రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరి చందన్ తో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి పవార్ బేటీ అయ్యారు. రాజ్ భవన్ కు వచ్చిన మంత్రికి రాజ్ భవన్ ఉప కార్యదర్శి డాక్టర్ సన్యాసి రావు స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ లో పర్యటనలో ఉన్న డాక్టర్ భారతి మర్యాద పూర్వకంగా గవర్నర్ తో భేటీ అయ్యారు. వీరిరువురు దేశంలోని సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో తీసుకువచ్చిన సంస్కరణలు, నూతన పధకాలను గురించి కేంద్ర మంత్రి గవర్నర్ కు వివరించారు. రాష్ట్రంలో అయా పధకాలు అమలవుతున్న తీరును పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. మంత్రి డాక్టర్ పవార్ తో పాటు ఆమె భర్త ప్రవీణ్ అర్జున్ పవార్ కూడా ఉన్నారు. వీరిరువురినీ గవర్నర్ శాలువా, మోమొంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో రాజ్ భవన్ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
In this article:bharatpawaar, biswabhooshanharichandan, centralminister, Governor, rajbhavan
Click to comment