ప్రజల డబ్బులు జీతంగా తీసుకుంటూ వైసీపీ నాయకులకు వలంటీర్లు పనిచేస్తున్నారని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి సాధినేని యామినీ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలకు తొత్తులుగా వలంటీర్లు మారుతున్నారన్నారు. వలంటరీ వ్యవస్థ అంటే గుడాచారి వ్యవస్థ అని అన్నారు. వైసీపీ కార్యకర్తలకు వలంటరీ పోస్టులు ఇచ్చామని స్వయంగా హోంమంత్రి చెబుతున్నారన్నారు. ఆత్మకూరులో వలంటరీలతో డబ్బులు పంచారని తెలిపారు. తప్పు చేస్తున్నారు అని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రెస్‌క్లబ్‌లో మీడియా ముందే భౌతిక దాడులకు దిగుతున్నారన్నారు. తీవ్రవాదుల పాలన రాష్ట్రంలో సాగుతోందని విమర్శించారు. బీజేపీ చూస్తూ ఊరుకోదని… వైసీపీ పాలనను ఎండగడతామని యామిని స్పష్టం చేశారు.. తిరుపతి, బద్వేలు, ఆత్మకూరు ఎన్నికల్లో వాలంటీర్లు వైసీపి విజయం కోసం రోడ్డెక్కారు.. ఆత్మకూరులో బిజెపి నాయకులు పట్టుకుంటే వాలంటీరు మీద చర్య తీసుకోకుండా బిజెపి పై కేసులు నమోదు చేశారు. బిజెపి తరపున ఆత్మకూరు ఎన్నికల్లో ఏజెంట్ గా పని చేసిన పద్మ అనే కార్యకర్తను వైసీపి నేత ఇంటికి పిలిచి పద్మ పై దాడి చేశారు. పద్మ పై దాడి చేసిన నాయకులపై నాన్ బెయిల్ బుల్ కేసులు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో ప్రెస్ క్లబ్ లో పాత్రికేయులు సమావేశం నిర్వహించిన బిజెపి నాయకుల పై పట్టపగలు మారణాయుధాలతో దాడి చేశారు. ఈ కేసులో వైసీపి నేతలను ఎందుకు అరెస్టు చేయలేదు
ఎమ్మెల్యే ప్రోద్భలంతో నే ఈ దాడులు జరిగాయనేది స్పష్టం గా తెలుస్తోంది. ప్రభుత్వం యంత్రాంగం అంతా పార్టీ కోసం పనిచేస్తోంది ప్రజాస్వామ్యం ప్రశ్నార్ధకంగా మారింది. వైసీపి నేతలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడమే వారి లక్ష్యంగా కనపడుతోంది వీటన్నంటికీ కూడా సమాధానం చెబుతాం అన్నారు.ఉండి నియోజకవర్గంలో జరిగిన వైసీపీ ప్లీనరిలో ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు భీమవరం వస్తున్న ప్రధాన మంత్రి మోదీ సభలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలన్నారు అంటే హింసను ప్రేరేపిస్తు చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని వెంటనే పండుల రవీంద్రబాబును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి విగ్రహావిష్కరణ కు వస్తున్న భారత ప్రధాని ముందు నిరసన తెలియచేయాలని పిలుపు ఇచ్చారంటే అది పార్టీ పిలుపా లేదా ఆయన వ్యక్తి గత వ్యాఖ్యాలా అనే విషయంలో క్లారిటీ ఇవ్వాలి . వైసీపి ఎమ్మెల్సీని వెంటనే ముందస్తు అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రవీంద్రబాబు వ్యాఖ్యలు శాంతిభద్రతల సమస్యగా పరిగణించాలి. ఈ విషయంలో ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాలి రవీంద్రబాబు ఎమ్మెల్సీగా ఉండే అర్హత కూడా లేదని యామినీ శర్మ ఘాటుగా వ్యాఖ్యానించారు.