Connect with us

Hi, what are you looking for?

Andhra News

కంటిచూపు సమస్య !! ఈ ఆహారం తినండి

మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కళ్లు కూడా ఒకటి. కళ్లు లేనిదే ప్రపంచాన్ని చూడలేం. ఐతే ఈ కాలంలో చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. మానవదేహంలోని అవయవాల్లో కళ్లు అత్యంత కీలకమైనవి…

Share

మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కళ్లు కూడా ఒకటి. కళ్లు లేనిదే ప్రపంచాన్ని చూడలేం. ఐతే ఈ కాలంలో చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. మానవదేహంలోని అవయవాల్లో కళ్లు అత్యంత కీలకమైనవి. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా కంటి చూపు తగ్గుతోందంటూ ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. 50 ఏళ్లలోపు వారు కూడా పాక్షిక అంధుల్లా మారుతున్నారు. కంటిచూపు తగ్గడానికి వివిధ కారణాలతో పాటు రెండు కీలక విటమిన్ల లోపం కూడా కారణం అయ్యుండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మానవదేహంలోని వ్యవస్థలు సజావుగా పనిచేయాలంటే విటమిన్లు, ఖనిజలవణాలు, సూక్ష్మపోషకాలు ఎంతో అవసరం. మొత్తం 13 విటమిన్లు శారీరక ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ బీ 12 లోపిస్తే కంటిచూపు మందగిస్తుందట. ఈ రెండు విటమిన్ల లోపం కళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు పేర్కొన్నారు. విటమిన్ ఏ లోపం వల్ల కంటిలోని కార్నియా ఎండిపోయినట్టుగా మారుతుందని, దాంతో రెటీనా కూడా దెబ్బతింటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. తద్వారా అంధత్వం కలుగుతుందని వివరించింది. ప్రతి ఏటా 2.5 లక్షల నుంచి 5 లక్షల మంది వరకు చిన్నారులు విటమిన్ ఏ లోపంతో అంధత్వం బారినపడుతున్నారని తెలిపింది. వారిలో సగం మంది ఏడాదిలోపే మృత్యువాత పడుతున్నారని కూడా డబ్ల్యూహెచ్ఓ వాస్తవాలు వెల్లడించింది.

విటమిన్ బీ12 కూడా చూపు కోల్పోవడానికి కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. మెదడు, నాడీ కణాల అభివృద్ధిలో విటమిన్ బీ12దే కీలకపాత్ర. ఈ విటమిన్ లోపించడం వల్ల ఆప్టిక్ న్యూరోపతీ (కంటి నరాల వాపు-నాడీ కణజాలం దెబ్బతినడం) సంభవిస్తుందట. ఇది తాత్కాలికంగా కంటి చూపును కోల్పోయేలా చేస్తుందని, దీర్ఘకాలంలో మాత్రం నష్టం తీవ్రంగా ఉంటుందని ఆప్టోమెట్రీ అసోసియేషన్ పేర్కొంది. అందుకే, కంటిచూపు తగ్గినవారు విటమిన్ బీ12 లోపించిందేమోనని పరీక్ష చేయించుకోవాలని సూచిస్తోంది. ఈ రెండు విటమిన్ల లోపం నుంచి తగిన ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మనల్ని మనం కాపాడుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గుడ్లు, కొవ్వుతో ఉన్న చేపలు, జున్ను, పాలు, పెరుగు, కాలేయం వంటివి ఆహారంలో చేర్చుకుంటే విటమిన్ ఏ లోపం నుంచి బయటపడొచ్చని వివరిస్తున్నారు. ఇక, బీ12 విటమిన్ ప్రధానంగా గొడ్డు మాంసం, పంది మాంసం, కోడిమాంసం, గుడ్లు, మటన్, టూనా, హాడాక్ వంటి చేపల్లోనూ, నత్తలు, పీతల వంటి సముద్ర జీవుల్లోనూ, పాలు, పాల ఉత్పత్తుల్లోనూ సమృద్ధిగా ఉంటుందట.

కళ్లను ఆరోగ్యంగా ఉంచే ఆహార పదార్థాలు ఏవో తెలుసా ?

పాలకూరలో విటమిన్లు ఎ, సి, కె, మెగ్నిషియం, మాంగనీస్, ఐరన్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కంటి చూపు మెరుగు పడుతుంది. రోజూ పాలకూరు జ్యూస్ను తాగుతున్నా కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. మెదడుతో పాటు కళ్లకు కూడా బాదం ప‌ప్పులు ఎంత‌గానో మేలు చేస్తాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు వీటిలో ఉంటాయి. విటమిన్ ఇ కూడా ఉంటుంది. ఇది కళ్లకి చాలా ముఖ్యం. రోజూ 8-10 ఎండుద్రాక్షలను లేదా 4 నుండి 5 బాదంపప్పులను నీటిలో నానబెట్టి ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో తినాలి. ఇవి కళ్లకు ర‌క్ష‌ణ‌ను అందిస్తాయి. కంటి చూపును మెరుగు ప‌రుస్తాయి. రోజ్ వాటర్ లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కండ్లకలక లేదా పింక్ ఐ, వాపు నుండి బయటపడటానికి సహాయపడతాయి. రోజ్ వాటర్‌లో శుభ్రమైన పత్తిని ముంచి మూసిన కనురెప్పలపై మెత్తగా రుద్దవచ్చు. దీంతో క‌ళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. తేనె మ‌న‌ శరీరానికి అద్భుత‌మైన ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. కంటి చూపును మెరుగుపరచడానికి, కంటి శ్రేయస్సు కోసం ఒక టీస్పూన్ తేనెతో తాజా ఉసిరి కాయ జ్యూస్‌ను రోజూ తీసుకోవాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే దీనిని తీసుకోవాలి. ఇది కంటికి మేలు చేస్తుంది. తాజా ఉసిరి లభించకపోతే ఉసిరిక‌ పొడిని కూడా ఉపయోగించవచ్చు.

Share
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  (To Type in English, deselect the checkbox. Read more here)

You May Also Like

Alluri Seetharama Raju

Daftar Situs Slot Bonus New Member  100% 200% TO Kecil 3x 5x 7x 8x 10x 15x Tanpa Potongan Mudah Jackpot Besar Tahun 2023 Bonus...

Uncategorized

Buy modafinil 200mg, modafinil israel – Buy legal anabolic steroids                            ...

Uncategorized

Üsküdar Tıkanıklık Açma Üsküdar tıkanıklık açma firmamız tıkalı pimaş borularında ortaya çıkan yabancı maddeler yüzünden oluşan tıkanmaları kırmadan tıkanıklık açıcı servisi ile çözüme kavuşturmaktadır....

Uncategorized

Beşiktaş su kaçak tespiti Beşiktaş’ta Su Kaçağı Tespiti ve Onarımı Kameralı Su Kaçağı Tespiti ve Onarımı Beşiktaş’ta su kaçağı tespiti ve onarımı firmamız tarafından...

Lingual Support by India Fascinates