వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికితోడు తూర్పు, పడమర ద్రోణి మరికొన్ని రోజులు దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా మధ్యే కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. వీటి ప్రభావంతో మధ్య, పశ్చిమ భారతం, ఏపీ, తెలంగాణల్లో అనేకచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది..
ఎప్పుడూ లేని విధంగా జూలైలోనే భారీ వరద రావడంతో గోదావరి, కృష్ణా నది ఉగ్రరూపం దాల్చుతోంది. గంట గంటకూ వరద ఉధృతి పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరు వైరా కటల్లేరుల్లో వరద ప్రవాహం పెరుగుతోంది. మున్నేరు నుంచి కీసర వద్ద కృష్ణ నది లోకి 38 వేల 800 వందల క్యూసెక్యుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రకాశం బ్యారేజ్ వద్ద 12 అడుగుల నీటి మట్టం నిల్వ చేస్తూ అదనపు నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ 45 గేట్లు అడుగు మేర ఎత్తి 34,000 క్యూసెక్యుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. త్రాగు, సాగు నీటి అవసరాల కోసం కృష్ణా, ఈస్ట్రన్ అండ్ వెస్ట్రన్ కాలువలకు 4,800 క్యూసెక్యుల నీటి విడుదల చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం 8 అడుగులకు చేరింది. దీంతో అధికారులు బ్యారేజీ 175 గేట్లు ఎత్తివేత ఆరు లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు కోనసీమ లంక గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో పలు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నాటుపడవలపైనే రాకపోకలు కొనసాగుతున్నాయి. అలాగే పాపికొండల విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అటు విలీన మండలాల్లో శబరి, గోదావరి భారీ వర్షాలకు పొంగి ప్రవహిస్తోంది. చింతూరు మండలం సోకిలేరు వంతెనపై వరద నీరు ప్రవహిస్తుండటంతో చింతూరు – విఆర్ పురం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం వద్ద గోదావరి నీటిమట్టం 38 అడుగులకు చేరుకుంది. వీఆర్‌పురం మండలం ములకపాడు గ్రామ సమీపంలోకి గోదావరి పోటెత్తింది. దీంతో గ్రామస్తులు కొండలపై తాత్కాలిక గుడిసెలు వేసుకుని తల దాచుకుంటున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ అధికారులు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాజమండ్రి ఎగవ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీటి ప్రవాహంతో కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలకు వేసిన తాత్కాలిక రోడ్లు కొట్టుకపోయాయి. దీంతో ప్రజలు నాటుపడవలపైనే ప్రయాణం చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా పాపికొండల విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
ఏలూరు జిల్లా లో 38.2 మీ.మీ సగటు వర్షపాతం- జిల్లా కలెక్టర్
ఏలూరులో 38.2 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ తెలిపారు.అత్యధికంగా లింగపాలెం మండలంలో 70.2 మి.మి. వర్షపాతం నమోదు కాగా పెదవేగి మండలం లో 12.4 మిమి నమోదైందన్నారు.చింతలపూడి లో 69.2 మిమీ, కొయ్యలగూడెం లో 66.6, చాట్రయిలో 63.2,వేలేరుపాడు లో 58.2, నూ జివీడులో 57.6,కుకూనూర్ లో 54.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
భారీ వర్షాలు,వరదలు నేపథ్యంలో ఏలూరు కలెక్టరేట్ లో 24 గంటలు పనిచేసే విధంగా 1800 233 1077 నెంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఎమైన సాయం కావాల్సిన ప్రజలు తప్పక వినియోగించుకోవలన్నరు గోదావరి పరివాక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు మూలంగా గోదావరి వరద ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో నది పరివాక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా వుండ
ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కుక్కునూరు – దాచారం గ్రామాల మధ్య గుండేటి వాగు బ్రిడ్జిపై గోదావరి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో కుక్కునూరు మండలంలో పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండలంలో ఎద్దు వాగు కాజ్వేపైకి వరద నీరు చేరడంతో ఏజెన్సీలోని 15 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. అటు ఎడవల్లి వద్ద కాజ్వేపై గోదావరి వరద నీరు చేరింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు లోతు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మరోవైపు భారీ వర్షాల కారణంగా రహదారులు దెబ్బతిన్నాయి.
కొనసీమ అల్లవరం లో ఓడరేవు తీరానికి పది కిలోమీటర్ల లోపల చిక్కుకున్న మత్స్యకారులు క్షేమంగా ఉన్నారు. కాకినాడ నుంచి రెండు బోట్ల లో ఈనెల 7న 16 మంది మత్యకారులు వేటకు వెళ్లారు. సముద్రం మధ్యలో సాంకేతిక లోపంతో బోటు నిలిచిపోయింది. వీరందరిని ఓఎంజీసీ ఉర్జా షిప్ రక్షించింది.
భారీ వరద రావడంతో పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం
పోలవరం ప్రాజెక్టుకు ఆకస్మిక భారీ వరద పెరిగింది. ఎప్పుడూ లేని విధంగా జులైలోనే భారీ వరద రావడంతో పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం ఏర్పడింది. పోలవరం స్పిల్ వే దగ్గర 30.1 మీటర్లకు గోదావరి నీటిమట్టం చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇవాళ అర్ధ రాత్రికి 6 లక్షలు రేపు ఉదయానికి 12 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఆకస్మికంగా గోదావరికి వరద పెరిగింది. గతంలో జులై నెలలో 30 నుంచి 50 వేల క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చేది.
ఆకస్మికంగా వరదలు రావడంతో పోలవరం ప్రాజెక్టు పనులకు తీవ్ర ఆటంకం. దీనికి తోడు స్దానికంగా కురుస్తున్న వర్షాలు సైతం ముందస్తు చర్యలు చేయలేని పరిస్దితి. ప్రస్తుతం దిగువ కాఫర్ ఢ్యాం దగ్గర గోదావరి నీటి మట్టం 19.5మీటర్లు. ప్రస్తుతం దిగువ కాఫర్ ఢ్యాం 21మీ ఎత్తకు పూర్తైంది.గంటకు 25సెంమీ చొప్పున గోదావరి నీటి మట్టం పెరుగుతోంది.అర్దరాత్రికి భారీగా పెరుగుతున్న వరద ప్రవాహంతో దిగువ కాఫర్ ఢ్యాం,గ్యాప్-2పనులు పూర్తిగా నిలిచిపోయే అవకాశం.