ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కు ఇప్పటివరకు జెడ్ ప్లస్ 6+6 కమాండోలతో వున్న భద్రత ను
జెడ్ ప్లస్ 12+12 కమాండోలతో భధ్రత పెంచింది కేంద్రం ప్రభుత్వం.. ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబుకు తక్షణం భధ్రత పెంచుతూ NSG DG ఉత్తర్వులు చేయగా, నిన్ననే అమరావతిలోని చంద్రబాబు ఇంటిని, టిడిపి కేంద్ర కార్యాలయాన్ని ఎన్.ఎస్.జీ డిజీ స్వయంగా పరిశీలించారు.. అంతే కాకుండా టిడిపి కార్యాలయంలోని నాయకులతో మాట్లాడి స్ధానిక పోలీసు అధికారుల భద్రత ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు.. గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పర్యటిస్తున్న క్రమంలో కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు వంటివి అధికం అయ్యాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు భద్రతపై ఎన్.ఎస్.జీ ప్రత్యేక దృష్టి సారించింది.కుప్పం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో బస చేస్తున్న చంద్రబాబుకి 12+12 భధ్రత ఏర్పాటు చేసింది.
గడిచిన కొంతకాలం లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి, ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలోకి చొచ్చుకు పోవడానికి ప్రయత్నం వంటి సంఘటనల నేపథ్యంలో ఆయన భద్రతపై ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఇన్ పుట్స్ రావడంతో ఆయన భద్రత విషయంలో ఎన్.ఎస్.జీ అప్రమత్తమైంది. చంద్రబాబు భద్రతపై రివ్యూ చేయాలని నిర్ణయించుకుంది. దేశ వ్యాప్తంగాద ఎన్.ఎస్.జీ భద్రత ఉన్నది కేవలం నలభై మందికి మాత్రమే. వారిలో చంద్రబాబు కూడా ఒకరు. ఈ మేరకు ఎన్.ఎస్.జీ డీఐజీ నేతృత్వంలోని ప్రత్యేక బృందం తేలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం పరిశీలించారు. భద్రతా పరంగా కొన్ని లోటుపాట్లను గుర్తించారు. ఆయనకు భద్రతను మరింత పెంచాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు. రాష్ట్రప్రభుత్వం తరఫున చంద్రబాబుకు లభిస్తున్న భద్రతా ఏర్పాట్ల పట్ల ఎన్ఎస్జీ బృందం ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.