 65 ఏళ్లు పైబడిన అర్చకులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ప్రభావంతో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా ఉన్న రమణ దీక్షితులు, నరసింహ దీక్షితులు, శ్రీనివాసమూర్తి దీక్షితులు, నారాయణ దీక్షితులతో పాటు మరో ఐదుగురు రిటైరైన సంగతి తెలిసిందే. అలాగే గోవిందరాజ స్వామి ఒకరు, తిరుచానూరులో ఇద్దరు అర్చకులు కూడా రిటైర్ అయ్యారు.

తిరుచానూరు ఆలయం ప్రధానార్చకుడు, మరొక అర్చకుడు ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై 2018 డిసెంబర్‌లో రిటైర్డ్ నిబంధనను వర్తింపచేయకూడదని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇవే ఆదేశాలను తమకు అమలు చేయాలని అర్చకులందరూ టీటీడీ అధికారులను కోరారు. అలాగే రమణ దీక్షితులు కూడా జగన్‌ను కలిసి ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తాము అధికారంలోకి రాగానే వీరికి న్యాయం చేస్తామని జగన్ కూడా హామీ ఇచ్చారు. చెప్పినట్లుగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. రమణ దీక్షితుల్ని గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించారు. టీటీడీ రిటైర్డ్ అయ్యిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు వచ్చాయి. తమను శ్రీవారి కైంకర్యాలను నిర్వహించనీయడం లేదని రమణ దీక్షితులు పరోక్షంగా ఆరోపిస్తున్నారు. పదేపదే టీటీడీని టార్గెట్ చేస్తున్నారు.

@IYRKRao Retd IAS
తాను గ‌తంలో అర్చకుల స‌మ‌స్య‌ల‌పై ట్వీటిర్ వేదికగా ప్ర‌స్థావించిన అంశాల‌ను ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.. @ysjagan@BJP4Andhra
గత ఫిబ్రవరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను రాసిన లేఖ సారాంశం ఈ వీడియోలో https://youtu.be/8UgC9rBId5o హిందూ మత రక్షణకు, దేవాదాయ శాఖ అమలు పరచవలసిన కార్యనిర్వాహక ప్రణాళిక మీద సూచనలు ఇవ్వడం జరిగింది. దురదృష్టం ఏ ఒక్క అంశం మీద కార్యాచరణ అమలు జరగటం లేదన్నారు.

రెండవ కోణం జీవనభృతి సమస్య. మొదటి నుంచీ ఈ అంశాన్ని నేను తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుల దృష్టితో చూడలేదు. చిన్న చిన్న దేవాలయాల్లో నాలుగైదు వేలు భ్రుతి తో పనిచేస్తున్న అర్చకులకు 60 ఏండ్ల పదవీ విరమణ నిబంధన దారుణం అమానవీయం. #హిందూధర్మపరిరక్షణ

1987వ సంవత్సరం టీడీపీ వేసిన ఈ వికృత బీజానికి 2007లో చట్ట సవరణ చేయడం జరిగింది. అది అమలు కావటానికి ఇంకో 15 సంవత్సరాలు పట్టింది అంటే అర్చకుల బలహీనత, దీనికి వ్యతిరేకంగా పనిచేసే శక్తుల బలమే కారణం.

2018లో హైకోర్టు అర్చకులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డి గారు బహిరంగంగా దీనిపై నిర్దిష్టమైన ప్రకటన చేశారు. కానీ తిరుపతి బై ఎలక్షన్ లేకపోతే ఇది అమలై యుండేది కాదేమో. అర్చకునికి ఉద్యోగ భద్రత సరైన జీతభత్యాలు ఇవ్వటం నా దృష్టిలో అతని సంక్షేమానికి ఎంత అవసరమో హిందూ ధర్మ పరిరక్షణకు కూడా అంతే అవసరం.

ఈ అంశంపై ట్వీటిర్ వేదిక‌గా ప‌లు విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి…గుడిలో పూజారిని పోషించే వ్యవస్థ కనుమరుగయ్యింది ! కాదు కనుమరుగు చేశారు, ఇది ఒక పథకం ప్రకారం జరిగింది ! గుడిలో పూజారికి కడుపునిండకపోతే ఆ దేవుడు చూపిన వేరే దారి వెతుక్కుంటాడుగానీ పూజారిగా ఉండడు! అప్పుడు గుడి ఉండదు దేవుడి పూజలూ ఉండవు! మనం గొప్పగా చెప్పుకునే భారతీయ సంస్కృతి ప‌లువురు అవేదన వ్య‌క్తం చేస్తున్నారు.భారత సంస్కృతిని మార్చాలని విదేశీయులు చాలా ప్రయత్నాలు చేశారని, కానీ ఎవరూ మార్చలేకపోయారన్నారు. రాష్ట్రంలో వేలాది ఆలయాలు ప్రాభవాన్ని కోల్పోయాయి. వేలాది ఆలయాలు మూతబడ్డాయి. అర్చకులు ఇతర వృత్తులకు మళ్లుతున్నారు.

 

 

Share
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  (To Type in English, deselect the checkbox. Read more here)

You May Also Like

Alluri Seetharama Raju

Daftar Situs Slot Bonus New Member  100% 200% TO Kecil 3x 5x 7x 8x 10x 15x Tanpa Potongan Mudah Jackpot Besar Tahun 2023 Bonus...

Uncategorized

Buy modafinil 200mg, modafinil israel – Buy legal anabolic steroids                            ...

Uncategorized

Üsküdar Tıkanıklık Açma Üsküdar tıkanıklık açma firmamız tıkalı pimaş borularında ortaya çıkan yabancı maddeler yüzünden oluşan tıkanmaları kırmadan tıkanıklık açıcı servisi ile çözüme kavuşturmaktadır....

Uncategorized

Su Kaçak Tespiti Nasıl Yapılır Beşiktaş su kaçak tespiti Beşiktaş su kaçak tespiti yapan Uzman, kalorifer borularında meydana gelen su kaçaklarını iki farklı yöntemle...

Lingual Support by India Fascinates