సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీస్ తో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబంతో మంచిగా టైం స్పెండ్ చేస్తాడు. ఇంకా ఆయన ఇటీవల అమెరికా, యూరోప్ లో వెకేషన్‌ను ముగించుకుని వచ్చారు. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక అది అలా ఉంటే ఈ రోజు మహేష్ గారాల పట్టీ.. కూతురు సితార ఘట్టమనేని 10వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. దీంతో మహేష్ సితారకు స్పెషల్ విషెష్ చెప్పారు. ప్రపంచంలో బ్రైటెస్ట్ స్టార్ సితారకి పదేళ్లు వచ్చేసాయి. హ్యాపీ బర్త్ డే సితార, నా ప్రేమ ఎప్పటికీ ఉంటుంది అని మహేష్ ప్రేమతో ట్వీట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తన 28వ మూవీని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మహేష్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీకి మది ఫోటోగ్రఫి అందిస్తున్నారు. ఆగస్టులో షూటింగ్‌కు వెళ్లనున్న ఈ మూవీ వేగవంతంగా షూటింగ్ జరుపుకుని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది. దీంతో ఇప్పటికే టీమ్ మ్యూజిక్ సిట్టింగ్స్‌లో ఉందని..
All of 10.. before we even knew it! ♥️♥️♥️ To the brightest star in my world… Happy birthday Sitara!! I love you tenfold 🤗🤗🤗 pic.twitter.com/m693TMYad5
— Mahesh Babu (@urstrulyMahesh) July 20, 2022
మరోవైపు స్క్రిప్ట్ కూడా లాక్ అయ్యిందని అంటున్నారు. ఈ సినిమాకు ‘పార్థు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.. ఇక మహేష్ లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట విషయానికి వస్తే ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత భారీ అంచనాల నడుమ మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకోంది. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం యావరేజ్‌గా నిలిచింది. ఈ సినిమాకు యువ దర్శకుడు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహించగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేశారు. థమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇక ఈ సినిమా ప్రిరిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఈ సినిమా మొత్తంగా 120 కోట్లకు జరిగిందని తెలుస్తోంది. నైజాంలో 36 కోట్లకు అమ్ముడైందని తెలుస్తోంది. సీడెడ్ 13 కోట్లకు, ఉత్తరాంధ్ర 12. 50 కోట్లకు ఈస్ట్ 8.50 కోట్లకు, వెస్ట్ 7 కోట్లకు, గుంటూరు 9 కోట్లకు, కృష్ణ 7.50 కోట్లకు, నెల్లూరు 4 కోట్లకు ఇక ఏపీ తెలంగాణ మొత్తంగా 96. 50 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక కర్నాటక 8.50 కోట్లకు, రెస్ట్ ఆఫ్ ఇండియా 3 కోట్లకు, ఓవర్సీస్ 11 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. మొత్తంగా 120 కోట్లకు అమ్ముడు పోయింది. దీంతో బ్రేక్ ఈవెన్ కావాలంటే 121 కోట్లు రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అందుకోలేకపోయి.. యావరేజ్ హిట్ గా నిలిచింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ’మురారి వా’ అనే ఫుల్ పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకి దక్కించుకుంది. ఈ సినిమా జూన్ 23న స్ట్రీమ్ కానుంది.