శ్రీకాకుళం : జిల్లాలో కంబిరిగాం భూ వివాదం నివురుగప్పిన నిప్పులా మారింది. రైతుల మధ్య ఆధిపత్య పోరుకు తెరలేపింది. దీనిపై రాజకీయరంగు పులుముకోవడంతో వివాదం మరింతగా ముదురుతోంది. వాస్తవానికి కంబిరిగాం భూ వివాదం ఇప్పటిది కాదు. కంబిరిగాం చౌదరి అనే భూస్వామికి చెందిన వందలా ఎకరాల భూములను చుట్టు పక్కనే ఉన్న కేదారిపురం రైతులు దశాబ్దాలుగా సాగుచేస్తూ వస్తున్నారు. అయితే ఆ భూములు తమవేనంటూ భూస్వామి కుటుంబసభ్యులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా అప్పట్లో రైతులు ప్రతిఘటించారు. తాము సాగుచేసిన భూములకు సాగు హక్కు కల్పించాలని కోరుతూ గత 20 సంవత్సరాలుగా రైతులు పోరాటం చేస్తూ వచ్చారు. దీనికి ప్రజా సంఘాలు, వామపక్షాలు మద్దతు తెలుపుతూ వచ్చాయి. చివరకు వివాదం న్యాయస్థానాల వద్దకు చేరింది. సుప్రీం కోర్టు వరకూ కేసు నడిచింది. అయితే అత్యున్నత న్యాయస్థానం రైతులకు అనుకూలంగా కొద్ది నెలల కిందట తీర్పు ఇచ్చింది. ఈ భూములకు సంబంధించి అప్పట్లో 90 మంది రైతులు ఉండగా ప్రస్తుతం వారి వారసులతో కలసి మొత్తం 122 మంది అయ్యారు. అప్పటివరకు రైతుల ఆధీనంలో మొత్తం 194.65 ఎకరాల భూమి ఉండేది. దీనిని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2/3వంతు రైతులు, ఇనాందారులకు రెవిన్యూ యంత్రాంగం భూ పంపిణీ చేపట్టింది.
మంత్రి పాత్రపై అనుమానం..?
అయితే ఈ వ్యవహారంలో రాజకీయ జోక్యం అధికమైంది. ఇక్కడ భూముల ధరలు కోట్లాది రూపాయలు ఉండడంతో.. స్థానిక మంత్రి అప్పలరాజుతో పాటు వైసీపీ నాయకులు భూస్వామి వద్ద తాయిలాలు తీసుకొని నిజమైన రైతులకు అన్యాయం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భూ పంపకాల్లో 12 మంది రైతులకు అదనంగా భూమి ఇచ్చారని నిజమైన రైతులు ఆరోపి స్తున్నారు. భూ పంపకాల్లో సాంకేతిక ఇబ్బందులు రావడంతో మొత్తం 20 ఎకరాల భూమి ఇనాందారులకు ఇచ్చేందుకు రైతులు జంటిల్‌మెన్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ భూమిలో మొత్తం 6.15 ఎకరాల భూమిలో(పలాస రోడ్డులో) నివాసస్థలాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఆ భూమిని ఇనాందారుల పేరుమీద కాకుండా ఇనాందారుల నమ్మకస్తులపై బదలాయించాలని కోరడంతో అధికారులు ఆ విధంగా భూమి పత్రాల రికార్డులు తయారు చేశారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్త మయ్యాయి. ఉద్యోగస్తులు, రైతు కమిటీలు ఏర్పాటు చేసిన వారికి భూములు ఇవ్వడం ఏమిటని స్థానిక రైతులు ప్రశ్నిస్తున్నారు. అర్హులైన రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలలు గడుస్తున్నా ఈ వ్యవహారం కొలిక్కిరాకపోవ డంతో దీనిపై రైతుల తరపున ప్రాతినిధ్యం వహించిన వారిని స్థానికులు ప్రశ్నిస్తుండడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. 20 ఎకరాల భూమిని అప్పనంగా కొంతమంది తీసుకున్నారని.. ఇందులో అధికార పార్టీ నాయకులు ఉన్నారని భూములను సాగుచేస్తూ వస్తున్న కేదారిపురం రైతులు ఆరోపిస్తున్నారు. కంబిరిగాం భూ స్వాములతో ఆ 12 మంది కుమ్మక్కై ఎక్కువ భూమి తీసుకున్నారని, దీనిలో అధికారులు, రాజకీయ నాయకుల పాత్ర కూడా ఉందని ఆరోపిస్తున్నారు. మొత్తం భూ పంపిణీ రద్దు చేసి.. రైతులందరికీ న్యాయం చేసేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
రైతుల మధ్య విభేదాలు..!!!
అయితే ఇదే విషయమై భూములు సాగుచేస్తున్న కేదారిపురం రైతుల మధ్య అధికార పార్టీ చిచ్చు పెట్టింది. తద్వారా తమ పని సులవుగా నెరవేర్చుకోవచ్చన్నది నేతల భావన. అందుకు తగ్గట్టుగానే వారి మధ్య వివాదం స్రుష్టించారు. అప్పటి నుంచి రైతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.ఇటీవల కొట్లాటకు దారి తీయగా.. పది మంది గాయాలపాలయ్యారు. కంబిరిగాం భూముల పంపకాలు సక్రమంగా జరగలేదని, భూస్వాములకు కొంతమంది రైతులు కొమ్ముకాస్తున్నారని స్థానిక యువకులు మూడు నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం గ్రామానికి చెం దిన 20 మంది యువకులు.. భూ పంపకాల్లో కీలకంగా వ్యవహరించిన కేదారిపురం మాజీ సర్పంచ్ కె.ఫల్గుణరావును ప్రశ్నించేందుకు వెళ్లడంతో అక్కడ ఘర్ష ణ తలెత్తింది. అనంతరం వారు గ్రామానికి చేరుకోగా.. విషయం తెలుసుకున్న కేదారిపురానికి చెందిన రైతులు ఆ యువకులతో ఘర్షణకు దిగారు. మాజీ సర్పంచ్ ఇంటికి వెళ్లి ఎందుకు రాద్ధాం తం చేశారని ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగి.. కొట్లాటకు దారి తీసింది. పది మందికిపైగా గాయాలపాలయ్యారు.
ఆది నుంచీ వివాదమే..!
కంబిరిగాం భూములపై మొదటి నుంచి అనేక వివాదాలు నడుస్తున్నాయి. ఎంతోమంది శాంతియుతంగా పోరాటం చేశారు. భూములు రైతులకే దక్కాలని సీపీఐ నాయకులు సైతం ఇక్కడే మకాం వేసి జైలుపాలయ్యారు. చివరకు ఇనాందారులు, రైతుల గొడవ సుప్రీంకోర్టు తీర్పుతో పరిష్కారం కాగా.. భూముల పంపకాల్లో తేడాలతో రైతుల మధ్యే ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఇనాందారులు, రైతుల మధ్య 2/3 వంతు భూ పంపకాలు జరిగాయి. అయితే ఇందులో 20 ఎకరాలు అందరి రైతుల ఖాతాల్లో కాకుండా వీరికి నాయకత్వం వహిస్తున్న 12 మంది ఖాతాల్లో పడ్డాయి. దీంతో మిగిలిన వారిలో అనుమానాలు రేగాయి. ఒకపక్క పంపకాలు సాగుతుండగా.. ఇనాందారులు భూములు అంతే వేగంతో అమ్మకాలు చేస్తుండడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు 15 ఎకరాలు కాశీబుగ్గ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏప్రిల్ నెలలో రిజిస్ట్రేషన్ జరిగినట్లు స్పష్టమవుతోంది. ఆ వ్యక్తులు కొద్దిరోజుల క్రితం కంబిరిగాంలో మకాం వేసినట్లు తెలుస్తోంది. తాము భూములు కొనుగోలు చేశామని, అందులోకి వచ్చి ఆందోళన చేస్తే బాగుండదని హెచ్చరించడంతో రైతులు కూడా వారితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. దీనికి తోడు ఈ భూముల్లో తాము రిజిస్ట్రేషన్లు చేయించామని రోజుకొకరు వస్తుండడంతో రైతులు ఆగ్రహాన్ని ఆపుకోలేకపోతున్నారు. కోర్టు తీర్పు ప్రకారం తమకు భూములు ఇవ్వాలని, లేకుంటే వెనక్కి తగ్గేది లేదని, నాయకులకు కూడా ప్రశ్నించి న్యాయం కోసం పోరాడుతామని హెచ్చరిస్తున్నారు. కంబిరిగాం భూ వ్యవహారంలో జిల్లా అధికారులు జోక్యం చేసుకుని రైతుల మధ్య ఉన్న సందేహాలు తీర్చడంతో పాటు సమస్య పరిష్కరించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెరపైకి తెలంగాణ ప్రముఖులు
కంబిరిగాం భూముల వివాదంలో తెలంగాణ ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చాయి. ముగ్గురి పేరిట 15 ఎకరాలు ఈ ఏడాది ఏప్రిల్ 4న రిజిస్ట్రేషన్ కావడం చర్చనీయాంశమైంది. రైతులకు చెందాల్సిన ఈ భూములు ఇతరుల ఆధీనంలోకి వెళ్లి డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్న తెలంగాణ ప్రముఖులు ఇక్కడికి వచ్చి కేదారిపురం రైతులతో వాగ్వాదానికి దిగి హెచ్చరించడం వల్లే పరిస్థితి చేయిదాటినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం రైతుల మధ్య కొట్లాట జరిగి 10 మంది గాయపడ్డారు. పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఎవరీ తెలంగాణ ప్రముఖులు? వారికి ఇక్కడి భూములు అమ్మాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? రైతులు, ఇనాందారుల మధ్య వివాదం ఉండగానే ఈ భూములను ఇతరులకు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించారు? ఇందులో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? అన్న ప్రశ్నలు