తల్లిని చెల్లిని మోసం చేసిన వ్యక్తి సీఎం జగన్. ప్రజల కోసం బయటకు రాని వ్యక్తి నేడు పార్టీ ప్లీనరీ కోసం బయటికి వచ్చారు. పథకాల పేరుతో మహిళలను మోసం చేశారు, మహిళలే సీఎం జగన్ అధికారం నుండి దింపేస్తారు. విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటుచేసిన జనవాణి జనసేన భరోసా కార్యక్రమానికి ఫిర్యాదులు, వినతిపత్రాలు వెల్లువెత్తుతున్నాయoటే వైయస్సార్సీపి ప్రభుత్వం వైఫల్యం చెందిందని, పాలన పడకేసిందని ప్రజా సమస్యలు పరిష్కరించడం లేదని ప్రజావాణి ద్వారా స్పష్టమైందని, ప్రజా సమస్యలపై పోరాడే గలిగిన ధైర్యం, సత్తువ కేవలం పవన్ కళ్యాణ్ గారికే ఉన్నాయని,3 సంవత్సరాల నుండి ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం 10 వ తేదీ ఆదివారం పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు విజయవాడ బందర్ రోడ్ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం లో జనవాణి కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. విజయవాడ నగర ప్రజలు, బాధితులు, ఉద్యోగస్తులు, కార్మికులు ,కర్షకులు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యమ సంఘాలు, ప్రజా సంఘాలు పవన్ కళ్యాణ్ గారికి నేరుగా వినతి పత్రం సమర్పించి వారి సమస్యలకు పరిష్కారం లభించేలా పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఉపశమనం కలిగించేలా పోరాడుతారన్నారు. విజయవాడ నగర ప్రజలు తప్పక వారి సమస్యల పరిష్కారం కోసం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.
ప్రజావాణి ద్వారా వందలకొద్ది ఫిర్యాదులు జనసేన పార్టీకి చేరుతున్నాయి అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పాలన చేతకావడం లేదని, ప్రజా సమస్యల పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని, అదే విధంగా మూడు సంవత్సరాల్లో ప్రజా సమస్యల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం బయటకి రానటువంటి సీఎం జగన్ నేడు ప్లీనరీ కోసం బయటకు వచ్చారన్నారు. వారికి ప్రజల కన్నా పార్టీ ముఖ్యమని, ఇవన్నీ ప్రజలు గ్రహిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఓటమి తప్పదని, అధికారం కోసం తల్లిని చెల్లిని మోసం చేసిన వ్యక్తి రాష్ట్రంలో మహిళలను కూడా అలాగే మోసం చేశారని పెన్షన్లు, రేషన్ కార్డులు, అమ్మ ఒడి పెళ్ళికానుక ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్య వంటి పథకాలకు అనేక నిబంధనలు చేర్చి ఆ పథకాలు మహిళలకు అందకుండా మోసం చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారిని, అటువంటి వ్యక్తిని అధికారం నుండి మహిళలే దూరం చేస్తారని, ప్లీనరీ వేదికగా సీఎం జగన్ గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదాపై ఏ విధంగా పోరాడుతారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.