అమ్మ రాజశేఖర్ ఫేమస్ డాన్స్ కొరియోగ్రాఫర్. ఏమయ్యిందో ఏమో కానీ హీరో నితిన్ మీద ఆయన మండిపడ్డాడు. ఐతే అమ్మ రాజశేఖర్ “హై 5 ” అనే మూవీకి డైరెక్షన్ చేశారు. ఈ మూవీకి సంబంధించిన వేడుకకు నితిన్ రాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మూవీ ఈవెంట్ కోసం అమ్మ రాజశేఖర్ తానె స్వయంగా నితిన్ ని గెస్ట్ గా ఇన్వైట్ చేశారు. కానీ నితిన్ రాకపోయేసరికి అమ్మ రాజశేఖర్ నితిన్ ని ఉద్దేశించి ఎంతో ఆవేశంగా మాట్లాడారు. ఈ సందర్భంగా అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ “ఒకానొక టైములో నితిన్ కి అసలు ఎలా డాన్స్ చేయాలి అనేది కూడా తెలియదు. కానీ మొదటి నుంచి నేను నేర్పించాను. నన్ను గురువుగా భావించి గౌరవిస్తాడనుకున్నాను కానీ ఇవాళ ఈవెంట్ కి పిలిచినా రాలేదు,” అని అన్నారు. “హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాక నితిన్ ఇవాళ నన్ను అవమానించాడు. తనకి ప్రస్తుతం షూటింగ్స్ కూడా ఏమీ లేవు. కేవలం ఇంట్లో కూర్చున్నాడు. నీ గురువుని నువ్వు మర్చిపోతే నువ్వు ఎప్పటికీ సూపర్ స్టార్ వి కాలేవు అన్నారు అమ్మ రాజశేఖర్. పది రోజుల క్రితమే నితిన్‌ను ఈ ప్రోగ్రామ్‌కు రావాలని పిలిచాను. ఆయన వస్తానని మాట కూడా ఇచ్చారు. నేను ఆయన మాట నమ్మి “అన్నం కూడా తినకుండా కష్టపడి నితిన్ కోసం ప్రత్యేకంగా ఏవీ కూడా క్రియేట్ చేయించా. నితిన్‌కు అసలు డ్యాన్సే రాదు. ఆయనకు డ్యాన్స్ నేర్పించి, ఓ గుర్తింపు వచ్చేలా చేసిన గురువులాంటి నాపై గౌరవంతో వస్తారని భావించా. కానీ, ఆయన ఇంట్లో ఉండి కూడా ఇక్కడికి రాలేదు. ఫోన్ చేస్తే జ్వరమని చెప్పాడు. దానికి నేను వీడియో బైట్ అయినా పంపమని కోరాను. అది కూడా ఇవ్వలేదు.”
టెక్నీషియన్ విత్తనాలైతే, ఆర్టిస్టులు ఫలాలు లాంటి వాళ్ళు. విత్తనాలే వృక్షాలై మంచి ఫలాలను ఇస్తాయి. నువ్వు నాకు ఒక అబద్ధపు ప్రమాణం చేశావు. “ఒరేయ్ నితిన్ నీ విషయంలో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. నిన్ను నేను నమ్మాను. లైఫ్ లో నిన్ను ఎప్పుడైనా కలిస్తే మళ్ళీ అప్పుడు చూద్దాం,” అని నితిన్ పై మండిపడ్డారు. అయితే మరోవైపు సినిమా ట్రైలర్ చూసిన నితిన్ అభిమానులు మాత్రం నువ్వేమన్నా నితిన్ పెద్ద హిట్ ఇచ్చావా ఓ డిజాస్టర్ సినిమా టక్కరి చేసావు అంటున్నారు. అలాగే “హై 5” అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న సినిమా కాబట్టే నితిన్ అలాంటి సినిమాని ప్రమోట్ చేయడం ఇష్టం లేక వేడుకకి రాలేదని చెబుతున్నారు.
#HiFive Pre-release Event : Strange happening last night. Director-Choreographer, ‘Ranam’ fame Amma Rajasekhar fired on his ‘Takkari’ Movie Actor Nithiin for not showing up! pic.twitter.com/2KfjRgLAUQ
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) July 11, 2022