రోజుకో కొత్త అంశం తెరపైకి వస్తోంది. తాజాగా ఈ పదాలు పార్లమెంట్ లో వాడకూడదు అంటూ కొన్ని పదాలతో బుక్ లెట్ లో విడుదల చేశారు. దీనిపై రాజకీయంగా దుమారం రేగటంతో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా దీనిపై వివరణ ఇచ్చారు. అభ్యంతకర పదాలు ఎవరైనా వాడితే వాటిని రికార్డుల నుంచి తొలగిస్తామన్నారు. తాజాగా పార్లమెంట్ ఆవరణలో ధర్నాలు. నిరసన ప్రదర్శనలకు అనుమతి లేదంటూ రాజ్యసభ సెక్రటేరియట్ ఓ సర్కులర్ జారీ చేసింది. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీ సీ మోడీ పేరుతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ధర్నా, నిరసన, సమ్మె, నిరహారదీక్ష, మతపరమైన కార్యక్రమాలకు ఈ ప్రాంగణాన్ని ఉపయోగించరాదంటూ పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. విశ్వ గురు నుంచి మరో ఆయుధం వచ్చింది..ధర్నాలు నిషేధం అంట అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఈ నిర్ణయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వ్యాఖ్యానించారు. పలు పార్టీ లు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు వ్యతిరేకిస్తూ సభా ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద మౌన ప్రదర్శనలు..నిరసనల తెలియజేస్తుంటాయి. ఇది ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయం. ఇప్పుడు దానికి బ్రేక్ లు వేశారు.
Vishguru's latest salvo — D(h)arna Mana Hai! pic.twitter.com/4tofIxXg7l
— Jairam Ramesh (@Jairam_Ramesh) July 15, 2022
పార్లమెంట్ (Parliament) ఆవరణలో “ఎటువంటి ప్రదర్శనలు, ధర్నాలు, సమ్మెలు, నిరాహారదీక్షలు లేదా ఏదైనా మతపరమైన వేడుకలు నిర్వహించేందుకు సభ్యులు పార్లమెంట్ హౌస్ ఆవరణను ఉపయోగించలేరు.” అని బులెటిన్‌లో పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ ఖండించారు. విశ్వగురు కొత్త నాటకమని.. “ధర్నా మనా హై అంటూ..” జైరాం తన ట్విట్టర్‌లో ఆరోపించారు. జూలై 14న జారీ చేసిన సర్క్యులర్ కాపీని పంచుకున్నారు. కాగా ఇప్పటి వరకు చాలాసార్లు విపక్ష నేతలు పార్లమెంట్ ఆవరణలోనూ, మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నిరసనలు, ప్రదర్శనలు చేపట్టేవారు. నిరాహార దీక్షలు కూడా చేసేవారు. ఇకపై ఆ అవకాశం లేకపోవడంపై విపక్ష నేతలు మండిపడుతున్నారు. ఇలాంటి నిబంధనలు సరికాదంటున్నారు. ఇప్పటికే వాడకూడని పదాల జాబితాను లోక్‌సభ విడుదల చేసింది. వాటిలో అవినీతి పరుడు, సిగ్గు చేటు, డ్రామా, జుమ్లాజీవి, పిరికివాడు, చీకటి రోజులు, అహంకారి వంటి పదాలు ఉన్నాయి. దీనిపై కూడా ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి సాధారణంగా వాడే పదాలను కూడా మాట్లాడకూడదని చెప్పడం సరైనది కాదని మండిపడ్డాయి. దీనిపై రాజ్యసభ ఛైర్మన్, లోక్‌సభ స్పీకర్ వీటిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలాఉంటే కొన్ని పదాలను పార్లమెంట్‌లో వాడరాదని వచ్చిన వార్తలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కొట్టిపారేసిన విషయం తెలిసిందే. కానీ ఆయా పదాలను అవసరాన్ని బట్టి రికార్డుల నుంచి తొలగిస్తామన్నారు.