రాజ్ పధ్ పేరుని కర్తవ్య పధ్ గా మారుస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పాటు అలహాబాద్ కి ప్రయాగ వంటి పేరు పెట్టడం , ఇక దేశంలో చాలా పేర్లు వలసపాలనలో ఉన్నవే కొనసాగుతుంటే వారిని మార్చిన తీరు వంటి వాటి పట్ల జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీని మెచ్చుకున్నారు. భారతీయతను చాటేలా మోడీ సర్కార్ అనేక కార్యక్రమాలు చేస్తోంది అని ప్రశంసలతో ముంచెత్తారు.
పేర్లు మార్చి బ్రిటిష్ రాచరిక వ్యవస్థ మిగిల్చిన గాయలను రూపుమాపడం గొప్ప నిర్ణయం అని పవన్ ప్రశంసించారు. పాత గాయాలు తుడిచే పనిలో మోడీ సర్కార్ చాలా చక్కగా పనిచేస్తోంది అని పవన్ కొనియాడారు. ప్రధాని అధికార నివాసం రేస్ కోర్స్ పేరుని లోక్ కళ్యాణ్ మార్గ్ గా మార్చడం కూడా చాలా మంచి నిర్ణయం అని అన్నారు.
వాయుసేన పతాకంలో సెయింట్ జార్జ్ క్రాస్ స్థానంలో కొత్త పతాకాన్ని మోదీ తీసుకొచ్చారని, ఇదే తీరున మరిన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు కూడా తీసుకోవాలని, కర్తవ్య పధ్ లో సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మోడీ సర్కార్ దానితో పాటు జపాన్ లో భద్రపరిచిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మహావీరుడి అస్తికలను భారత్ రప్పించే కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు.
వలసవాద పాలనా చిహ్నాలను చెరిపివేస్తున్న శ్రీ @narendramodi గారు అభినందనీయులు – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/ElcBdGuu7u
— JanaSena Party (@JanaSenaParty) September 9, 2022