కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె గురువారం పలు ట్వీట్లు చేశారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ గారు నిరంతరం సమీక్షిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలు అందిస్తూ కుటుంబ పెద్దలా అండగా నిలుస్తున్నారు.
ప్రసవానికి వారం గడువున్న గర్భిణులకు కూడా ముందుగానే ఆస్పత్రులకు తరలించి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తూ, వరద ప్రాంతాల్లో వైద్య, విద్యుత్, త్రాగునీటి వసతులకు ఎలాంటి అవాంతరాలు రాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్దన్నలా వ్యవహరిస్తున్నారు 2/3
— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 14, 2022
ప్రసవానికి వారం గడువున్న గర్భిణులను కూడా ముందుగానే ఆస్పత్రులకు తరలించి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. వరద ప్రాంతాల్లో వైద్యం, విద్యుత్, తాగునీటి వసతులకు ఎలాంటి అవాంతరాలు రాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నలా వ్యవహరిస్తున్నారు.
ఒక వైపు ప్రభుత్వం మరోవైపు @trspartyonline నాయకులు సైతం ఎక్కడికక్కడ వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటు, ఆహార పంపిణీ చేస్తూ ప్రజలకు ధైర్యాన్నిస్తున్నారు.
ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి.
3/3— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 14, 2022
ఒకవైపు ప్రభుత్వం మరోవైపు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆహారం పంపిణీ చేస్తూ ప్రజలకు ధైర్యాన్ని ఇస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా..” అని కవిత వరుసగా ట్వీట్లు చేశారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు, రిజర్వాయర్లు, నదులు పొంగిపొర్లుతున్నందున తక్షణ రక్షణ చర్యలను కొనసాగిస్తూ వరదలవల్ల కలిగే ఆస్తి, ప్రాణ నష్టాలను వీలయినంతమేర తగ్గించేందుకు సీఎం శ్రీ కేసీఆర్ ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజా ప్రతినిధులను అప్రమత్తం చేస్తున్నారు. pic.twitter.com/NaOpDiQSwo
— Telangana CMO (@TelanganaCMO) July 13, 2022