కోనసీమలో వరదల ఉద్ధృతికి లంక ప్రాంతాలన్నీ తీవ్ర ఇబ్బందులకు గురై అయ్యాయి. ఆ పరిస్థితిని, ప్రజలకు అందుతున్న సహాయాన్ని స్వయంగా పరిశీలించేందుకు కోనసీమ వెళ్ళారు ముఖ్యమంత్రి సీఎం జగన్. సరిగ్గా ఆ సమయంలో ఓ నిరుపేద దంపతులు నిస్సహాయ స్థితిలో తమ పాప దీనస్థితిపై ప్లకార్డు పట్టుకొని నిల్చున్నారు. వెళ్తున్న కాన్వాయ్ ఆగింది,ముఖ్యమంత్రి నుంచి పిలుపు వచ్చింది. ఆ క్షణంలోనే జిల్లా కలెక్టర్ ను పిలిచి ఏదో చెప్పారు. కట్ చేస్తే ఆ తల్లిదండ్రులకు ఊహించని కబురు వచ్చింది.
హనీ వైద్యానికి రూ.1కోటి మంజూరు. ఖరీదైన ఇంజక్షన్ల పంపిణీ. అరుదైన “గాకర్స్’’బారినపడ్డ చిన్నారి పరిస్థితిపై చలించిన సీఎం. కోనసీమ వరదప్రాంతాల పర్యటనలో ప్లకార్డు ప్రదర్శించిన చిన్నారి తల్లిదండ్రులు. కాన్వాయన్ ఆపి మాట్లాడిన సీఎం. చిన్నారి బాధ్యతను తీసుకుంటానని ఆరోజు హామీ ఇచ్చిన సీఎం.డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కారామేశ్వరానికి చెందిన కొప్పాడి రాంబాబు నాగలక్ష్మి దంపతుల రెండున్నర సంవత్సరాల చిన్నారి హనీ అరుదైన గాకర్స్ వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధికి చికిత్స చెయ్యించేందుకు ఆ కుటుంబానికి అంత ఆర్థిక స్థోమతలేదు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రూ. కోటి బడ్జెట్ కేటాయించారని కలెక్టర్ తెలిపారు. చిన్నారి హనీకు పుట్టుకతో ఈ వ్యాధి వచ్చిందని ఈ వ్యాధిమూలంగా లివర్ పనిచేయదని జిల్లా కలెక్టర్ హిమాన్ష్ శుక్లా తెలిపారు.
ఆ ఇంజెక్షన్ ఖరీదు రూ 1,25,000 రాయితీతో రూ.74,000 లకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఉచితంగా బాధితులకు అందిస్తుంది. ఈ ఇంజెక్షన్ అమెరికాలో తయారవుతుందని ఇప్పటివరకు రూ 10,08,000 విలువచేసే ఇంజెక్షన్లను ప్రభుత్వం ద్వారా ఉచితంగా సరఫరా చేశారని కలెక్టర్ తెలిపారు. ఈ ఇంజెక్షన్ 15 రోజులకు ఒకసారి రెగ్యులర్ గా పాపకి ఇవ్వాలని సూచించారు. పాప భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి స్పందించి ఉదారంగా సహకారం అందించారన్నారు. పాప భవిష్యత్తుకు కూడా ప్రణాళికను చేశామని కలెక్టర్ తెలిపారు. పింఛన్ ఇచ్చేందుకు కూడా చర్యలు చేపట్టామన్నారు. దేశంలో ఈ వ్యాధి చాలా అరుదుగా సంక్రమిస్తుందని, దేశవ్యాప్తంగా ఇటువంటి వ్యాధితో బాధపడుతున్న వారు 14 మంది ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.