ఎండు కొబ్బరికాయలకు కనీస ధర రాక కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కొబ్బరి రైతులకు ఆదుకోవాలంటూ కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎండు కొబ్బరి కాయలకు ధర తగ్గించి వేయడంతో కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. గత ఏడాది ఎండు కొబ్బరి కాయకు రూ 15 లకు పైగా ధర వస్తే ప్రస్తుతం ఆ ధరను రూ.5 లకు తగ్గించి వేయడం దారుణమన్నారు. ధర రాక రైతులు నష్ట పోతుంటే ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. కొబ్బరి ఎకరాకు కౌలు తో కలుపుకొని రూ.90వేలు ఖర్చవుతున్నదని చెప్పారు. ఎకరాకు సంవత్సర కాలంలో 8 వేల కొబ్బరికాయలు దిగుబడి వస్తున్నదన్నారు. ఎకరాకు ఆదాయం రూ.40 వేలకు మించి రావడం లేదన్నారు. ఫలితంగా రైతులు నష్టపోతున్నారని చెప్పారు. ఈ పరిస్థితులలో నాఫెడ్ కొనుగోలు సంస్థ ద్వారా ఎండు కొబ్బరి కాయలు కొనుగోలు చేసి కాయకు కనీస ధర రూ 15 లు ఇచ్చి కొబ్బరి రైతులు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
కొబ్బరి రైతులను ఆదుకోవాలి
అమలాపురం కోనసీమ అంటేనే ప్రకృతి రమణీయతకు నెలవు. ఒక వైపు పచ్చని వరి పొలాలు మరోవైపు కొబ్బరి చెట్లతో కోనసీమ మరో కేరళను తలపిస్తూ ఉంటుంది. అదే కోనసీమ కొబ్బరి రైతాంగం ఇప్పుడు సంక్షోభంలో కూరుకుపోయింది. కొబ్బరి ధర పూర్తిగా పతనం కావడం కొనసీమ నుండి కొబ్బరి ఎగుమతులు తగ్గిపోవడంతో మరోసారి వార్తల్లోకెక్కింది. దేశంలో తమిళనాడు కేరళ తర్వాత అధిక కొబ్బరి ఉత్పత్తి స్థానం మన కోనసీమదే. కోనసీమ నుంచి కొబ్బరికాయలు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. అటువంటి కొబ్బరి పరిశ్రమ నేడు సంక్షోభంలోకి కూరుకుపోయింది.
కోనసీమ జిల్లాలో సుమారు లక్షా 30వేల ఎకరాల్లో కొబ్బరి పంట సాగవుతోంది. ఈ కొబ్బరి పంటపై ఆధారపడి అనేక మంది రైతులు, రైతుకూలీలు, కార్మికులు బతుకుతున్నారు. కోనసీమ జిల్లాలో వందల కుటుంబాలకు కొబ్బరి పనే వారి జీవనాధారం. ప్రస్తుతం కొబ్బరి పనులు లేక వీరందరూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. కోనసీమ ప్రాంతంలో రైతులకు కూలీలకు కొబ్బరి పంట ప్రధాన జీవనాధారం. కొబ్బరికాయ చెట్టు మీద నుంచి కిందకు దింపిన నాటి నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమయ్యే వరకూ అనేక మందికి ఉపాధి దొరుకుతుంది. కొబ్బరి చెట్టుకు తెల్ల పురుగు వ్యాధి సోకడంతో పాటు 1996లో వచ్చిన తుపానుతో కొబ్బరి చెట్లకు సోకిన నల్లివ్యాధితో నేటికీ కొబ్బరి చెట్లు కోలుకోలేదు. నల్లి వ్యాధితో కొబ్బరి కాయ సైజు గణనీయంగా తగ్గిపోయింది. దీని వల్ల కొబ్బరికాయ దిగుబడి తగ్గిపోయింది. ఆరుగాలం కష్టించి పండించిన రైతులకు గిట్టుబాటు కాకపోవడంతో లబోదిబోమంటున్నారు.
దేశంలో కొబ్బరి ఎగుమతుల్లో కోనసీమ రెండో స్థానంలో ఉంది. కోనసీమ నుంచి నిత్యం ఇతర రాష్ట్రాలకు కొబ్బరి ఏగుమతులు జరుగుతూ ఉంటాయి. కొంతకాలంగా కొబ్బరికాయ రేటు వెయ్యి కాయలు రూ.12,000 ఉండేది. ఇప్పుడు రూ.7 వేల పడిపోయింది. అంతేకాక రోజుకు కోనసీమ నుంచి సుమారు 50 లారీలు సరుకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేది. తద్వారా వేల మందికి ఇక్కడ ఉపాధి దొరికేది. ఇప్పుడు 10 నుండి 15 లారీలు కూడా ఎగుమతి అవ్వని పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఒకవైపు రవాణా ఖర్చులు పెరిగి పోవడం డీజిల్ ధరలు పెరిగిపోవడంతో మరోవైపు కొబ్బరి దిగుబడి తగ్గి సైజు తగ్గిపోవడం అంటున్నారు.
కొబ్బరి ధర లేక మరోవైపు ఎగుమతులు కూడా లేకపోవడంతో కోనసీమ కొబ్బరి రైతులు అల్లాడుతున్నారు. మరో వైపు రైతుల పరిస్థితి ఇలా ఉంటే కొబ్బరిపైన ఆధారపడి జీవించే రైతు కూలీల పరిస్థితి దయనీయంగా తయారైంది.ప్రభుత్వం చొరవ తీసుకుని కొబ్బరి రైతులను, దాని మీద ఆధారపడి జీవించే కూలీలను ఆదుకోవాలని కోరుకుంటున్నారు.
కార్మికుల పై తీవ్ర ప్రభావం
కొబ్బరి రేటు తగ్గిపోవడంతో పాటు ఎగుమతులు నిలిచిపోవడం వల్ల రైతుతో పాటు కూలీలపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కొబ్బరి దింపు కార్మికుడు, కొబ్బరి ఒలుపు కార్మికుడు, కొబ్బరి నాడెం కార్మికుడు లారీకి కొబ్బరికాయలు ఎగుమతి చేసే కార్మికులకు ఇలా అనేక రకాలుగా కూలీలకు ఉపాధి దొరుకుతుంది. ఈ పనినే నమ్ముకుని తరతరాలుగా కోనసీమలో కూలీలు జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు ఎగుమతులు నిలిచిపోవడంతో దిక్కుతోచని స్థితిలో కూలీలు ఉన్నారు.
ప్రభుత్వం కొబ్బరి రైతులను ఆదుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం తరహాలో కొబ్బరి కూడా మద్దతు ధర ప్రకటించాలని రైతులు కోరుకుంటున్నారు. నాఫెడ్ కేంద్రాలు కోనసీమ జిల్లాలో పూర్తిస్థాయిలో ప్రారంభించి కొబ్బరి కొనుగోలు చేయాలని వారు కోరుతున్నారు. కొబ్బరి పంటనాశించే తెల్ల దోమ నల్లి వ్యాధులను అరికట్టి కొబ్బరి సైజు పెరిగి నాణ్యత దిగుబడి వచ్చేలా చర్యలు చేపట్టాలని వారు కోరుకుంటున్నారు.
జూలై 1 నుంచి 5 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు
మార్క్‌ట్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో కోనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది… నాపేడ్, అయిల్ ఫేడ్ ల సంయుక్త అధ్వర్యంలో జూలై 1 నుంచి ఆరు నెలల పాటు 4, 250 టన్నుల కొబ్బరి కొనుగోలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాల్ని ఇంటింటికీ చేరవేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయాల్లో దాదాపు 1.37 లక్షల ఉద్యోగుల్ని నియమించారు. అయితే రెండేళ్ల పాటు ప్రొబేషన్ కింద పనిచేయాలని ఆ తర్వాత శాఖాపరమైన పరీక్షలు రాసి ఉత్తీర్ణులు అయితే ప్రొబేషన్ ఖరారు చేసి రెగ్యులర్ ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం అప్పట్లో నిబంధన విధించింది. ప్రొబేషన్ కాలంలో నెలకు 15 వేల చొప్పున ఇస్తామని ఉద్యోగం ఖరారైన తర్వాత రెగ్యులర్ వేతనాలు ఉంటాయని హామీ ఇచ్చింది. దీని ప్రకారం ఉద్యోగులు గతేడాది అక్టోబర్ 2కి వారి ప్రొబేషన్ కాలం పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత నిర్వహించిన శాఖాపరీక్షల్లోనూ దాదాపు 80 వేల మందికి పైగా ఉత్తీర్ణులయ్యారు. వీరందరికీ ఇంకా ప్రొబేషన్ ఇవ్వలేదు. మరికొన్ని వేల మందికి అస్సలు డిపార్టుమెంట్ పరీక్షలే నిర్వహించలేదు.