అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సావాలు జరుపుకోవడం తెలుగు జాతికే కాకుండా దేశానికే గర్వకారణమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. చిన్న వయసులోనే బ్రిటీష్ వారిని గడగడలాడించి.. గిరిజనులందరినీ సమీకరించి సాయుధ పోరాటంతో ముందుకు సాగరని కొనియాడారు. అల్లూరి పోరాటం తట్టుకోలేక బ్రిటిష్ వారు 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అంతమొందించారని తెలిపారు. 27 సంవత్సరాల వయసులోనే బ్రిటీష్ వారు అంతమొందించినా.. ఆయన పోరాటం మాత్రం శాశ్వతంగా నిలిచిపోయిందని గుర్తు చేశారు. అల్లూరి 125వ జయంతి ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహించటం శుభపరిణామని తెలిపారు. ప్రధాని నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ పరంగా స్వాగతిస్తున్నామన్నారు. పార్లమెంట్లో అల్లూరి విగ్రహం పెట్టాలని కోరారు.
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
నిరంకుశ పాలకుల చేతుల్లో నలిగిపోతున్న గిరిజనుల్లో ధైర్యం నింపిన ఉత్తేజం అల్లూరి సీతారామరాజు అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొనియాడారు. స్వాతంత్య్ర పోరులో ధృవతారలా మెరిసి బ్రిటీష్ వారి గుండెల్లో దడపుట్టించిన మన్యం వీరుడు అల్లూరిని ఆజాది కా అమృత మహోత్సవ్లో భాగంగా స్మరించుకోవడం మనకు గర్వకారణమన్నారు. అల్లూరి 125వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరగడం సంతోషంగా ఉందని తెలిపారు. అల్లూరి 125వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని చేతుల మీదుగా అల్లూరి విగ్రహావిష్కరణ జరగడం ఒక తెలుగువాడిగా సంతోషంగా ఉంది. అల్లూరి జయంతి సందర్భంగా ఆ విప్లవజ్యోతి సాహస చరిత్రను స్మరించుకుని స్ఫూర్తిని పొందుదాం.
#AlluriSitaRamaraju
ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ మన్యం వీరుడికి గాన నివాళి ఆర్పించారు. అల్లూరిపై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి విజయవాడలో ఆవిష్కరించారు. డాక్టర్ ముకుంద శర్మ గీతాన్ని రచించగా.. గజల్ శ్రీనివాస్ గానం, సంగీతం సమకూర్చారు. బ్రిటిషు పాలకులను ఎదిరించి సాయుధ పోరాటం చేసిన మన్యం ప్రాంత విప్లవ వీరుడు..భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు (1897 జూలై 4 – 1924 మే 7) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.
సీతారామరాజు ఇంటిపేరు అల్లూరి. అల్లూరివారు. తూర్పు గోదావరి జిల్లా కోనసీమకు చెందిన రాజోలు తాలూకా కోమటిలంక, బట్టేలంక గ్రామాలలో స్థిరపడ్డారు. కోమటిలంక గోదావరిలో మునిగిపోవడంవల్ల అక్కడి అల్లూరి వారు అప్పనపల్లి, అంతర్వేది పాలెం, గుడిమాల లంక, దిరుసుమర్రు, మౌందపురం వంటిచోట్లకు వలస వెళ్ళారు. ఇలా అప్పనపల్లి చేరిన అల్లూరి వీరభద్రరాజు తరువాత గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకాలోని బొప్పూడి గ్రామంలో స్థిరపడ్డాడు. ఇతనికి ఆరుగురు కుమారులు — వెంకట కృష్ణంరాజు, సీతారామరాజు, గోపాలకృష్ణంరాజు, వెంకట నరసింహరాజు, అప్పలరాజు, వెంకట రామరాజు. వీరిలో గోపాలకృష్ణంరాజు కొడుకు వెంకటకృష్ణంరాజు (సీతారామరాజుకు తాత), వెంకటకృష్ణంరాజు, అతని పెదతండ్రి వెంకట నరసింహరాజు బొప్పూడి గ్రామంనుండి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో స్థిరపడ్డారు. వెంకటకృష్ణం రాజు ఐదుగురు కొడుకులు రామచంద్రరాజు, వెంకటరామరాజు (సీతారామరాజు తండ్రి), రామకృష్ణంరాజు, రంగరాజు, రామభద్రరాజు
.. ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరు పరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజును (ఒక చెట్టుకు కట్టివేసి) ఏ విచారణ లేకుండా గుడాల్ కాల్చి చంపాడు. తల్లికి కూడా రాజు మరణ వార్తను తెలియజేయలేదు. మే 8 న రాజు దేహాన్ని ఫొటో తీయించిన తరువాత దహనం చేసారు. అతని చితా భస్మాన్ని సమీపంలో ఉన్న వరాహ నదిలో కలిపారు. ఆ విధంగా కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరుడయ్యాడు. కృష్ణదేవిపేట (కే.డి పేట)లో ఆయన సమాధి ఉంది.
ఇతర విప్లవ వీరులు
సీతారామరాజు మరణంతో మిగిలిన విప్లవవీరులు ప్రాణాలకు తెగించి విజృంభించారు. వారి దుస్సాహసాల వలన పరిణామాలు విపరీతంగా జరిగాయి. కొందరు పోరాటాలలో మరణించారు. మరికొందరు పట్టుబడ్డారు. ఎండు పడాలును మే 26న గ్రామ ప్రజలు పట్టుకొని చంపివేశారు. సంకోజీ ముక్కనికి 12 సంవత్సరాల శిక్ష విధించారు. గంటదొర భార్యను, కూతురిని బంధించారు. జూన్ 7న “పందుకొంటకొన” వాగువద్ద గంటందొర సహచరులకు, సైనికులకు చాలాసేపు యుద్ధం జరిగింది. చాలా సేపు చెట్టు చాటునుండి తుపాకీ కాల్చిన గంటందొర తూటాలు అయిపోయాక ముందుకొచ్చి ధైర్యంగా నిలబడ్డాడు. అతనిని కాల్చివేశారు. జూన 10వ తేదీన గోకిరి ఎర్రేసును నర్సీపట్నం సమీపంలో పట్టుకొన్నారు. జూన్ 16న బొంకుల మోదిగాడు దొరికిపోయాడు. 22-8-1922న ఆరంభమైన ఈ మన్యం వీరుని విప్లవ పోరాటం 1924 జూలై మొదటివారంలో అంతమైందనవచ్చును. సీతారామరాజు తల్లి 1953 ఆగష్టు 30న, తన 77వ యేట మరణించింది. అతని సోదరి సీతమ్మ భీమవరంలో 1964 జూలై 8న మరణించింది. అతని తమ్ముడు సత్యనారాయణరాజు ఉపాధ్యాయునిగా పదవీవిరమణ చేసి పెద్దాపురం వద్ద బూరుగుపూడిలో నివసించాడు. ఇతని కుమారులు శ్రీరామరాజు, వెంకటసుబ్బరాజు, తిరుపతిరాజు. భారత తపాల శాఖ 1986లో అల్లూరి సీతారామ రాజు స్మారక తపాలా బిళ్ల విడుదల చేశారు
అల్లూరి సీతారామరాజు విప్లవంపై ఆనాటి పత్రికల అభిప్రాయాలు ఇలా ఉండేవి.. రంప పితూరీని పూర్తిగా అణచివేస్తే ఆనందిస్తామని ప్రచురించింది కాంగ్రెస్ పత్రిక. అటువంటి (రాజు) వారు చావాలి అని ప్రచురించింది స్వతంత్ర వార పత్రిక (1924 మే 13, 20). విప్లవకారులను ఎదుర్కోవడం కొరకు ప్రజలకు, పోలీసులకు మరిన్ని ఆయుధాలు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని విమర్శించింది కృష్ణాపత్రిక. అయితే రాజు మరణించాక పత్రికలు ఆయనను జాతీయ నాయకుడిగా, శివాజీగా, రాణా ప్రతాప్‌గా, లెనిన్‌గా కీర్తించాయి. రాజు వీర స్వర్గమలంకరించాడని రాసాయి. సత్యాగ్రహి అనే పత్రిక రాజును జార్జి వాషింగ్టన్తో పోల్చింది. 1929లో మహాత్మా గాంధీ ఆంధ్ర పర్యటనలో ఉండగా ఆయనకు అల్లూరి చిత్రపటాన్ని బహూకరించారు. తరువాతి కాలంలో రాజు గురించి ఆయన ఇలా రాసాడు .. శ్రీరామరాజువంటి అకుంఠిత సాహసము, త్యాగదీక్ష, ఏకాగ్రత, సచ్చీలము మనమందరము నేర్చుకొనదగినది. సాయుధ పోరాటం పట్ల నాకు సానుకూలత లేదు, నేను దానిని అంగీకరించను. అయితే రాజు వంటి ధైర్యవంతుని, త్యాగశీలుని, సింపుల్ వ్యక్తి, ఉన్నతుని పట్ల నా గౌరవాన్ని వెల్లడించకుండా ఉండలేను. రాజు తిరుగుబాటుదారు కాదు, ఆయనో హీరో. – (యంగ్ ఇండియా పత్రిక – 1926)
సుభాష్ చంద్రబోస్
సీతారామరాజు జాతీయోద్యమానికి చేసిన సేవను ప్రశంసించే భాగ్యం నాకు కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. …. భారతీయ యువకులు ఇలాంటి వీరులను ఆరాధించడం మరువకుందురు గాక. పింఛనుకూ నోచుకోని అల్లూరి మాతృమూర్తి అల్లూరి మరణానంతరం ఆయన తల్లి సూర్యనారాయణమ్మను మన పాలకులు విస్మరించారు. స్వాతంత్య్ర భారతదేశంలో ఆమె పింఛనుకు కూడా నోచుకోలేకపోయారు. మద్రాసు రాజధానిగా ఉన్న సమయంలో పింఛను కోసం ఎంతోమంది దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య, అప్పటి ముఖ్యమంత్రిని కలిసి తన కుమారుడు స్వాతంత్య్ర పోరాటంలో చనిపోయాడని, తనకు పింఛను ఇవ్వాలని సూర్యనారాయణమ్మ దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆమె దరఖాస్తును వారు తిరస్కరించారు. 1953 అక్టోబరు 30న 77 ఏళ్ల వయసులో ఆమె అనారోగ్యంతో కన్నుమూశారు.