ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశించాలని కానీ.. చంద్రబాబుపై పోటీ చేయాలని తనకు ఎటువంటి ఆలోచనా లేదని సినీ హీరో విశాల్ ట్వీట్‌లో వేదికగా విశాల్ పేర్కొన్నాడు. సినీ హీరో విశాల్ సంచలన ప్రకటన చేశారు. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచి తాను పోటీ చేస్తున్నట్టు వస్తున్న వార్తలను విశాల్ కొట్టిపారేశాడు. ఇటువంటి ప్రచారాలను నమ్మవద్దని కోరాడు. అసలు పోటీ విషయమే తనకు తెలియదని, ఎవరూ తనని సంప్రదించలేదని ట్విటర్(Twitter) వేదికగా విశాల్ ప్రకటించాడు. ఈ వార్తలు ఎలా వచ్చాయో తనకు అర్ధం కావడం లేదని పేర్కొన్నారు. తాను సినిమాలు చేసుకుంటున్నానని చెప్పారు.
హీరో విశాల్‌ను కుప్పం బరిలోకి దించాలని వైసీపీ యోచిస్తున్నట్టు ఇటీవల జోరుగానే ప్రచారం జరిగింది. ఆయనను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై పోటీగా నిలిపేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు సాగించినట్టు వార్తలొచ్చాయి. తెలుగు కుటుంబానికి చెందిన విశాల్ తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు ప్రేక్షకులకూ ఆయన పరిచయమే. ఆయన తండ్రి జీకే రెడ్డి సినీ నిర్మాత, పారిశ్రామిక వేత్త. కుప్పం ప్రాంతంలో ఆయనకు గ్రానైట్ గనులు, పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. ఇలా కుప్పం ప్రాంతంతో విశాల్ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని… ఆయనను చంద్రబాబుపై పోటీకి నిలపాలని వైసీపీ యోచిస్తోందంటూ వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై నేడు విశాల్ ప్రకటించారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో రాబోయే ఎన్నికలకు వైసీపీ ఇప్పటి నుంచే వ్యూహం రచిస్తోంది. ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చేందుకు వైసీపీ నాయకులు సన్నహాలు ప్రారంభించేశారని ప్రచారం జరుగుతోంది. కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు ప్రణాళికలు చేస్తుంది. ఈసారి చంద్రబాబుకి ప్రత్యర్థిగా సినీనటుడు, తమిళస్టార్ విశాల్ కృష్ణ డిసైడ్ అయ్యారని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం సాగుతుంది. విశాల్ కృష్ణకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, వివిధ రాష్ట్రాల్లో స్థిరపడిన తెలుగు వారి నుంచి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక విశాల్‌కృష్ణ తమిళనాడులో స్థిర పడినప్పటికీ ఆంధ్ర రాజకీయ నాయకులతో అత్యంత సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారని తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో వైసీపీ తన వ్యూహాన్ని మార్చుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంతే కాకుండా వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డికి తాను వీరాభిమానిని అంటూ అనేక సందర్భాల్లో విశాల్‌కృష్ణ చెప్పారు. తమిళ నటుడు అయినప్పటికీ వైసీపీ నాయకుల్లో ఆయనకు బంధువర్గం ఉందని వైసీపీ నేతలు అంటున్నారు.
ఇటీవల స్థానిక ఎన్నికల్లో వైసీపీ తన సత్తా చాటింది. మరోవైపు చిత్తూరు జిల్లా మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో నారా చంద్రబాబును ఓడిస్తామని గట్టిగానే సవాల్ విసురుతున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే కుప్పం స్థానికుడు అయ్యేందుకు ఓ ఇంటిని సైతం నిర్మిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ తరపున చంద్రబాబు ఢీకొనే అభ్యర్థి విషయంలో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ముందు నుంచీ పార్టీ కోసం కష్టపడిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. మరో వైపు తాజాగా సినీ నటుడు విశాల్ కృష్ణ పేరు కూడా వినిపిస్తుంది. ఎటువంటి రాజకీయ అనుభవం లేని విశాల్‌కృష్ణ అవసరం లేదని, తామే చాలని కొందరు వైసీపీ నాయకులు చర్చించుకుంటున్నారని సమాచారం. ఇందంతా ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకూ దీనిపై విశాల్ ట్వీట్‌లో వేదికగా విశాల్ కొట్టిపారేశాడు. ఇటువంటి ప్రచారాలను నమ్మవద్దని కోరడం జరిగింది…