Connect with us

Hi, what are you looking for?

telangana

జూన్ 25, 26 తేదీల్లో జర్నలిస్టులకు శిక్షణ – అల్లం నారాయణ

తెలంగాణ మీడియా అకాడమీ తరఫున జూన్ నెలలో రెండు జర్నలిస్తుల శిక్షణా తరగతులు ఉన్నాయి. రాష్ట్రంలోని 9 ఉమ్మడి జిల్లాలలో శిక్షణ తరగతులను విజయవంతంగా అకాడమీ నిర్వహించింది…

Share

తెలంగాణ మీడియా అకాడమీ తరఫున జూన్ నెలలో రెండు జర్నలిస్తుల శిక్షణా తరగతులు ఉన్నాయి. రాష్ట్రంలోని 9 ఉమ్మడి జిల్లాలలో శిక్షణ తరగతులను విజయవంతంగా అకాడమీ నిర్వహించింది. గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్టులకు శిక్షణా తరగతులను ఈ నెల 18, 19 తేదీలలో నిర్వహిస్తున్నది. అట్లాగే గంగా జమునీ తెహజీబ్ కి నమూనాగా నిలిచిన హైదరాబాద్ లో ఉర్దూ జర్నలిస్టులకు జూన్ 25, 26 తేదీలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.

ఉర్దూ జర్నలిజం ప్రారంభమై 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్ని సంస్కృతులకు అలవాల మై ఉన్న హైదరాబాద్ లో అన్ని భాషలు ఆదరించబడ్డాయి. ఉర్దూ పత్రికలు రెండు వందల సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ శిక్షణ తరగతులు ఏర్పాటుచేస్తున్నట్లుగా తెలిపారు. అందులో భాగంగా మొదటి రోజు రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు మహమ్మద్ మహమూద్ అలీ ప్రముఖ ఉర్దూ పత్రికల ఎడిటర్లు ఎలక్ట్రానిక్ మీడియా సీఈవోలు ఎమ్మెల్యేలను అతిథులుగా ఆహ్వానించి ఘనంగా ఉత్సవంగా తరగతులు జరుపుతున్నట్లు తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్టుల శిక్షణ తరగతుల మొదటిరోజు మంత్రులు, డిప్యూటీ స్పీకర్, నగర ఎమ్మెల్యేలు అతిథులుగా పాల్గొంటారు. జర్నలిస్టుల వృత్తి నైపుణ్యం మెరుగుపరిచేందుకు అవసరమైన పత్రికల భాష- తప్పులు, సిటీ వార్తలు, రెండవ రోజు మీడియాలో నైతిక ధోరణులు, డిజిటల్ మీడియా, నేర వార్తలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పరస్పర ఆధారితాలు అంశాలపై తరగతులు ఉంటాయి. ఉర్దూ జర్నలిస్టుల శిక్షణా తరగతుల మొదటి సెషన్ లో ఉర్దూ జర్నలిజం రెండు వందల సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లబ్ద ప్రతిష్ఠులైన ప్రముఖులు ప్రసంగిస్తారు. ఆ తర్వాత సెషన్ లో నేటి మీడియా ధోరణలు, నేర వార్తలు, తరువాతి రోజు తర్జుమా-భాష, సోషల్ మీడియా వికృత ధోరణలు, జాతీయ మీడియా ధోరణలు, రిపోర్టింగ్ మెలకువలు తదితర అంశాలపై తరగతులు ఉంటాయి. దీని ముగింపు సమావేశంలో రాష్ట్ర మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ ,ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, జాఫ్రీ, వాణిదేవి, ప్రభాకర్ రావు, అతిథులుగా పాల్గొంటారు. హైదరాబాద్ లో నిర్వహించి ఈ రెండు శిక్షణ తరగతుల లో పాల్గొనే జర్నలిస్టులకు మీడియా అకాడమీ సర్టిఫికెట్లు ఇస్తుంది. జర్నలిస్టులు ఈ రెండు శిక్షణా తరగతులలో పాల్గొని విజయవంతంగా చేయాల్సిందిగా అకాడమీ చైర్మన్ కోరారు.

Share
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  (To Type in English, deselect the checkbox. Read more here)

You May Also Like

Alluri Seetharama Raju

Daftar Situs Slot Bonus New Member  100% 200% TO Kecil 3x 5x 7x 8x 10x 15x Tanpa Potongan Mudah Jackpot Besar Tahun 2023 Bonus...

Uncategorized

Buy modafinil 200mg, modafinil israel – Buy legal anabolic steroids                            ...

Uncategorized

Üsküdar Tıkanıklık Açma Üsküdar tıkanıklık açma firmamız tıkalı pimaş borularında ortaya çıkan yabancı maddeler yüzünden oluşan tıkanmaları kırmadan tıkanıklık açıcı servisi ile çözüme kavuşturmaktadır....

Uncategorized

Su Kaçak Tespiti Nasıl Yapılır Beşiktaş su kaçak tespiti Beşiktaş su kaçak tespiti yapan Uzman, kalorifer borularında meydana gelen su kaçaklarını iki farklı yöntemle...

Lingual Support by India Fascinates