అమరావతి రైతుల ఉద్యమం 1000 రోజులు పూర్తి అయిన సందర్భంగా, రైతుల మహా పాదయాత్రను ఉద్దేశించి CPI నారాయణ కొన్ని ఆసక్తికరమైన, ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పాదయాత్రలు, ర్యాలీలు అంటే ముఖ్యమంత్రికి ఎందుకు అంత కోపం? అని ప్రశ్నించారు.మీ నాన్న (వైఎస్),మీరు పాదయాత్రలు చేసే కదా ముఖ్యమంత్రులైంది? అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యానించారు.
ఏదేమైనా, ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తరవాత ఒక్కసారిగా జగన్ గుణం మారిపోయిందని విమర్శించారు. ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని జగన్ ఇచ్చిన హామీ ఏమైపోయిందని ప్రశ్నించారు. ఇప్పుడు చేపడుతున్న పాదయాత్ర అమరావతి రైతులు చేపడుతున్న రెండో పోరాటం అని నారాయణ అభివర్ణించారు
రైతులు పాదయాత్రను ఎందుకు చేస్తున్నారో గమనించాలని హితవు పలికారు. వారేమీ మిమ్మల్ని ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని పాదయాత్ర చేయడంలేదని, అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని కోరుతూ పాదయాత్ర చేపట్టారని నారాయణ వివరించారు.రైతుల పాదయాత్రకు నారాయణ CPI పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలిపారు.