తమిళిసై సౌందరరాజన్ మానవత్వాన్ని చాటుకున్నారు. వారణాసి నుంచి తమిళిసై ఫ్లయిట్ లో హైదరాబాద్ కి తిరిగి వస్తున్న సమయంలో ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. ఐతే విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసే పరిస్థితి లేదు. దీంతో ఫ్లయిట్ అటెండెంట్ విమానంలో ఎవరైనా వైద్యులున్నారా అంటూ అడిగేసరికి వెంటనే స్పందించిన డాక్టర్ శ్రీమతి తమిళిసై ఆ ప్రయాణికుడికి ప్రాధమిక చికిత్స అందించారు. ఇక విమానం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యాక ఎయిర్ పోర్ట్ మెడికల్ వార్డ్ కి తరలించారు. ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉండేసరికి అతను తమిళిసైకి కృతజ్ఞతలు తెలిపారు. తమిళిసై ఉన్నతమైన పదవిలో ఉన్నా కూడా ..వైద్యురాలిగా తన బాధ్యత నిర్వహించారని విమానంలోని ఇతర ప్రయాణికులు గవర్నర్ కి అభినందనలు తెలిపారు. ఈ విషయం తెలిసిన నెటిజన్స్ ఆమెను సోషల్ మీడియాలో పొగిడేస్తున్నారు. తమిళిసై తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్. ఈమె వైద్యురాలు కూడా. 2019 సెప్టెంబర్ 8 న గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు.
Excellent job madam… Continuously proving that your a best doctor and good administrator 🙏🙏🙏🙏Jai Hind pic.twitter.com/k9KZzkI0in
— Surendiran (@Surendiran992) July 23, 2022