రాష్ట్రంలో అధికార వైసీపీ నేతల వేదింపులు ప్రతిపక్షాల మీద రోజు రోజుకీ ఎక్కువ అయిపోతున్నాయి. వారి వేదింపులు తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. చట్టాన్ని న్యాయాన్ని రక్షించాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తుతున్నారు. తాజాగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముదాపక పంచాయతీ గోవిందపురం గ్రామానికి చెందిన సారిపల్లి సోమేశ్వరరావు ఈనెల 8వ తేదీన ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అయితే కేజీహెచ్ లో చికిత్స పొందుతూ ఆయన ఈరోజు ఉదయం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మృదేహానికి నివాళులు అర్పించడానికి మృతుడి గ్రామానికి పయనమయ్యారు. ఆయనతో పాటు GVMC టీడీపీ ఫ్లోర్ లీడల్ పీలా శ్రీనివాస రావు, టీడీపీ నాయకులు ఉన్నారు. అయితే అప్పటికే గోవిందపురంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. టీడీపీ నేతలు, పక్క గ్రామాల ప్రజలు వస్తున్న విషయం తెలుసుకుని వెళ్లి మార్గ మధ్యంలోనే వారిని అడ్డుకున్నారు. వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని లేకుంటే అరెస్టులు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. అయినా టీడీపీ నాయకులు వినకుండా రోడ్డుపై బైఠాయించారు.
పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, వైకాపా నాయకుల ప్రోద్భలంతో పోలీసులు, రెవిన్యూ అధికారులు ఓ భూవివాదంలో సోమేశ్వర రావును వేధించారని.. అది భరించలేకే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడని బండారు సత్య నారాయణ ఆరోపించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి మమ్మల్ని అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. నేతలు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, స్థానిక ప్రజలకు మధ్య తోపులాట జరిగింది. అయితే సోమేశ్వర రావు చావుకు కారణం అయిన వారిపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని మాజీ మంత్రి బండారు సత్యనారయణ ఆరోపించారు.