రాయలసీమ జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు తెదేపా అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మినీ మహానాడు నిర్వహించారు. కార్యక్రమానికి సంబంధించి నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండల కేంద్రంలో పోలీసులు తెదేపా బ్యానర్లను తొలగించడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నేడు జరగనున్న తెదేపా మినీ మహానాడు కార్యక్రమానికి నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ మినీ మహానాడుకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. వేదిక పరిసరాల్లో నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలుకుతూ భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. కర్ణాటక రాష్ట్ర సరిహద్దు నుంచి రోడ్డు పొడవున మదనపల్లి పట్టణం బైపాస్ రోడ్డులో ఏర్పాటుచేసిన సభ వేదిక వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పట్టణంలో భద్రతను పటిష్ఠం చేశారు. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండల కేంద్రంలో పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన బ్యానర్లను తొలగించి, అధికార పార్టీ నేతల బ్యానర్లను ఉంచడాన్ని నిరసిస్తూ తెదేపా నేతలు మదనపల్లె-పలమనేరు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
రాయలసీమలో 3 రోజుల పాటు చంద్రబాబు పర్యటన
నేటి నుంచి మూడు రోజులపాటు రాయలసీమ జిల్లాల్లో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మహానాడు, నియోజకవర్గవారీ సమీక్షలు, బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు రోడ్షో నిర్వహించనున్నారు. చంద్రబాబు పర్యటన దృష్ట్యా జిల్లాల్లోని పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇక ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మదనపల్లెలో నిర్వహించ నున్న మినీమహానాడుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బైపాస్‌రోడ్డు పక్కన ప్రత్యేకంగా నిర్మించిన వేదిక, ఎదురుగా వీఐపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తల కూర్చు నేందుకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వర్షం వచ్చి నా తడవకుండా వేదిక పైకప్పు వేస్తున్నారు. ఉదయం నుంచి సభాస్థలి వద్దకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, తదితరులు పర్యవేక్షిం చారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు, డీఎస్పీ సభాస్థలి వద్ద బందో బస్తు, సెక్యూరిటి ఏర్పాట్లు పరిశీలించ్చారు.