విశాఖపట్నంలో ప్రపంచలోనే అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం జరిగింది.అనంతరం బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్లో ఓ కార్యక్రమం నిర్వహించారు. సీఎం జగన్ మాట్లాడుతూ ఏపీలో ప్లాసిక్ ఫ్లెక్సీలను పూర్తిగా నిషేధిస్తున్నట్లుగా చెప్పారు. ఇకపై రాష్ట్రంలో ఫ్లెక్సీలు పెట్టాలంటే ప్లాస్టిక్ ఫ్లెక్సీలు పెట్టకూడదని, కాస్త రేటు ఎక్కువైనా గుడ్డతో తయారుచేసినవే పెట్టాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. నేడు ఒక్కరోజే ఉదయం 6 నుంచి 8 వరకూ 76 టన్నుల ప్లాస్టిక్‌ను సముద్రం నుంచి తొలగించారని సీఎం జగన్ అన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక పురోగతి అనేవి నాణేనికి రెండు వైపులు అని జగన్ అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే ఆర్థిక పురోగతి సాధించాలని పిలుపునిచ్చారు.
భూమిపై 70 % ఆక్సిజన్ సముద్రం నుంచే వస్తోందని అందుకే సముద్రాన్ని కాపాడుకోవాలి. పార్లే ఫర్ ది ఓషన్ సంస్థ సముద్రం నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీస్తుంది. రీ సైకిల్ చేసి కొన్ని ఉత్పత్తులు తయారు చేస్తుంది. అంతేకాకుండా, పార్లే ఫ్యూచర్ ఇనిస్టిట్యూట్‌ను ఏపీలో ఏర్పాటు చేయనున్నారని సీఎం జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీల బ్యాన్ ని ఏపీలో తొలి అడుగుగా ఆయన చెప్పారు. 2027 కల్లా ఏపీని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ప్లాస్టిక్ ను రీసైక్లింగ్ చేసి తయారు చేసిన షూస్, కళ్ల జోడులను సీఎం స్వయంగా చూపించారు. ఆయన కళ్ల జోడు ధరించగానే కన్వెన్షన్ హాల్ మొత్తం ఈలలతో దద్దరిల్లింది. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్ నాథ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి ఆదాయం పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. అందుకే అమెరికాకు చెందిన పార్లె సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని అన్నారు.
భూమి పై 70 శాతం ఆక్సిజన్ సముద్రం నుంచే వస్తోంది. #ParleyForTheOceansVizag#CMYSJagan #ExecutiveCapitalVizag pic.twitter.com/bPu79T8FUj
— YSR Congress Party (@YSRCParty) August 26, 2022
