భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ ప్రజల్లోకి వస్తున్నారని, దేశంలో గాంధీ వారసులుగా శాంతియుతంగా పోరాటం చేస్తామని ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ తెలిపారు. ప్రధాని మోదీ పాలన బ్రిటిష్ వారి పాలనను గుర్తుకు తెస్తోందన్నారు. దేశ సంపదను ఆదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారు. మోదీ, అమిత్ షా అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు అన్నారు. వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతులను కార్పోరేట్ సంస్థలకు అమ్మాలని చూశారన్నారు. దేశ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రధాని క్షమాపణలు చెప్పి ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులతో అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఆర్మీని కూడా తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. అగ్నిపథ్ పేరుతో యువత ఆశలను చిదిమేస్తున్నారు. 12 కేసులు ఉన్న జగన్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని విర్రవీగుతున్నారు. ఎటువంటి ఎఫ్.ఐ. ఆర్ లేని నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ కుటుంబాన్ని వేధించడం తగదన్నారు. అక్రమ కేసులకు కాంగ్రెస్ భయపడదు అని సృష్టం చేశారు.