కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పై నిందలు మోపుతూ బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకె శైలజనాథ్ ఆరోపించారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, యువ నేత రాహుల్ గాంధీ ల పై ఎఫ్ ఐ ఆర్ కూడా లేకుండా విచారణ జరిపేలా బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అప్రజాస్వామికమైన, అనైతికమైన విధానాలతో చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ దుర్మార్గమైన చర్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని శైలజనాథ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే వెనక్కు తీసుకుని బీజేపీ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన రాహుల్ గాంధీ మార్గం లో పయనిద్దామని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ దేశానికి రక్ష అని శైలజనాథ్ పేర్కొన్నారు
. రెండవ రోజూ విచారణ జరపడాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.