ప్రజా శాంతి పార్టీ పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ యాత్రకు ముహూర్తం ఖరారు అయింది. పాల్ రావాలి -పాలనా మారాలి పేరుతో యాత్ర ప్రారంభం కానుంది. ఈ నెల 9 నుండి పాల్ విశాఖపట్నం జిల్లా నుండి తన యాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్రలో ఆయన ప్రధానంగా అధికార వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు, ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి శున్యం, ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేని రాష్టం గా మారడానికి జగన్ మోహన్ రెడ్డి ఉచిత హామీలు, వైసీపీ, తెలంగాణ రాష్ట్ర సమితిలు కుమ్మక్కయ్యాయని, ఇలా పలు అంశాలు పై ప్రజలకు తన యాత్ర లో చెప్పనున్నారని సమాచారం. 8 వ తేదీ సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. హోటల్ లో బస చేయనున్నారు. 9 వ తేదీ మధ్యాహ్నం బస చేసిన హోటల్ నుంచి భారీ వాహనాలు తో స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తరువాత విశాఖ పట్నం లోని ప్రజా శాంతి కార్యాలయంలో క్రియశీలక నాయకుల కు,సభ్యులకు,కార్యకర్తలు, ప్రజాశాంతి నాయకులకు పార్టీ కి సంబంధించిన కార్యకలాపాలు పై దిశనిర్దేశం చేయనున్నారు.. అనంతరం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పాల్ రావాలి – పాలనా మారాలి తన యాత్రను ప్రారంభిస్తారు.
పాల్ యాత్ర కోసం అన్ని జిల్లాల నేతలు భారీ కసరత్తు చేస్తున్నారు. యాత్ర పైన, విభజన అంశం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం పై, వైసీపీ అరాచకాలు పై ఆయా జిల్లాల నేతలతో పాల్ తన పర్యటన లో అక్కడ స్థానిక నేతలతో వేర్వేరుగా సమావేశం కానున్నారు.. ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ జిల్లాల పర్యటన లో భాగంగా వైసీపీ , టీడీపీ, బీజేపీలో కొందరు అసంతృప్తి నాయకులు ను ఆయా పార్టీ ల నుంచి భారీ చేరికలకు ప్రజా శాంతి స్థానిక నేతలు దృష్టి పెట్టనున్నారు. ఇటివల సిరిసిల్ల పర్యటన లో పాల్ పై దాడి జరిగిన తరువాత పాల్ తన కార్యకలాపాలు అని హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలయం నుంచి చేశారు… తాజాగా మళ్ళీ తన యాత్ర మొదలు పెట్టడం తో రెండు తెలుగు రాష్ట్రలలో తీవ్ర చర్చ జరుగుతుంది.. ఇప్పుడు ఉత్తర ఆంధ్ర మొదలు కొని కోస్తా, రాయలసీమ లోని అన్ని జిల్లాల పర్యటన చేస్తుండటం తో పాల్ తన బలాన్ని నిరూపించుకోనున్నారు. సీమాంధ్రలో తన యాత్రను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో టీఆర్ ఎస్, వైసీపీ తెలుగుదేశం ఫెయిల్యూర్ ఇతర ముఖ్యమైన అంశాలతో పాటు విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలం ఇలా చాలా విషయల పై పాల్ ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది.