జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో ఏపీ మూడో స్థానంలో ఉందని కేంద్ర పౌరసరఫరాల శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి శుక్రవారం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఒడిశా, ఉత్తరప్రదేశ్ మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయని, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పౌర సరఫరాల వ్యవస్థ పనితీరు ఆధారంగా ర్యాంక్‌ను నిర్ణయించామన్నారు. టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పనితీరు ఆధారంగా ర్యాంక్ లెక్కించబడుతుంది. మెరుగైన పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలకు ఎలాంటి ప్రోత్సాహకాలను విస్తరించే ప్రతిపాదన లేదన్నారు. 2022-23 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో 20,000 హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఎంపీ అడిగిన మరో ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమగోదావరిలో దాదాపు 5.31 లక్షల హెక్టార్లు పామాయిల్ సాగుకు అనువుగా ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు.దేశంలో ఆయిల్‌పామ్ సాగుకు రూ.62 కోట్లు కేటాయించామని, రాష్ట్ర వాటాగా రూ.41 లక్షలు భరించాల్సి ఉందని కేంద్రమంత్రి తెలిపారు.
MSK పథకం నిలిపివేయబడింది : కేంద్ర మంత్రి
నవంబర్ 2017లో ప్రవేశపెట్టిన మహిళా శక్తి కేంద్రం పథకం ఏప్రిల్ 1, 2022 నుండి అమల్లోకి రాకుండా నిలిచిపోయింది. ఈ విషాయమై శుక్రవారం లోక్‌సభలో వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఎంపీలు జి.మాధవి, పివి.మిధున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మహిళల భద్రత, సాధికారత కోసం ‘మిషన్ శక్తి’ అనే కొత్త పథకం ప్రారంభించామని పధకానికి సంబందించిన నిబంధనల గురించి కేంద్ర మంత్రి వివరించారు.