Connect with us

Hi, what are you looking for?

Andhra News

స్మోకింగ్ కాళీ పోస్టర్ పై హిందు సంఘాలు సీరియస్ !

ప్రముఖ ఫిల్మ్ మేకర్ లీనా మణిమేకలై వివాదాల్లో చిక్కుకుంది. ఆమె ఇటీవ‌ల రూపొందించిన కాళీ అనే డాక్యుమెంట‌రీ కోసం కాళీమాత ఫోటోనూ అస‌భ్య‌క‌రంగా రూపొందించింది…

Share

రంగంలోకి ఇండియన్ హైకమిషన్! డీజీపీ గారు చర్యలు తీసుకోండి – బీజేపీ

ప్రముఖ ఫిల్మ్ మేకర్ లీనా మణిమేకలై వివాదాల్లో చిక్కుకుంది. ఆమె ఇటీవ‌ల రూపొందించిన కాళీ అనే డాక్యుమెంట‌రీ కోసం కాళీ మాత ఫోటోనూ అస‌భ్య‌క‌రంగా రూపొందించింది. దీంతో  హిందు సంఘాలు, నెట్టింట్లో ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది.  ప్రముఖ ఫిల్మ్ మేకర్ లేనా మణిమేకలై  రూపొందించిన డాక్యుమెంటరీ పోస్టర్ని చూసిన ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర స్థాయిలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. ట్విట్టర్లో #arrestleenamanimekalai అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేయడం ప్రారంభించారు.మహాంకాళి చేతిలో సిగరెట్.. అమ్మవారు పొగతాగుతున్న పోస్టర్ ఒకటి (స్మోకింగ్ కాళీ) కెనడాలో రిలీజ్ చేశారు. దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోంది. హిందూ దేవుళ్లను కించపరిచేలా ఇట్లాంటి పోస్టర్లు అంటించడం తగదని పలు సంఘాలు కంప్లెయింట్స్ చేశాయి. దీంతో కెనడాలోని భారత హైకమిషన్  చాలా సీరియస్ అయ్యింది. చిత్రనిర్మాత లీనా మణిమేకలై రిలీజ్ చేసిన ‘స్మోకింగ్ కాళి’ పోస్టర్‌పై కెనడా అధికారులు, ఈవెంట్ నిర్వాహకులు “అలాంటి రెచ్చగొట్టే అంశాలన్నింటినీ” ఉపసంహరించుకోవాలని కోరారు.

ఆగాఖాన్ మ్యూజియంలో ‘అండర్ ది టెంట్’ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రదర్శించిన చిత్రం పోస్టర్‌పై హిందూ దేవుళ్లను అగౌరవంగా చిత్రీకరించడంపై కెనడాలోని హిందూ సంఘాల నేతల నుంచి ఫిర్యాదులు అందాయని హైకమిషన్ తెలిపింది. టొరంటోలోని తమ కాన్సులేట్ జనరల్ ఈ ఆందోళనలను ఈవెంట్ నిర్వాహకులకు తెలియజేశారని తెలిపారు. అనేక హిందూ గ్రూపులు కెనడాలోని అధికారులను సంప్రదించి చర్య తీసుకోవాల్సిందిగా తమకు సమాచారం అందించాయని, కెనడా అధికారులు, ఈవెంట్ నిర్వాహకులు ఇట్లాంటి రెచ్చగొట్టే అంశాలన్నింటినీ తీసేయాలని కోరినట్టు తెలిపారు.

చిత్ర నిర్మాత లీనా మణిమేకలై ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వివాదం చెలరేగింది. పోస్టర్‌లో కాళీ దేవి వేషధారణలో ఉన్న మహిళను చిత్రీకరించారు. ఆమె ఫొటోలో సిగరెట్ తాగుతూ కనిపించింది. త్రిశూలం, కొడవలితో ఆమె సాధారణ అలంకారాలతో పాటు, దేవత పాత్ర పోషిస్తున్న నటుడు LGBTQ+ కమ్యూనిటీ యొక్క ప్రైడ్ జెండాను పట్టుకుని చూపించారు. ఆమె పోస్టర్‌ను షేర్ చేసిన వెంటనే లీనా మణిమేకలైకి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దీంతో సినిమాను ప్రారంభించిన ఆగాఖాన్ మ్యూజియంలో దాన్ని వెంటనే ఆపేయాలని కోరారు. అయితే.. చిత్ర నిర్మాత లీనా మణిమేకలై ఈ సినిమాని తప్పు పట్టే ముందు సినిమా చూడాలని ప్రజలను కోరారు.

Leena Manimekalai @LeenaManimekali
Super thrilled to share the launch of my recent film – today at
@AgaKhanMuseum
as part of its “Rhythms of Canada”
Link: https://torontomu.ca/cerc-migration/events/2022/07/under-the-tent-launch/

I made this performance doc as a cohort of https://torontomu.ca/cerc-migration/under-the-tent/

@YorkuAMPD
@TorontoMet
@YorkUFGS
Feeling pumped with my CREW❤️

మణిమేకలై పోస్టర్‌తో ఏం రాశారు ?

మణిమేకలై వివాదాస్ప‌ద పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ఇలా రాశారు. “రిథమ్ ఆఫ్ కెనడాలో భాగంగా నా ఇటీవలి చిత్రాన్ని ఆగాఖాన్ స్టేడియంలో ప్రారంభించడం పట్ల సంతోషిస్తున్నాను. నేను ఈ ప్రదర్శన డాక్యుమెంటరీని CERC ఇన్ మైగ్రేషన్ అండ్ ఇంటిగ్రేషన్ కో-హార్ట్ ఎక్సైటెడ్‌గా నా సిబ్బందితో రూపొందించాను.”అని రాసుకొచ్చారు.

సోషల్ మీడియాలో మూవీ మేక‌ర్ పై ఆగ్ర‌హం

ఈ పోస్టర్‌పై సోషల్ మీడియా వినియోగదారులు వ్యాఖ్యానిస్తూ.. “ప్రతిరోజూ హిందూ మతాన్ని ఎగతాళి చేస్తున్నారు. ప్రభుత్వం మా సహనాన్ని పరీక్షిస్తోందా” అని రాశారు. ఇంకో నెటిజ‌న్ హోం మంత్రి అమిత్ షా, హోం మంత్రిత్వ శాఖ, పిఎం కార్యాలయం, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌ను ట్యాగ్ చేసి.. “దయచేసి మతపరమైన మనోభావాలను దెబ్బతీసే వారిపై క‌ఠిన‌ చర్యలు తీసుకోవాలి” అని రాశారు.

ఒక నెటిజ‌న్ ఇలా వ్రాశారు. “సిగ్గుపడండి, కాళి మాత రూపాన్ని వివాదాస్ప‌దంగా రూపొందించినందుకు. ఈ దుశ్చర్యకు పాల్ప‌డిన వారిని తీవ్రంగా శిక్షించండి. ఈ దుశ్చర్యకు ఏ నాటికీ క్షమించబడదు. అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “ఇది మ‌త‌ విశ్వాసానికి అవమానం. దయచేసి శాంతిభద్రతలను కాపాడండి.  భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 295A ప్రకారం తగిన చర్య తీసుకోండి. ఈ హ్యాండిల్‌ను నిషేధించండి, లేకపోతే అది భారతదేశంలో అశాంతిని సృష్టిస్తుంది.”అని మ‌రో నెటిజ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. “సిగ్గులేకుండా దేవతను అవమానిస్తున్న ఈ సిగ్గులేని మహిళ.. కోట్లాది సనాతన మహిళలకు స్ఫూర్తి. మీరు ఆమె విగ్రహాన్ని అవమానిస్తున్నారు అని మండి ప‌డ్డారు.

లీనా మణిమేకలై ఎవరు?

లీనా మణిమేకలై ఓ చిత్రనిర్మాత, కవయిత్రి, నటి, ఆమె ఇప్పటి వరకు డజనుకు పైగా డాక్యుమెంటరీ లను రూపొందించింది. ఫిల్మ్ మేకర్ కాకముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆమె త‌న మొదటి డాక్యుమెంటరీని ‘మహాత్మా అనే పేరుతో  2003లో విడుద‌ల చేసింది. ఇందులో తమిళనాడులోని అరక్కోణం సమీపంలోని మగట్టుచేరి గ్రామంలోని అరుంధతియార్ కమ్యూనిటీలో ప్రబలంగా ఉన్న దేవతకు కుమార్తెలను అంకితం చేసే పద్ధతిని చిత్రించాడు. ఆమె తన డాక్యుమెంటరీల ద్వారా దళిత మహిళలపై హింస వంటి అంశాలను కూడా హైలైట్ చేసింది.

తాజాగా ఈ పోస్టర్‌పై సినీ నటి కుష్బు ఫైర్ అయ్యారు. ‘క్రియేటివిటీ పేరుతో ఏదైనా చేయొచ్చని అనుకోకూడదు. స్వేచ్ఛ అంటే ఏదైనా చేయడానికి అనుమతి కాదు. ఈ క్రియేటర్స్‌కు ధైర్యం ఉంటే మైనారిటీ దేవుళ్ల గురించి ఇలాంటి పోస్టర్లను చిత్రీకరిస్తారా..? అలా చేస్తే అల్లకల్లోలం అవుతుంది. ఈ పోస్టర్‌ను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది అశాంతి కలిగించే ప్రయత్నం..’ అంటూ ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

KhushbuSundar @khushsundar
Creativity should not be taken for granted. I am sure the same creators will never have the guts to take creative liberty depicting any minority worshipped God in this form. There will be a mayhem. I strongly condemn this piece of so called art. It’s an attempt to cause unrest.

డీజీపీ గారు చర్యలు తీసుకోండి- బీజేపీ

ఈ మధ్య కాలంలో కొంతమంది పనిగట్టుకుని హిందూ దేవీదేవతలను అవమాన పరిచే రీతిలో వివిధ రకాల కార్యకలాపాలను సాగిస్తున్నారు వారిపై చ‌ర్యులు తీసుకోవాల‌ని బీజేపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.. ఇన్ని రకాలుగా హిందూ దేవుళ్ళను అవమానిస్తూ,కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా డైరెక్టర్ లీనా మణిమేకలై  డాక్యుమెంటరీకి సంబంధించి విడుదల చేసిన చిత్రం హిందూ సమాజంలో తీవ్రమైన అశాంతిని రేకెత్తిస్తోంది. రాష్ట్రంలో కొంతమంది కావాలని సామాజిక  మాధ్యమాల్లో విస్తృతంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వీరిపై డీజీపీ గారు సుమోటోగా కేసులు నమోదు చేసి ,ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది .

Share
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  (To Type in English, deselect the checkbox. Read more here)

You May Also Like

Alluri Seetharama Raju

Daftar Situs Slot Bonus New Member  100% 200% TO Kecil 3x 5x 7x 8x 10x 15x Tanpa Potongan Mudah Jackpot Besar Tahun 2023 Bonus...

Uncategorized

Buy modafinil 200mg, modafinil israel – Buy legal anabolic steroids                            ...

Uncategorized

Üsküdar Tıkanıklık Açma Üsküdar tıkanıklık açma firmamız tıkalı pimaş borularında ortaya çıkan yabancı maddeler yüzünden oluşan tıkanmaları kırmadan tıkanıklık açıcı servisi ile çözüme kavuşturmaktadır....

Uncategorized

Su Kaçak Tespiti Nasıl Yapılır Beşiktaş su kaçak tespiti Beşiktaş su kaçak tespiti yapan Uzman, kalorifer borularında meydana gelen su kaçaklarını iki farklı yöntemle...

Lingual Support by India Fascinates