కొనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ గత నెల 24న జిల్లా కేంద్రం అమలాపురంలో పెద్ద ఎత్తున అల్లర్లు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అమలాపురంలో అల్లర్ల ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. పలువురిపై కేసులు నమోదు చేస్తూ, అరెస్ట్‌లు చేస్తున్నారు. తాజాగా ఈ కేసులో వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి విశ్వరూప్ అనుచరులు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విశ్వరూప్ అనుచరులను.. A-225గా సత్యరుషి, A-226గా సుభాష్, A-227గా మురళీకృష్ణ, A-228గా రఘులను చేర్చారు. A-222 నిందితుడిగా ఉన్న సత్యప్రసాద్ వాంగ్మూలంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. నలుగురు అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
నిందితులపై రౌడీషీట్లు : డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి
కొనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ గత నెల 24న జిల్లా కేంద్రం అమలాపురంలో పెద్ద ఎత్తున అల్లర్లు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
Konaseema జిల్లా పేరు మార్పు వివాదంపై అమలాపురంలో జరిగిన అల్లర్లలో దగ్ధమైన మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లను DGP Rajendranath Reddy పరిశీలించారు. . పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన…
కోనసీమ జిల్లా అమలాపురంలో గత నెల 24న అల్లర్లు, విధ్వంసానికి పాల్పడిన నిందితులపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఆయన అమలాపురంలో ఆకస్మికంగా పర్యటించారు. అల్లర్లలో కాలిన మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీ్‌షకుమార్ ఇళ్లను, కలెక్టరేట్ ప్రాంతాన్ని పరిశీలించారు.ఈ కేసుల్లో ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, ఇప్పటివరకు 258 మంది నిందితులను గుర్తించగా.. వారిలో 142 మందిని అరెస్టు చేశామని, మరో 116 మంది కోసం ఏడు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు.
కోనసీమ జిల్లాల్లో విధ్వంసానికి పాల్పడిన వారిలో సగం మంది వరకు అరెస్ట్ చేశారు. మరో 126 మంది నిందితులు పరారీలో ఉన్నారని వారిని పట్టుకోవడానికి ఏడు బృందాలని ఏర్పాటు చేశామని డీజీపీ తెలిపారు. అమలాపురం అల్లర్ల కేసులలో రాజకీయ పార్టీల పరంగా కార్యకర్తలను టార్గెట్ చెయ్యలేదని, సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల గుర్తించామని స్పష్టం చేశారు. అల్లర్ల సమయంలో కాల్పుల సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు సంయమనం పాటించారని డీజీపీ చెప్పారు.
వాట్సాప్ మెస్సేజ్‌లతోనే విధ్వంసం..
సోషల్ మీడియా వేదికగా అమలాపురంలో విధ్వంసానికి ప్లాన్ చేశారని డీజీపీ తెలిపారు. వాట్సాప్ మెస్సేజ్‌ల ద్వారా ప్రణాళిక ప్రకారం విధ్వంసం సృష్టించారని, ఆస్తి నష్టం రికవరీపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. త్వరలోనే ఈ నివేదికను ఏపీ హైకోర్టులో ఫైల్ చేస్తామన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నిందితుల నుండి ఆస్తినష్టం రికవరీకి ఒక న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందని ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి వివరించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటామని, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోనసీమ జిల్లాలో ఇలాంటి గొడవలు పునరావృతం కాకుండా చూసేందుకు రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలను నియంత్రించాలని డీజీపీ కోరారు. “మే 24న డ్యూటీలో ఉన్న మా అధికారులకు నిరసనకారులపై కాల్పులు జరపకుండా ఓపికగా ఉండాలని చెప్పాం.