2050 నాటికి భారత్ జనాభా పరంగా భారత్ 2023లో చైనాను అధిగమించి, అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారుతుందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి నివేదికను విడుదల చేసింది. ఇందులోని అంశాలను పరిశీలించినట్టయితే.. 2022 నవంబర్ 15 నాటికి ప్రపంచంలోని మొత్తం జనాభా సంఖ్య 800 కోట్ల మార్క్ ను చేరుకుంటుంది. 1950 తర్వాత ప్రపంచ జనాభా అత్యంత తక్కువ వృద్ధి రేటును చూస్తోంది. 2020లో జనాభా వృద్ధి రేటు ఒక శాతం లోపునకు పడిపోయింది. 2030 నాటికి 850 కోట్లు, 2050 నాటికి 970 కోట్లకు ప్రపంచ జనాభా విస్తరించనుంది. 2080 నాటికి 1040 కోట్లకు చేరి, 2100 నాటికి అదే స్థాయిలో జనాభా ఉంటుంది. ప్రస్తుతం చైనా జనాభా 142,6 కోట్లు కాగా,, భారత్ జనాభా 141.2 కోట్ల స్థాయిలో ఉంది. 2050 నాటికి పెరిగే జనాభాలో అధిక శాతం భారత్, కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, నైజీరియా, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, టాంజానియా నుంచే ఉండనుంది. ప్రపంచంలో అతిపెద్ద దేశాల మధ్య జనాభా వృద్ధి రేట్లలో ఉన్న అసమానతలే వాటి స్థానాలు మారెటందుకు దారితీస్తున్నాయి. భారత్ జనాభా 2050నాటికి 166.8 కోట్లకు పెరగనుంది. అప్పుడు చైనా జనాభా 131.7 కోట్ల వద్దే ఆగిపోనుంది..
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన తొలి రెండు ప్రాంతాలుగా తూర్పు, ఆగ్నేయాసియా ప్రాంతాలు నిలిచాయని నివేదిక వెల్లడించింది. ఈ రెండు ప్రాంతాల్లో మొత్తం 230 కోట్ల జనాభా ఉండగా.. ప్రపంచ జనాభాలో 29శాతం ఇక్కడే నివసిస్తున్నారు. ఇక, 210 కోట్ల జనాభాతో దక్షిణాసియా, మధ్య ఆసియా ప్రాంతాలు తర్వాతి స్థానంలో నిలిచాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు కూడా ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈ జాబితాలో చైనా ప్రథమ స్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో ఉంది. అయితే, 2023 నాటికి ఈ ర్యాంకుల్లో కాస్త మార్పు జరగనుందని, చైనాను దాటేసి భారత్ అత్యధిక జనాభా గల దేశంగా నిలిచే అవకాశముందని నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం చైనా జనాభా 142.6కోట్లు కాగా.. భారత జనాభా 141.2 కోట్లుగా ఉంది. 2050 నాటికి భారత జనాభా 166.8 కోట్లకు చేరనుందని ఐరాస అంచనా వేసింది. అదే సమయంలో చైనా జనాభా 131.7 కోట్లకు తగ్గే అవకాశముందని తెలిపింది.
ఇక ఈ ఏడాది నవంబరు 15 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్ల మార్క్‌ను తాకే అవకాశముందని ఐరాస అంచనా వేసింది. 2030 నాటికి ఈ సంఖ్య 850 కోట్లు.. 2050 నాటికి 970 కోట్లకు చేరే అవకాశముందని తెలిపింది. ”ఈ ఏడాది ప్రపంచ జనాభాలో సరికొత్త మైలురాయిని చేరుకోనున్నాం. ఈ ఏడాదిలోనే ఈ భూమ్మీద 800కోట్లవ శిశువు జన్మించే అవకాశముందని అంచనా వేస్తున్నాం. మన వైవిధ్యతను వేడుక చేసుకునే సందర్భం అది.
ఆరోగ్య ప్రమాణాల్లో మరింత పురోగతి సాధిస్తున్నాం. ఆయుర్దాయం పెరుగుతోంది. మాతా, శిశు మరణాల రేట్లు కూడా తగ్గుతున్నాయి” అని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెసర్ ఈ సందర్భంగా తెలిపారు. అయితే అదే సమయంలో ఈ భూమండలాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీదా ఉందన్నారు.
This year, the global population is expected to reach 8 billion.
Working together for greater equality and solidarity, we can ensure that our planet can support our needs and those of future generations. https://t.co/aoUD0lYKX6 pic.twitter.com/TJXN19pf36
— António Guterres (@antonioguterres) July 11, 2022