రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యంగ్య ట్వీట్లతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. రోజుకో ట్వీట్‌తో రాష్ట్రంలో వైసీపీ పరిపాలన ఏ విధంగా ఉందో తెలియజేస్తున్నారు. తాజాగా రోడ్ల అధ్వాన్న స్థితిపై ఛిద్రమైన రహదారి అంటూ ఓ వీడియోతో పాటు… ప్రత్యేక వ్యంగ్య చిత్రాన్ని ట్వీట్ చేశారు. #GoodMorningCMSir అనే డిజిటల్ క్యాంపెయిన్‌లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. రావులపాలెం నుంచి అమలాపురం వెళ్ళే రోడ్డు దుస్థితిని తెలిపే వీడియోను జనసేనాధిపతి ట్విటర్‌లో పోస్టు చేశారు. కొత్తపేట దగ్గర ఉన్న గుంతలు, అక్కడి పరిస్థితి ఈ వీడియోలో తెలుస్తోందంటూ పోస్ట్ చేశారు. దానికి #GoodMorningCMSir అని హ్యాష్ ట్యాగ్‌ను జత చేశారు.
#GoodMorningCMSir pic.twitter.com/SmVloBOsV4
— Pawan Kalyan (@PawanKalyan) July 15, 2022
రోడ్డు మీద ప్రయాణం సర్కస్ ఫీట్‌లా ఉంటుంది. రాష్ట్రంలో రోడ్డు ప్రయాణం ఎంత నరకప్రాయంగా మారిందో తెలుస్తుంది. హెలికాప్టర్‌లో వెళ్తున్న సీఎం రోడ్డు మీద ద్విచక్ర వాహనాలపై వెళ్ళే వాళ్ళను వింతగా చూస్తుంటారు. ఒక్కో గోతిలో నుంచి గాల్లో ఎగిరి అంతా దూరాన మరో గోతిలో ఉన్న నీళ్ళలో పడుతుంటే… వారి వాహనాలు గాల్లో ఉన్నట్లు ఆ వ్యంగ్య చిత్రం ఉంది. రాష్ట్రంలో రోడ్లపై ప్రయాణిస్తున్నవారి పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో కార్టూన్ ద్వారా అర్ధమవుతుంది.
ముఖ్యమంత్రిని నిద్ర లేపుదాం -నాదెండ్ల మనోహర్
రాష్ట్ర రోడ్ల పరిస్థితి పై నిద్రలో జోగుతున్న ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డిని జనసేన పార్టీ మరోసారి చేపట్టబోయే డిజిటల్ క్యాంపైన్ ద్వారా నిద్ర లేపుదాం. గత సెప్టెంబరులో జనసేన పార్టీ రోడ్ల పరిస్థితి పై నిర్వహించిన రాష్ట్రవ్యాప్త క్యాంపైన్ జాతీయ స్థాయిలో సంచలనం అయింది. 1.70 కోట్ల మంది దానిలో పాల్గొన్నారు. జాతీయ మీడియాలోనూ ఒక రాజకీయ పార్టీ వినూత్నంగా చేపట్టిన నిరసన కార్యక్రమానికి మంచి ఆదరణ వచ్చింది. అప్పుడు కళ్ళు తెరిచిన రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే రోడ్లు బాగు చేస్తామని చెప్పింది. బడ్జెట్లో ఏకంగా రూ.27 వేల కోట్లు రోడ్ల గురించి ఖర్చు పెడతామని చెప్పారు. ఇటీవల రోడ్లు వేసేందుకు రూ. 6000 కోట్ల అప్పు తెచ్చారు. జూలై 15వ తేదీ నాటికి రాష్ట్రంలోని రోడ్లను పూర్తిస్థాయిలో బాగు చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గట్టిగా చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పిన తేదీ పూర్తికావచ్చిన తరుణంలో జనసేన పార్టీ రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిని మరోసారి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఈనెల 15, 16 తేదీల్లో డిజిటల్ క్యాంపెయిన్ కు శ్రీకారం చుడుతోంది. దీనిలో ప్రతి ఒక్క జన సైనికుడు పాల్గొని రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిని ‘గుడ్ మార్నింగ్ సీఎం సార్’ అని మేల్కొలపాలి. ఇది మన అందరి బాధ్యత.
ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ కు అవినీతి పై దృష్టి- పోతిన వెంకట మహేష్
విజయవాడ లో కె టి రోడ్డు నిర్మాణం కోసం రెండు సంవత్సరాల సమయం కావాలా అని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు జనసేన నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు… రాష్ట్రంలో అధ్వాన్న స్థితిలో ఉన్న రోడ్ల పరిస్థితులపై నిద్రపోతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మేల్కొపెందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గుడ్ మార్నింగ్ సార్ ప్రోగ్రాం తో వినూత్న నిరసన తెలియజేస్తున్నారు. అందులో భాగంగా విజయవాడలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఊర్మిళ నగర్ లో రోడ్ల దుస్థితి చూసి తదుపరి విజయవాడ నగరం లో ఉన్నామో లేక మారుమూల పల్లెలో ఉన్నామో అర్థం కావడం లేదు. గోతులు పడ్డ రోడ్లకు మరమ్మతులు చేయలేని ప్రభుత్వం పాలనకు పనికిరాదు. రోడ్డు సెజ్ల పేరుతో వసూలు చేసిన డబ్బులు మరియు రోడ్ల మరమ్మతు కోసం బ్యాంకు నుంచి తెచ్చిన అప్పులు రెండు వేల కోట్లు ఏమయ్యాయో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. స్థానిక ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ నియోజకవర్గ అభివృద్ధికి గాలికొదిలేసి అవినీతి పై దృష్టి సారించడం వల్ల పశ్చిమ నియోజకవర్గం లో రోడ్లకు ఈ దుస్థితి.
#GoodMorningCMSir
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 43 వ డివిజన్ ఊర్మిళ నగర్ లో @ysjagan గారు@PawanKalyan@JanaSenaParty @JSPShatagniTeam pic.twitter.com/uKPzjoB6QA— Pothina venkata mahesh (@JSPpvmahesh) July 15, 2022
నేటి నుంచి డిజిటల్ క్యాంపెయిన్
ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితిపై #GoodMorningCMSir హ్యష్ టాగ్ తో ఈనెల 15,16,17 తేదీలలో జనసేన పార్టీ తరుపున డిజిటల్ క్యాంపెయిన్ యువత తమ అభిప్రామయలను పంచుకొవాలని నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ పిలుపు నిచ్చారు…నగరంలోని రోడ్ల పరిస్థితి సంబంధించిన చిత్రాలను #GoodMorningCMSir షేర్ చేయాలన్నారు… ఈ నెల 16న మండపేటలో ఆత్మ హత్య చేసుకొన కౌలు రైతు కుటుంబలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం ఒక ఒక కుటుంబనికి లక్చ రూపాయలు అందచేయానున్నారు…