అర్జున్ రెడ్డి ఫాన్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. అనుకున్నట్టుగానే రౌడీబాయ్ అభిమానులను ఖుషి చేయడానికి మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరు. సోషల్ మీడియా వేదికగా లైగర్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో అంతులేని అంచనాల మధ్య తెరకెక్కిన లైగర్ మూవీ నుంచి పవర్ పుల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇటు పూరీ జగన్నాథ్ కు, అటు విజయ్ దేవరకొండకు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ `లైగర్. వచ్చే నెల ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచారు టీమ్. మాస్ ప్రేక్షకులు అంచనాలు ఏమాత్రం తప్పకుండా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో లైగర్ ట్రైలర్‌ని విడుదల చేశారు.
And here goes the #Liger Trailer
Puri Strikes Again!
Raising expectations sky high..
All The Very Best to Entire Team!https://t.co/Te4M9zmdyF@TheDeverakonda @ananyapandayy @MikeTyson @karanjohar #PuriJagannadh @Charmmeofficial @apoorvamehta18 @iamVishuReddy @RonitBoseRoy pic.twitter.com/U37aLtOjY2
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 21, 2022
ఈ ట్రైలర్ ని చిరంజీవి, ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ కావడంతో అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. మరోసారి మాస్ దమ్ము ఏంటో చూపించాడు అర్జున్ రెడ్డి. ఇక విజయ్ దేవరకొండ బాక్సర్ గా టెంపర్ ఉన్న క్యారెక్టర్.. నత్తితో.. టోన్డ్ బాడీతో, బాక్సీంగ్ కింగ్ లా రచ్చ రచ్చ చేశాడు. ఇక బాహుబలి తరువాత రమ్యకృష్ణలోని పవర్ ఫుల్ విమెన్ ను పూరీ మరోసారి బయటకు తీశాడు. “సాలా కొట్టరా” అంటూ రమ్యకృష్ణ డైలాగ్ ట్రైలర్ కే హెలెట్ గా నిలిచింది.. ఇక ఈసారి ట్రైలర్ లో హాలీవుడ్ స్టార్ బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ తనదైన స్టైల్ లో సందడి చేశారు. మోత్తానికి లైగర్ ట్రైలర్ మాస్ జనాలకి.. ముఖ్యంగా రౌడీ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టిందనే చెప్పాలి. ఇక ఈ ట్రైలర్ ను చిరు, ప్రభాస్ తో పాటు హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సుదర్శన్ థియేటర్‌లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మితో పాటు మరికొంత మంది పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ట్రైలర్‌ని అన్ని భాషల్లో ఒకే సారి ప్లాన్ ముంబయిలో కూడా ఈవెంట్ నిర్వహించనుండడం విశేషం. ముంబయిలో హిందీ ట్రైలర్ ని రణ్ వీర్ సింగ్, మలయాళ ట్రైలర్ని దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేస్తున్నారు. తెలుగు సినిమాగా స్టార్ట్ అయిన ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ తీసుకెళ్ళడం కోసం పూరీ కనెక్ట్స్ పతాకంపై ఛార్మితో కలిసి ధర్మ ప్రొడక్షన్ కరణ్ జోహార్ కలిశారు. ఇక ఈమూవీలో విజయ్ దేవరకొండకి జోడీగా అనన్య పాండే నటిస్తోంది. ఈ ట్రైలర్ లో ఆమె డైలాగ్స్ కూడా హైలెట్ గా నిలిచాయి అలాగే ఆడియన్స్ ఎంటర్టైన్ చేయబోతున్నాయి. ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ను పలకరించనుంది లైగర్ . ఆడియన్స్ ఈ మూవీ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
India,
We give you Blood, Sweat, Madness.
We give you Mass Action Entertainment.
We give you The LIGER Trailer!
ATTACK!https://t.co/u7529aF8NS#LIGER#LigerTrailer
Aug 25th Worldwide Release! pic.twitter.com/f6kFdVvCPS— Vijay Deverakonda (@TheDeverakonda) July 21, 2022