తిరుపతి : వైయస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం ప్రారంభించడం జరిగింది. రైతులా శ్రేయస్సే ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. రైతు భరోసా క్రింద రాష్ట్ర ప్రభుత్వం 7500 లు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు విరాళంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో.. కలపి సంవత్సరానికి 13500 మొత్తాన్ని మూడు విడతలుగా జమ చేయడం ద్వారా రైతులకు ఆర్థికంగా సహాయం చేయడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంప్రారంభించిన కార్యక్రమమే రైతు భరోసా
రైతుల లబ్ది…. వివరాలు…
ఆంధ్రప్రదేశ్లోని 36 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చడానికి 3785 కోట్లను విడుదల చేస్తూ 2019 అక్టోబర్ 15 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ..వైయస్సార్ రైతు భరోసాను ప్రారంభించారు. మొక్కలు ..ఎరువులు ..విత్తనాలను సరఫరా చేసేందుకు.. రైతు భరోసా కేంద్రాలను 2020 మే 30న ప్రారంభించారు. ఆక్వా కల్చర్ ..హార్టికల్చర్ మరియు వ్యవసాయ రంగాలకు 2019 -20 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 6173 కోట్లు ;2020 -21వ సంవత్సరానికి గాను 6928 కోట్లు ఖర్చు చేయబడింది.
లక్ష్యానికి దూరం- ఆర్భాటపు ప్రచారం…
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అమ్ముకోవడానికి అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. గత్యంతరం లేక అమ్ముకునేందుకు దళారుల వద్దకు వెళ్తున్నారు. దళారుల ఆగడాలను అరికట్టేందుకు రైతు భరోసా కేంద్రాల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావించింది .కానీ క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఉన్న ధాన్యం ఎప్పుడు కొంటారో డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితుల్లో ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో శ్రీకాకుళం .తదితర ప్రాంతాల్లో ధాన్యం కొనుగోళ్లలో దళారులదే ఫైచేయి అవుతుంది. మిల్లర్ల ముసుగులో కొందరు రైతులను నిండా ముంచేస్తున్నారు. వీరి ఆగడాలను అరికట్టేందుకే ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయాలని భావించిన ..అది .ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఈ ఏడాది ..ధాన్యం కొనుగోలను అధికారులు ఆలస్యంగా ప్రారంభించారు.. దీనికి తోడు మిల్లర్లకు సార్టెక్స్…. నాన్ సార్టెక్స్.. అని మెలిక పెట్టారు. అందువల్ల కొనుగోళ్లకు ఇంత ఆలస్యం అయ్యింది .ఒక్క శ్రీకాకుళం జిల్లాలో 319 రైస్ మిల్లులు ఉంటే అందులో. నాన్ సార్టెక్స్ 150 కి పైగా ఉన్నాయి వీటి ద్వారా ప్రభుత్వం ధాన్యం సేకరణను ప్రస్తుతం నిలిపివేశారు ఇదే అదునుగా రైస్ మిల్లుల యాజమాన్లు దళారులను రంగంలోకి దించి రైతుల నుంచి ధాన్యాన్ని తక్కువ ధరకే కొనుగోలు చేయిస్తున్నారు. దీనివలన రైతు భరోసా కేంద్రాలు లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాయి .ఏడు లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యం గా పెట్టుకున్నా..ఇప్పటివరకు 5 లక్ష ల 42 వేల మెట్రిక్ టన్ను లు మాత్రమే సేకరించారు. రైతులు విధిలేని పరిస్థితుల్లో మిల్లర్ల దగ్గరకు ధాన్యాన్ని తీసుకు వెళ్తున్నారు పాలకొండ శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాల్లో ధాన్యాన్ని కొనేవారు లేక ఇంకా పొలాల్లోనే ధాన్యాన్ని రాశులుగా పోసి ఉంచామని రైతులు వాపోతున్నారు రైతు భరోసా కేంద్రాల ద్వారా కొన్నిచోట్ల ధాన్యం సేకరించిన ప్రభుత్వం ఇప్పటివరకు మూడు వందల 16 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించింది ఇంకా 550 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది పంట విక్రయించిన ఇరవై ఒక్క రోజుల్లోపు ఖాతాలో డబ్బులు వేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆచరణలో విఫలమయ్యింది. అలాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా కౌలు రైతుల ధాన్యం కొనుగోలు చేయాలనే నిబంధన ఉన్నా అది అమలవడం లేదు .ధాన్యం కొనుగోళ్లపై అధికార పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న. పరిస్థితి మెరుగుపడటం లేదు అని రైతులు వాపోతున్నారు. తిరుపతి …రాయలసీమ… పల్నాడు.. …అనంతపురం… కోస్తాంధ్ర ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాల్లో ఆశించిన విధంగా రైతులకు మేలు జరగడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉందని రైతులు వాపోతున్నారు…