ఆరోపణలతో ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఆయన సాక్షుల్ని ప్రభావితం చేసేందుకు యత్నించారన్న అభియోగంపై తాజాగా సస్పెండ్ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏబీ వెంకటేశ్వరరావుపై తీవ్ర అవినీతి అభియోగాలున్నాయని, ఇప్పటికే ఆయన్ని సర్వీసు నుంచి డిస్మిస్ చేయడానికి సిఫార్సు చేశామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అఖిల భారత సర్వీసు అధికారులపై ఉండే క్రిమినల్ అభియోగాలన్నీ తొలగిపోయేంతవరకు లేదా కొట్టేసేంతవరకు వారిపై సస్పెన్షన్ విధించే విచక్షాణాధికారం ప్రభుత్వానికి ఉందని అందులో పొందుపరిచారు. ఈ మేరకు అఖిల భారత సర్వీసు నియమావళి ప్రకారం… ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా పోస్టింగు ఇచ్చామని, ఆ తర్వాత ఆయన తాను ఎదుర్కొంటున్న నేర విచారణకు సంబంధించిన వ్యవహారంలో సాక్షుల్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినట్లు గుర్తించామన్నారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని, సస్పెన్షన్ అమల్లో ఉన్న కాలంలో ఆయన, విజయవాడను విడిచిపెట్టి వెళ్లడానికి వీల్లేదని ఉత్తర్వుల్లో ప్రస్తావించారు.
వైకాపా అధికారం చేపట్టిన వెంటనే 2019 మే 30న ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం బదిలీ చేసింది. పోస్టింగు ఇవ్వలేదు. ఆ తర్వాత భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలు మోపి.. 2020 ఫిబ్రవరి 8న సస్పెండ్ చేసింది. తన సస్పెన్షన్ అక్రమం అంటూ ఆయన హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరికి సుప్రీం ఆదేశాల మేరకు ఈ ఏడాది మే 18న ఆయనను విధుల్లోకి తీసుకుంది. సుప్రీం ఆదేశాల మేరకు తనకు పోస్టింగు ఇవ్వాలని పలుమార్లు సీఎస్‌కు వినతిపత్రాలుఇచ్చాక జూన్ 14న ఆయన్ని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా నియమించింది. బాధ్యతలు చేపట్టి 15 రోజులైనా గడవకముందే మరోమారు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఏబీ వెంకటేశ్వరరావు,ఐపీఎస్ మాట్లాడుతూ జీవో నా చేతికి ఇంకా ఇవ్వలేదు అన్నారు. సోషల్ మీడియాలో మాత్రమే చూసాను. ఏసీబీ కేసు ఉన్న మాట వాస్తవం.ఏడాదిన్నర క్రితం కేసు పెట్టినా ఇంతవరకూ చార్జిషీట్ వేయలేదు. అసలు ట్రయల్ లేకుండా సాక్షులను ఎలా ప్రభావితం చేస్తాను. ఈ సలహా ఏ తీసేసిన తహసీల్దార్ ఇచ్చారో,పనికిమాలిన సలహాదారు ఇచ్చారో..? ఒకసారి హై కోర్టు కొట్టేసినప్పుదు అదే సెక్షన్ కింద మళ్లీ ఎలా సస్పెండ్ చేస్తారు అంటు సందేహాం వ్యక్తం చేశారు, 12 సీబీఐ,6 ఈడీ కేసుల్లో ఏపి సీఎం జగన్ కు చార్జిషీట్ లు ఉన్నాయి. అదే విధంగా శ్రీలక్ష్మి పైనా చార్జిషీట్ లు ఉన్నాయి. ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి కి వర్తించని నిబంధనలు నాకు ఎలా వర్తిస్తాయి అని ప్రశ్నించారు. ఏసీబీ వాళ్ళు ఇచ్చిన నివేదికలో ప్రతి వాక్యం తప్పు.నేను నిరూపిస్తాను.
ఒక్క రూపాయి అవినీతి జరగని చోట అవినీతి కేసు ఎలా పెడతారు. ఇజ్రాయెల్ వాళ్లకు రెండు లెటర్ లు రాశారు.అవినీతి నిరోధక చట్టాలకు లోబడి పనిచేస్తామని చెప్పారు. ఇలాంటి వ్యక్తుల వల్ల వ్యవస్థలకు చెడ్డ పేరు వస్తుంది. కొంతమంది వ్యక్తులు, కొన్ని శక్తులు నన్ను టార్గెట్ చేసాయి. కోడికత్తి కేసు అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని తగలబెట్టాలని చుస్తే గంటల్లోనే అడ్డుకున్నాను. ఎన్నో వెధవ పనులు అడ్డుకున్నందుకే నన్ను టార్గెట్ చేశారు. ప్రభుత్వాన్ని పడగొడతా అని రాజభవన్ గేటు ముందు నేను కామెంట్ చేశానా అది అవాస్తవం అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై న్యాయపోరాటం చేస్తాను
సమజానికి హాని కలిగించే పురుగులను తొలగించే వ్యవసాయం చేస్తున్న అన్నారు. దుర్మార్గుడైన రాజు పాలనలో పని చేసెకంటే అడవిలో వ్యవసాయం చేసుకోవడం మంచిదని ఒక కవి అన్నాడు అనిగుర్తు చేశారు.