ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల విచారణ నిమిత్తం ఏర్పాటైన రెండు ప్రత్యేక కోర్టులను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ ప్రారంభించారు. తిరుపతిలోని ఆల్ ఇండియా రేడియో కార్యాలయం సమీపంలోని తుడా కాంప్లెక్స్‌లో ఈ కోర్టులు ఏర్పాటయ్యాయి. ప్రారంభోత్సవం అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ ఎస్వీ యూనివర్సిటీలోని సెనేట్ హాల్‌కు బయలుదేరి వెళ్లారు. అక్కడ జిల్లా న్యాయమూర్తులతో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన అవార్డులు ప్రదానం చేశారు.
ఎన్టీఆర్.. 3 అక్షరాలు తెలుగుజాతికి అపూర్వశక్తి: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
తిరుపతి ఎన్టీఆర్ మనిషిగా ఉండడాన్ని తాను గర్విస్తున్నానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. 1983 నుంచి ఎన్టీఆర్ మనిషిగా తనపై ముద్ర వేశారని వ్యాఖ్యనించారు. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు తెలుగుజాతికి అపూర్వ శక్తిని అందించాయని చెప్పారు. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు తెలుగుజాతికి అపూర్వ శక్తిని అందించాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. జనం నాడి తెలిసిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. తిరుపతి ఎస్వీయూ ఆడిటోరియంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడాలన్న అంశంపై సందిగ్దత ఉంటుందని, ఎన్నో సదస్సుల్లో పాల్గొన్నా ఎప్పుడూ ఆ పరిస్థితి ఎదురుకాలేదని అన్నారు. ఎన్టీఆర్ స్వలాభం కోసం కాకుండా.. ప్రజా సేవకోసం పార్టీ పెట్టారని చెప్పారు. పార్టీ ప్రారంభించి నిర్విరామ కృషితో అధికారంలోకి వచ్చారని తెలిపారు. 1984 ఎన్నికల్లో పార్లమెంటులో అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం అన్యాయమన్నారు.
ఎన్టీఆర్‌తో కొంత సాన్నిహిత్యం ఉందని, 1983 నుంచి ఎన్టీఆర్ మనిషిగా తనపై ముద్ర వేశారని అన్నారు. ఎన్టీఆర్ మనిషిగా ఉండడాన్ని తాను గర్విస్తున్నానని చెప్పారు. రాజకీయ పార్టీకి సిద్ధాంతం, క్రమశిక్షణ ఉండాలని భావించిన మహనీయుడు ఎన్టీఆర్ అని ప్రశంసించారు. పదవీ విరమణ తర్వాత ఎన్టీఆర్‌పై ఓ పుస్తకం రాస్తానని వెల్లడించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్టీఆర్కు గుర్తింపు కోసం అందరూ పోరాడాలని సూచించారు.