కుప్పం తెదేపా కార్యాలయంలో గురువారం సాయంత్రం ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు.’తెదేపా కోసం పని చేసేవారికే అధిక ప్రాధాన్యం ఇస్తాం. లేకుంటే పక్కన పెడతా. ఇదే చివరి అవకాశం. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనండి. నిర్లక్ష్యం వహిస్తే పూర్తిగా తొలగిస్తా’ అంటూ కార్యకర్తలను హెచ్చరించినట్లు తెలిసింది.
కుప్పం ఇన్‌ఛార్జి పీఎస్ మునిరత్నం, పీఏ మనోహర్, నాలుగు మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకు ముందు TDP-NTR ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌లో అన్నదాన కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించి, స్వయంగా భోజనం వడ్డించారు. ఆధునికీకరించిన పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని పునఃప్రారంభించారు.‘టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేయాలి. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని గ్రామాల్లో చురుగ్గా చేపట్టాలి. కొంతమంది సభ్యత్వ నమోదులో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆ ధోరణి విడనాడాలి. పని చేసేవారికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. వైకాపా ప్రభుత్వ పనితీరుపై ప్రజలు తీవ్ర అసహనంగా ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియపరుస్తూ ఎండగడుతూ పోరాడాలి. సాంకేతికతను ఉపయోగించుకొని ఉపాధి సాధనపై పట్టు సాధించాలి’ అని పేర్కొన్నారు.
ఈ కార్య్రమానికి ముందు అధికార వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడిన పార్టీ కార్యకర్తలను ఆస్పత్రిలో చంద్రబాబు పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు.రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందనీ, తప్పుడు పనులు చేసిన వారికి శిక్ష తప్పదని ఈ సందర్భంగా చంద్రబాబు హెచ్చరించారు.
వైసీపీ రౌడీ మూకల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించిన చంద్రబాబు నాయుడు గారు, అధైర్య పడవద్దనీ, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది అనీ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. (1/2) pic.twitter.com/7CSZNH7xzl
— Telugu Desam Party (@JaiTDP) August 26, 2022






