టీటీడిలో మే14 తో ముగిసిన డెప్యూటేఫన్ –
ఇంతకన్నా సమర్ధులు లేరా?
టీటీడీ ఈవో ఏ.వి ధర్మారెడ్డి కోసం ఎక్కడిదాకైనా వెళ్లాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిన్నట్లు ఉంది. “రెడ్డి” అధికారిపై సీఎం జగన్‌మెహన్ రెడ్డికి ఎందుకు అంత ప్రేమ అనేది ఆంధ్రరాష్ట్ర ప్రజల సందేహం.
ధర్మారెడ్డి వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ అధికారి .. ఐడీఈఎస్ (ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్) ద్వారా రక్షణ శాఖలో జాయింట్ సెక్రటరీ హోదాలో ఉద్యోగం చేస్తున్నారు…కేంద్ర రక్షణశాఖ ఉద్యోగి అయిన ధర్మారెడ్డిని డిప్యూటేషన్ మీద ఏపీకి తీసుకు వచ్చి టీటీడీ ప్రత్యేక అధికారిగా నియమించారు. ఇటీవల వరకూ ఈవోగా జవహర్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడాయని పూర్తి స్థాయిలో సీఎంవోకు వెళ్లారు. దీంతో ధర్మారెడ్డికే ఈవోగా అదనపు చార్జ్ ఇచ్చారు. కానీ ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అదనపు చార్జీగా వున్న ఏ.వి ధర్మారెడ్డి డెప్యూటేషన్ మే14 తో ముగియడంతో ఆయన తన మాతృసంస్థ కు వెళ్ళి పోవాలి. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అవసరమైతే కేంద్ర సర్వీసులకు ధర్మారెడ్డి చేత రాజీనామా చేయించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో మళ్ళీ అదే పదవిలో రెండేళ్ళ కాలానికి నియమించే ప్రక్రియలో ఉన్నట్లు సమాచారం. రెడ్ల కోసం ఇంత పట్టుదలకు పోవడం చాలా సార్లు జరిగిందని .. ఇదంతా వైసీపీ ప్రభుత్వంలో సహజమేనని రాజకీయ నిపుణులు అంటున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డి డిప్యుటేషన్ గడువు ముగిసినందున తక్షణమే ఆయనను కేంద్రంలోని మాతృశాఖకు పంపించాలని డిమాండ్ చేస్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీకి, సంబంధిత కేంద్ర శాఖలు, పలువురు అధికారులకు కర్ణాటకలోని హనుమద్ జన్మభూమి ట్రస్టు ట్రస్టీ గోవిందానంద సరస్వతి లేఖలు రాశారు.
ధర్మారెడ్డి వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ అధికారి అని.. ఐడీఈఎస్ (ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్) ద్వారా రక్షణ శాఖలో జాయింట్ సెక్రటరీ హోదాలో ఉద్యోగం చేస్తున్నారని గోవిందానంద సరస్వతి తెలిపారు. మే14తో ఆయన గడువు కూడా ముగిసిందని వివరించారు.
కేంద్ర ప్రభుత్వం డిప్యుటేషన్ పొడిగింపు ఉత్తర్వులు ఇస్తే తప్ప ఆయన ఇపుడున్న హోదాలో కొనసాగే వీల్లేదని వివరించారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనను వెంటనే మాతృశాఖకు పంపాలని డిమాండ్ చేశారు.
ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.