ఒకప్పుడు మహిళలంతా దూరదర్శన్ లో ప్రసారమయ్యే డైలీ సీరియల్ ఋతురాగాలను ఎంత ఆసక్తిగా చూసేవారో మళ్ళీ ఇన్నాళ్లకు కార్తీక దీపాన్ని అంతలా ఆరాధించారు. ఇక ఇందులో నల్లగా కనిపించే వంటలక్క అలియాస్ దీప అలియాస్ ప్రేమివిశ్వనాధ్. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక ఈ సీరియల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని, టీఆర్పీ రేటింగ్ ని సంపాదించుకుంది. కేవలం వంటలక్క కోసమే సీరియల్ చూసే వాళ్ళు వున్నారు. స్క్రీన్ మీద వంటలక్క ఏడిస్తే ఇంట్లో ఏడ్చే మహిళలు కూడా ఉన్నారు. అలాంటి ఇన్సిడెంట్స్ మీద కొన్ని మీమ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. “వాంటెడ్ దీప” అంటూ ఒక ఫోటో తెగ చక్కర్లు కొడుతోంది. తెలుగు ప్రేక్షకుల మనసుల్ని ఇన్నేళ్ళుగా దోచుకుని ఇప్పుడు హ్యాండ్ ఇచ్చేసి వదిలి వెళ్లిపోవడం కరెక్టా..ఇలా చేయడం నేరం కదా అంటున్నారు ఫాన్స్. ఆమెను పట్టుకుంటే రివార్డ్ కూడా ఇస్తాం అంటూ అభిమానులకు ఈ పోస్టర్ ద్వారా తెలిపారు.
ప్రేమి విశ్వనాధ్ బుల్లి తెరకు దూరమైనా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. తన ఫోటో షూట్స్ ని, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అభిమానులకు ఇచ్చే సెల్ఫీ పిక్స్ ని అన్నిటినీ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో అభిమానులతో ఎప్పటికప్పుడు షేర్ కూడా చేస్తుకుంటూ ఉంటుంది. పవర్ కట్ ఐనా సరే కార్తీకదీపం సీరియల్ టైం అయ్యింది టీవీ పెట్టండి అనే పోస్టర్స్ కూడా అప్పట్లో బాగా ట్రెండింగ్ అయ్యాయి. దీని బట్టి కార్తీకదీపం ఏ రేంజ్ లో అలరించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సీరియల్ లో డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత పిల్లలు పెద్దవాళ్ళు ఇపోయారు. అందుకే ఒరిజినల్ క్యారెక్టర్స్ ని పూర్తిగా ఆపేసి కొత్త యంగ్ క్యారెక్టర్స్ తో సీరియల్ ని నడిపిస్తున్నారు. ఐనా సరే ఈ సీరియల్ ని చూడకుండా ఎవరూ ఉండడం లేదు. ఎందుకంటే ఏదో ఒక ఎపిసోడ్ లో అన్నా వంటలక్క కనిపిస్తుందేమో అనే ఆశతో చూస్తున్నారు. చాలామంది కూడా వంటలక్క క్యారెక్టర్ లేని సీరియల్ చూడము అంటూ కామెంట్స్ కూడా చేశారు. ఆమెను మళ్ళీ సీరియల్ లో కనిపించేలా ప్లాన్ చేయాలని అభిమానులు కోరుకున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలను కూడా వంటలక్క చుట్టేసింది. ఇక ఇప్పుడు దీప ఒక నేరం చేసిందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టర్ వైరల్ గా మారింది.